ప్రకాశం

జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఒంగోలులో శేషాద్రికి సింగరాయకొండలో హాల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 30:చెన్నైనుండి జోధ్‌పూర్ వెళ్ళే చెన్నై -జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఒంగోలు రైల్వే స్టేషన్‌లో, కాకినాడనుండి బెంగళూరు వెళ్ళే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును సింగరాయకొండలో నిలుపుదల చేసేందుకు రైల్వేబోర్డు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ఆమోదం తెలిపినట్లు ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆదివారం ఒకప్రకటనలో తెలిపారు. ఈ రెండు రైళ్ళకు ఒంగోలులో హాల్టు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. జోధ్‌పూర్‌కు వెళ్ళే రైలు రాత్రి 7.33గంటకు, చెన్నైకి తిరుగుప్రయాణంలో ఉదయం 11.30గంటలకు ఒంగోలులో ఆగనుందన్నారు. శేషాద్రి ఎక్స్‌ప్రెస్ కాకినాడకు వెళ్ళే సమయంలో రాత్రి 9.27గంటలకు, బెంగళూరు వెళ్ళేటప్పుడు తెల్లవారు జామున 1.22గంటలకు సింగరాయకొండలో ఈనెల ఐదవతేదీనుండి ఆగుతాయన్నారు. జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఒంగోలులో నిలుపుదల చేసేందుకు ఒంగోలు నగర, చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 30వేల మంది రాజస్ధానీయులు, వౌంట్‌అబూ వెళ్ళే శాంతి ప్రచారకర్తలు అనేక ఇబ్బందులు పడేవారని ప్రస్తుతం ఒంగోలులో రైలు నిలుపుదల కావటం వలన సుమారు 15సంవత్సరాల కల నెరవేరినట్లైందన్నారు. శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను సింగరాయకొండలో నిలుపుదల చేయటంవలన కందుకూరు, కనిగిరి, సింగరాయకొండ, ఉలవపాడుప్రాంతాలనుండి ఉపాధికోసం బెంగళూరు వెళ్ళే వాళ్ళకు ఈ రైలు ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు. ఈసందర్భంగా రైళ్ళు నిలుపుదలకు సహకరించిన రైల్వేమంత్రి సురేష్‌ప్రభు, రైల్వేబోర్డు చైర్మన్,అధికారులకు ఎంపి సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా తాను ఈనెల రెండవతేదీన ఒంగోలులో కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎంపి సుబ్బారెడ్డి తెలిపారు.
మంత్రి నారాయణ ముందు సమస్యల ఏకరవు

ఒంగోలు,ఏప్రిల్ 30:తమ,తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలతోపాటు, ఉద్యోగుల బదిలీలు,వెలుగొండప్రాజెక్టు వంటి సమస్యలను రాష్ట్ర పురపాలకశాఖమంత్రి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పి నారాయణ దృష్టికి జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్‌చార్జులు తీసుకువచ్చారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో జిల్లాపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో ముందుగా నియోజకవర్గాల వారీగా తమ, తమసమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పశ్చిమప్రాంతంలో ఎక్కువగా మంచినీటి సమస్య ఉందని అందువలన ఆ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని యర్రగొండపాలెం,గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల శాసనసభ్యులతోపాటు, మార్కాపురం ఇన్‌చార్జి పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుమల అశోక్‌రెడ్డి, కదిరి బాబురావు, కందుల నారాయణ రెడ్డి మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గాల్లో డీప్ బోర్లు వేసేందుకు చర్యలు తీసుకుని ప్రజల దాహార్తిని తీర్చాలని వారు మంత్రిని కోరారు. జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ వెలుగొండప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తానే ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశానని, తానే పూర్తిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని అందువలన ప్రాజెక్టును పూర్తిచేస్తే ప్రజల్లో గుర్తిండి పోతుందని మంత్రికి వివరించారు. ఈసందర్భంగా మార్కాపురం ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుఅధికారులకు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేదని దీంతో పనులు సక్రమంగా జరగటంలేదని మంత్రికి తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నికోట్ల రూపాయలు మంజూరు చేసేమన్నది కాదని పనులు వేగవంతంగా అవుతున్నాయా లేవా అనేదే ముఖ్యమని అయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెలుగొండప్రాజెక్టును త్వరితిగతిన పూర్తిచేయకపోతే మాత్రం ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని కందుల వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా నీరు -చెట్టుపనులను కేటాయించాలని మంత్రిని కోరారు.
జిల్లాలో ఉద్యోగుల బదిలీల వ్యవహరంపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రప్రభుత్వం అధికారుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో తమకు అనుకులమైన అధికారులను నియమించుకోవాలనే ఆలోచనలకు తెలుగుతమ్ముళ్ళు నిర్ణయానికి వచ్చినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ వ్యవహరిస్తున్న తీరుపై కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ తన నియోజకవర్గపరిధిలో రోడ్ల నిర్మాణ ఆవశ్యకతను గురించి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
పార్లమెంటు నియోజకవర్గపరిధిలోని ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇన్‌చార్జుల సమస్యలను మంత్రి సావధానంగా విన్నారు.
యర్రగొండపాలెంలో విపక్షానికి ఇంత మెజార్టీనా
ముందుగా పార్లమెంటునియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఏపార్టీకి ఎంత మెజార్టీ వచ్చిందన్న విషయం చర్చకు వచ్చింది. ఈసందర్బంగా పార్టీకార్యాలయం ఇచ్చిన నివేదిక ప్రకారం నియోజకవర్గాల వారిగా పార్టీబలాలను చూస్తుండగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసిపికి 19వేల మెజార్టీ వచ్చిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో పక్కనే ఉన్న యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు కలుగచేసుకుని మెజార్టీ తగ్గించేందుకు తనకు సహయసహకారాలు కావాలని మంత్రిని కోరారు. ఇదిలాఉండగా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇన్‌చార్జుల సిపార్సుల లేఖలు ఉంటనే ప్రజలకు, కార్యకర్తలకు పనులు చేస్తానని మంత్రి నారాయణ కరాఖండిగా ప్రజాప్రతినిధులకు తెల్చిచెప్పారు. కాగా ఈసమావేశానికి రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు హాజరుకాలేదు.
ఈసందర్భంగా మంత్రి నారాయణ విలేఖర్లతో మాట్లాడుతూ ఒంగోలును స్మార్ట్‌సిటిగా అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. జిల్లాతోపాటు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గపరిధిలోని సమస్యలను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు కృషిచేస్తానని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతు రుణమాఫీ, చంద్రన్న బాట, డ్వాక్రారుణాల మాఫీ, రైతురుణమాఫీలను చేపట్టిందని ఆయన తెలిపారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పరిశ్రమలు రావాలన్నా, రెవెన్యూ పెరగాలన్న వౌలిక వసతులు కావాలన్నారు. జిల్లాలోని 12నియోజకవర్గాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధాన చర్చ జరుగుతుందన్నారు. వేసవి కాలంలో జిల్లాలో 28శాతం వర్షపాతం తక్కువుగా ఉందని, మరికొన్ని జిల్లాల్లో 68శాతం వర్షపాతం తక్కువగా ఉందన్నారు. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు
దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్‌చార్జీ మంత్రిగా మునిసిపల్ శాఖమంత్రి నారాయణను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సమస్యలతోపాటు, ఒంగోలు నియోజకవర్గంలో సమస్యలపై పూర్తిస్ధాయిలో చర్చిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలైన నిమ్జ్, వెలుగొండ, పరిశ్రమల హాబ్ తదితర పథకాలను అమలుచేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల రాష్ట్రంలో ఆరు స్మార్ట్‌సిటిలను స్వచ్చ సర్వేక్షణ్ 2017కు సంబంధించి ఎంపిక చేశారని ఆ సిటిల్లో ఒంగోలు కార్పొరేషన్ కూడా చేరటం శుభపరిణామన్నారు.
కాగా సోమవారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని శాసనసభ్యులు, ఇన్‌చార్జులు, జిల్లాకలెక్టర్, పలుశాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, కొండెపి శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు,ముత్తుమల అశోక్‌రెడ్డి, కదిరి బాబురావు, డోలా బాలవీరాంజనేయస్వామి, మార్కాపురం ఇన్‌చార్జి కందుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.