ప్రకాశం

శ్రీవారికి ఘనంగా ఊంజల సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 30: నవరాత్రుల సందర్భంగా ఒంగోలులోని శ్రీ బాపూజి మార్కెట్ కాంపెక్స్‌లో ఆదివారం శ్రీ రామచంద్రులు, సీతమ్మ స్వామి వారికి ఊంజల సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ బాపూజి మార్కెట్ కాంప్లెక్స్ సెక్రటరీ ఇస్కాల వేణుగోపాల్ సారిధ్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిధులుగా ఆంధ్రాబ్యాంకు డిజిఎం కెఎస్‌పివి రమణమూర్తి పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి పూజలు జరింపించారు. ఈ సందర్భంగా అతిధులు, ఆహ్వానితులకు , సభ్యులకు , వ్యాపారులకు , మహిళా మణులకు కుటుంబ సమేతంగా అన్నధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ బాపూజి మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాతా చెంచయ్య గుప్తా, వైస్ ప్రసిడెంట్ తాతా మధు, ఆంధ్రాబ్యాంకు , కాంప్లెక్స్ బ్రాంచి మేనేజర్ మద్దాళి శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌యంఎన్ శ్రీనివాసరావు, బియ్యపు శంకరరావు, కోడూరి శ్రీనివాసులు, జిల్లా వెంకటేశ్వర్లు, బియ్యపు వరదరాజం, మద్దాళి మధు, పువ్వాడ బాలాజి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పిడుగుపాటుతో
రైతు మృతి
పుల్లలచెరువు, ఏప్రిల్ 30: పిడుగుపడి ఓ రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మండల కేంద్రమైన పుల్లలచెరువు తండాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు పుల్లలచెరువు తండాలోని బాణావతు బత్తునాయక్ (25) ఆదివారం తెల్లవారుజామున కప్పలకుంట భూములలో తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా నాలుగు గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం రావడంతో అతనిపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాక్టర్ ఢీకొని హోంగార్డు మృతి
బేస్తవారపేట, ఏప్రిల్ 30: బేస్తవారపేట ఆర్‌కెనగర్ జంక్షన్‌లో ట్రాక్టర్ ఢీకొని హోంగార్డు జి వెంకటరాజు (27) అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. వెంకటరాజు కొమరోలు మండలం తాటిచర్ల గ్రామం నుంచి బేస్తవారపేట పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుండేవారు. ఇతనికి ఆదివారం సెలవు కావడంతో బేస్తవారపేటకు వచ్చి సినిమా చూసి వ్యక్తిగత పనులు ముగించుకొని స్వగ్రామం వెళ్ళేందుకు ఆర్‌కెనగర్ జంక్షన్‌లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వెంకటరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య సుధ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హోంగార్డు మృతిచెందడంతో పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీకొని
8 మందికి తీవ్ర గాయాలు
పామూరు, ఏప్రిల్ 30: ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీకొనడంతో 8మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రావిగుంటపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ నుంచి పామూరుకు వస్తున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కడపకు వెళ్తున్న మినీ లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సాంబశివయ్య పరిశీలించి క్షతగాత్రులను పామూరు వైద్యశాలకు తరలించారు. బస్సును, మినీ లారీని అదుపులోకి తీసుకుని పామూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.