Others

పనికి తగ్గ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలంలో అన్నీ మిక్సీలు వచ్చేసాయి. బర్ మనే శబ్దం తప్ప మరేమీ ఉండదు. కాని పూర్వకాలంలో దంచినా, నూరినా, రుబ్బినా, ఆఖరికి చెరిగినా వంటింటిల్లో చేసే పనుల్లో ప్రతిదానికి ఒక పాటను పాడుకొనేవారు. నలుగురు స్ర్తీలు కూర్చుని పనులు చేసుకొంటూ పురాణ సంబంధమైనవోలేక చారిత్రక వీరుల గురించో ఏదో ఒక విషయానికి సంబంధించి పాటరూపంలో ఆ విషయాలన్నీ చెప్పుకునేవారు. వారు చేసేపనికి ఊతంగా ఈ పాట సాగేది. పాటల్లో కూడా దంపుడు పాటలు, విసురురాతి పాటలు ఇలా వేర్వేరు గమకాలతో - వారు చేసే పనికి తగ్గట్టుగా బాణీలు కట్టి మరీ పాడుకొనేవారు. వాటిల్లో ఎంతో విజ్ఞానం ఉండేది. ఎన్నో సామాజిక సమస్యలకు పరిష్కారాలుండేవి. ఇలాంటి పాటలెన్నో వౌఖికరూపంలోనే ఉంటున్నాయి. వీటిని నేడు సిడీల రూపంలో భద్రపరుస్తున్నారు. కాని ఇంకా భద్రపర్చాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఆచార సంప్రదాయాలు, సంస్కృతీ వైభవాలు ఈ పాటలరూపంలో దాగున్నాయి. వాటిని తర్వాతి తరాలకు అందివ్వాల్సిన బాధ్యత నేటి తరానికి ఉంది.

విసురు రాతి పాట
ఆదివారము అమావాస్యనాడు
అన్న ఇంటికి నేను గినె్న నడుగ బోతె
మా వదినె శాంభవి లేదు పొమ్మనెను
మా యన్న మంచివాడు మళ్లి రమ్మనెను
చిన్నోనికి చీటంగి సిలుకు కుళ్ళాయి
బాలునికి పొట్లంగి పాలు పొసె గినె్న
నాకు నల్లచీర నెమలి వనె్న రవికె
వడినిండ బియ్యము వళ్లొ కొబ్బరిగినె్న
పసుపు కుంకుమ ఇచ్చి పంపె మాయన్న॥