తెలంగాణ

ప్రతీకారం తీర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 4: నల్లగొండ మున్సిపల్ చైరపర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హత్యకు గాంధేయ పద్ధతిలో వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి బదలా తీర్చుకుంటామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా హెచ్చరించారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభకు హాజరై నివాళి అర్పిస్తూ, శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. హత్య కేసులో సీఎం కెసిఆర్ ప్రభుత్వానికి, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశంకు ప్రమేయం ఉండటంతో పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని అన్నారు. హత్య కేసులో తెరాస ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకపోతే, సిబిఐ విచారణను సీఎం కేసీఆర్ కోరాలని సవాల్ చేశారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో చర్చించి హత్య కేసును పార్లమెంటులో ప్రస్తావిస్తామని, సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. కాంగ్రెస్ కంచుకోట నల్లగొండలో పిసిసి చీఫ్ ఉత్తమ్, సిఎల్పీ నేతలు జానా, కోమటిరెడ్డిలు ఉన్నారని, కార్యకర్తలు ధైర్యంగా ముందడుగు వేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. శ్రీనివాస్ సంతాప సభా వేదికపై ఒక్కటిగా నిలిచిన కాంగ్రెస్ నేతల ఐక్యత తెరాస పాలనకు చరమగీతం పాడుతుందన్నారు. సిఎల్పీ నేత కె జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే తెరాస రాజకీయ హత్యకు పాల్పడిందన్నారు. కేసులో కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చిందన్నారు.
సభలో సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి తెరాసపై నిప్పులుకక్కారు. సీఎం కేసీఆర్ తనను రాజకీయంగా ఎదుర్కోలేకే మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరేశంలతో కుట్ర పన్ని శ్రీనివాస్‌ను హత్య చేయించారన్నారు. నల్లగొండలో పోటీ చేస్తానన్న కేసీఆర్, రాజకీయంగా తనతో ప్రజాక్షేత్రంలో తేల్చుకోకుండా హత్య రాజకీయాలకు పాల్పడటం పిరికిపంద చర్య అన్నారు. తాను తలుచుకుంటే నల్లగొండ మోరీలన్ని తేరాస శ్రేణుల మొండాలతో నిండిపోతాయని, కానీ గాంధీ సిద్ధాంతంపై పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తగా తాను తెరాస అరాచకాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే తిప్పికొడతామన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు శ్రీనివాస్ హత్య కేసులో నిందితుల కాల్‌డేటాను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఎక్కడాలేని రీతిలో శ్రీనివాస్ హత్య కేసు నిందితులకు ఐదు రోజుల్లో బెయిల్ రావడం, కేసు విచారిస్తున్న సిఐ అదృశ్యమవ్వడం, నిందితులతో వేముల బ్రదర్స్‌కు సంబంధాలు బయటపడటం వంటి పరిణామాలన్నీ కేసులో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు గురైనట్టుగా బహిర్గతం చేసిందన్నారు. పీసీసీ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెరాస తొత్తులుగా మారిన అధికారులను వదలబోమన్నారు.
మండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టీ విక్రమార్క, మాజీ మంత్రి డి శ్రీ్ధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపిలు వి హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్, యాదవ్, మధుయాష్కీ, ఎమ్మెల్సీ కె రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సంకు ధనలక్ష్మి తదితరుల పాల్గొన్నారు.

chitram...
బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో మాట్లాడుతున్న ఏఐసిసి ప్రధాన
కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా