తెలంగాణ

సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22:గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేదికగా కాస్తంత వెటకారం, వ్యంగ్యం జోడించి ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. వివిధ రాజకీయ పక్షాల తాజా వైఖరి, సమాజంలో పరిణామాల ఆధారంగా కొన్ని ఫొటోలను, కామెంట్లను జోడించి ఈ ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రచారంలో టిఆర్‌ఎస్ దూసుకుపోతోంది. సాధారణంగా అతి ప్రాధాన్యత ఉన్న అంశాలపై ఏ పత్రికలోనైనా ఒకటీఅరా కార్టూన్లు ప్రచురిస్తారు. కానీ సోషల్ మీడియాకు ఆ పరిమితి ఏమీ లేదు. దీంతో ఐడియా తట్టిందే ఆలస్యం... గంటగంటకూ ఓ కార్టూన్ వచ్చేస్తోంది. ఇటీవల సినీనటుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ‘డిక్టేటర్’ సినిమా చూడాలని ఆహ్వానించారు. కెసిఆర్, బాలకృష్ణ కలిసిన ఫోటో, తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఆమరణ దీక్ష ఫోటోలు వాడి ఓ సెటైర్ సీన్ క్రియేట్ చేశారు టిఆర్‌ఎస్ అభిమానులు. ‘డిక్టేటర్’ సినిమా చూడక ముందు అంటూ మొదటి ఫోటోను, చూసిన తరువాత అంటూ ఆమరణ దీక్షలో నీరసంగా ఉన్న ఫోటోను అందులో చూపించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ నాయకుడొకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటననూ వారు వదిలిపెట్టలేదు. దీనిపై ఆ వ్యక్తి ఫోటో, బిత్తరి సత్తి ఫోటో ఉపయోగించుకుని ఓడిపోయే పార్టీ టికెట్ దక్కితే బాధపడాలికానీ, రాకపోతే ఆత్మహత్యాయత్నం ఎందుకని ఓ వ్యాఖ్యరాసి వదిలారు. ఇక భాగ్యనగర రాజ్యం అంటూ కెటిఆర్‌ను ‘బాహుబలి’గా, కాలకేయులు అంటూ మిగిలిన విపక్షాలను చూపిస్తూ పోస్టర్ రూపొందించి ప్రచారం చేస్తున్నారు. వీళ్లంతా అలిసి పోయారా? కనిపించడం లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫోటోలతో మరో పోస్టర్ రూపొందించారు. పార్టీలో తన మాటకు విలువ లేనందున ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు టిడిపి మాజీ మంత్రి కృష్ణయాదవ్ ప్రకటించారు. దీనిపై రేవంత్‌రెడ్డి ఫోటోను కూడా ఉపయోగించుకుని టైగర్లకే దిక్కులేదంటా ఎకసెక్కం చేస్తూ కార్టూన్ పోస్ట్ చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో బల్దియా ఎన్నికలకు సంబంధించి తెలంగాణ టిడిపి నాయకులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. దీనిపై ఆ వెంటనే టిఆర్‌ఎస్ సానుభూతిపరులు స్పందిస్తూ, లోకేశ్ మాటలు వినగానే.. కృష్ణయాదవ్ రాజీనామా చేశారని వ్యాఖ్య రాశారు.