తెలంగాణ

వనమంతా జనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 14: జనమేజయుడి ప్రతీకార పర్వంలో భాగంగా ఏడుపాయల రాతి గుహలో వెలసిన వనదుర్గా మాత దేవాలయం తెలంగాణకు తలమానికంగా దినదినాభివృద్ధి చెందింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మహాశివరాత్రి పర్వదినం రోజున మొదలై మూడు రోజులు ఇక్కడ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. జాతర మహోత్సవాలకు లక్షలాదిగా భక్తులు రావడంతో వనమంతా జనంతో నిండిపోయింది. ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుండంతో వీఐపీ దర్శనం వద్ద కూడా అనేకమంది గంటల తరబడి వేచివుండాల్సిన దుస్థితి నెలకొంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, బోనమెత్తి నృత్యాలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్ల నృత్యాల కోలాహలంతో భక్తులు పులకించిపోయారు. వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, కోళ్లు కోసి విందులు చేసుకున్నారు. శివరాత్రి రోజు భక్తుల సంఖ్య తక్కువగా కనిపించినా బుధవారం లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు పోలీసులకు తలనొప్పిగా పరిణమించింది. ఎడ్లబండ్ల ప్రదర్శన సమయంలో వీధుల్లో తోపులాట చోటుచేసుకుంది. గురువారం రథోత్సవంతో జాతర ముగుస్తుంది. ఒక్క పోలీసు శాఖకు చెందిన వారే వెయ్యిమందికి పైగా ఉండగా మిగిలిన దేవాదాయ, రెవెన్యూ, ఇరిగేషన్, గజ ఈతగాళ్లు, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ తిష్టవేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కల్తీ నిరోధక శాఖ అధికారులు అన్ని దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అద్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు. పది పడకలతో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గర్భిణీలను దృష్టిలో పెట్టుకొని అత్యవసర సేవలు అందించే ఏర్పాట్లు చేసారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ రెండు వందల ప్రత్యేక బస్సులను నిరంతరాయంగా నడిపిస్తోంది. శాంతిభద్రతలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీచైర్మెన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రాజాసింగ్, ఎమ్మెల్సీ రాములునాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, ఎస్పీ చందనాదీప్తీ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. గత యేడాదితో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య రెట్టింపయనట్లు అధికారులు పేర్కొంటున్నారు.