Others

ఆమె నవ్వింది ( గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(మళ్లీ యథాప్రకారం పరిగెడుతున్న రైలు చప్పుడు వినబడుతుంది)
వైదేహి: (విరగబడి నవ్వుతుంది) బాగుంది. చాలా బాగుంది. రక్తిగా ఉంది కథ. ఆ తరువాత?
రామం: ఏఁవుంది ఆ తరువాత? ఏమీ లేదు. ఉద్యోగం ఒప్పుకున్నట్లే ఈ పెళ్లికి కూడా ఒప్పుకొని చేసేసుకున్నాను.
వై: ఇహనేం? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ, పెళ్ళాన్ని కనిపెట్టుకుంటూ ఉండండి. మనిషికి సుఖపడ్డానికి అంతకంటే ఏం కావాలి?
రా: అంతే అంటారా?
వై: పోనీ, మీరు చెప్పండి. మనిషి సుఖపడాలంటే ఆ రెండూ ఉండాలంటారా లేదా?
రా: ఉండాలి. కాని, ఆ రెండూ ఉన్నంత మాత్రాన సుఖం వచ్చేస్తుందంటారా?
వై: ఇప్పుడు మీకేవొచ్చిందనీ?
రా: ఏమీ రాలేదు. నేనో మనిషిని కాదసలు. నేనో నీడలాంటివాడిని. మా హెడ్ మాష్టరుకి ఇన్ని సంవత్సరాలూ అడ్డమైన చాకిరీ చేశాను. స్కూల్లో నేనసలు ఓ మాష్టారులాగా ఉండేవాణ్ణి కాదు. ఏవిటో నన్నంతా ఓ బంట్రోతులాగా చూసేవారు. అంత ఒదిగి ఉన్నప్పటికీ..
వై: ఉన్నప్పటికీ? చెప్పండి.
రా: హెడ్‌మాస్టరు నా ఉద్యోగం తీయించేశాడు. ఆ ఖాళీలో తన బంధువునెవర్నో వేయించాడు.
వై: అంత అన్యాయం జరిగితే పోట్లాడలేకపోయారా?
రా: ఎలా పోట్లాడ్డం? ఎవరితో పోట్లాడ్డం?
వై: అన్యాయంతో, ఎవరితో ఏవిటి?
రా: పోట్లాట అనేది నా రక్తంలో లేదు. ఇంతవరకూ ఏ గాలి వీస్తే దానికి తలఒగ్గుతూనే దానితో కొట్టుకుపోతూ వచ్చాను.
వై: అన్యాయానికి తలఒగ్గడంకంటే అవినీతికరమైన పని ఇంకోటి లేదు.
రా: ఎదురుతిరిగి ఏం లాభం? నెగ్గలేను.
వై: అదేం మాటండీ? నెగ్గుతే నెగ్గడం, లేకపోతే లేదు. అంతేగాని ప్రతి దారినిపోయేవాడూ వచ్చి జుట్టు పట్టుకు వంచేస్తే నోరు మూసుకు ఊరుకుంటామా? సరే. తరువాత ఏం జరిగింది?
రా: ఏం జరిగింది? నా భార్యకి నన్ను చూస్తే అసహ్యం. పిన్నికి ఒళ్ళుమంట. బాబయ్య సరేసరి. నన్నో పురుగుని చూసినట్టు చూస్తాడు. మొన్న భోజనాల దగ్గర నానా మాటలూ అని మొహంమీదికి మరచెంబు విసిరేశాడు.
వై: ఎందుకు?
రా: తన ఇంట్లో కూర్చుంటున్నాను: అందుకని. అంతటి మనస్సు విరిగిపోయింది. ఆ సాయంత్రమే ఇల్లు వదిలేశాను. పెళ్లినాడిచ్చిన ఉంగరం అమ్మేస్తే కొద్దిగా డబ్బొచ్చింది. బయలుదేరాను. నిన్నల్లా రుూ రైల్వే స్టేషన్‌లోనే గడిపాను. సాయంత్రం అనిపించింది- ఇలా బతికే కంటే చచ్చిపోతే నయం అని. అంచేత టిక్కెట్టు కొనుక్కొని రుూ బండి ఎక్కాను. ఇందాక మీ కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చే ముందు దూకెయ్యడానికి ప్రయత్నం చేశానన్నమాట.
వై: మరి దూకెయ్యలేదేం?
రా: ధైర్యం చాలలేదు.
వై: (విరగబడి నవ్వుతుంది)
రా: ఎందుకూ నవ్వుతారు?
వై: (నవ్వు ఆపుకుని) ఏం లేదు. మీకు బతకడానికి ధైర్యం లేదు. చావడానికీ ధైర్యం లేదు. పాపం! అందుకే యిలా చావు బతుకులమధ్య వేలాడుతున్నారు. పోనీలెండిగానీ ఇప్పుడీ ప్రయాణం ఎక్కడికి?
రా: పట్నం. అక్కడో చిన్ననాటి స్నేహితుడున్నాడు. అతనికి పెద్ద ఉద్యోగం. ఏమైనా ఉద్యోగం ఇప్పించి సహాయం చేస్తాడేమోనని.
వై: అతన్ని మీరు ఆఖరుసారి చూసి ఎన్నాళ్ళయింది?
రా: అబ్బో- ఏడేళ్ళు దాటింది
వై: అయితే యింకేం లోటు? వెళ్ళగానే మిమ్మల్ని కౌగిలించుకుంటాడు, వెళ్ళండి.
రా: వెళతాను. అన్నట్టు మీ ప్రయాణం ఎంతవరకూ?
వై: మేమూ పట్నమే. మా నాన్నగారికి అక్కడ ఉద్యోగం. నాకూ అక్కడ ఉద్యోగమే.
రా: మీరా! మీరూ ఉద్యోగం చేస్తున్నారా?

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)