తెలంగాణ

డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పారిశ్రామికవేత్తలు, ఐటి నిపుణులు అభిప్రాయపడ్డారు. నాస్కామ్ చైర్మన్ రామన్ రాయ్, నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ భారత్‌లో ఐటి పరిశ్రమ అనూహ్యంగా పెరుగుతోందని అన్నారు. 2018లో 167 బిలియన్ అమెరికన్ డాలర్ల రెవిన్యూ సాధిస్తుందని అన్నారు. భారత్ ఎగుమతుల్లో 24 శాతం మేర ఐటి రంగమే ఆక్రమిస్తోందని, అత్యధిక ఆదాయం కూడా ఈ రంగం నుండే దక్కనుందని అన్నారు. డిజిటల్ రంగం 30 శాతం వేగంగా విస్తరిస్తోందని, దాని తర్వాతి స్థానాల్లో ఇఆర్ అండ్ డి 13 శాతం, బీపీఎం 8 శాతం వేగంగా పురోగతి సాధిస్తోందని అన్నారు. కొత్తగా 1140 జీఐసీల ఏర్పాటుకు దోహదపడుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్టార్టప్‌లు, ఇ-కామర్స్, ఇ-ప్రోడక్టులు, డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరగనున్నాయని చెప్పారు. 25 నుండి 30 శాతం పెరుగుదల స్టార్టప్‌లలో కనిపించనుందని, అంటే సుమారు 700కు పైగా స్టార్టప్‌లు వచ్చే వీలుందని తెలిపారు. ఇ-కామర్స్ 17శాతం మేర పెరుగుతుందని చెప్పారు. భవిష్యత్ సమాజం అనే అంశంపై డాక్టర్ కస్తూరి ఇముర, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై రోస్తో రావనన్ తదితరులు మాట్లాడారు. ‘టెక్నాలజీ ప్రజలు కలిసి 21వ శతాబ్దపు సవాళ్లకు సమాధానం చెబుతారు’ అనే అంశంపై ప్రవీణ్ రావల్, సంగీతారెడ్డి, రే వాంగ్ ప్రసంగించారు. మరో సెషన్‌లో తెలంగాణ ఐటి ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, సమీర్ గార్డె, శ్యామలాల్ ముఖర్జీ మాట్లాడారు. ’డిజిటల్ యుగంలో పున:విశే్లషణ’ అనే అంశంపై స్కాట్ సాండ్స్‌చాఫర్, శామ్సన్ డేవిడ్ సమీక్షించారు. బ్రిటిష్ కౌన్సిల్ డిజిటల్ డైరెక్టర్ అండ్రూస్ హార్టన్, సౌత్‌లాండ్ డిజిటల్ అధ్యక్షుడు అండ్రూస్ జిమ్మర్‌మన్, మెకన్సీ సీనియర్ పార్టనర్ డేనియల్ పాక్తడ్, వికాస్ డాగా, హెక్సావేర్ వ్యవస్థాపకుడు అతుల్ నిస్సార్ ‘డిజిటల్ డిస్రప్షన్’పై మాట్లాడారు. ఐటి కాంగ్రెస్ ముగింపు కార్యక్రమం బుధవారం జరగనుంది. తొలి సమావేశంలో డిజిటల్ ఎకానమిపై సందీప్ గురుమూర్తి, జ్యోతి బన్సాల్, రవి గురురాజ్ మాట్లాడతారు. టామ్ మోర్ నెట్‌వర్కింగ్‌పై మాట్లాడతారు. నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగే అదే చర్చలో చర్చలో ఐటి మంత్రి కె తారకరామారావు, బివిఆర్ మోహన్‌రెడ్డి, అరుణ్ సేథీ పాల్గొంటారు.

chitram...
ఐటీ కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న నాస్కామ్ చైర్మన్ రామన్ రాయ్.
చిత్రంలో వైస్‌చైర్మన్ రిషాద్ ప్రింజ్, ప్రతినిధి డి.ఘోష్