Others

ఆమె నవ్వింది (గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య: నేనండి, సూర్యారావుని. నిన్న యిద్దరం కలుసుకున్నాం- ఇక్కడే. జ్ఞాపకం లేదూ?
వై: మళ్లీ తయారా? ఇదిగో విను- నువ్వెవడివో నాకు తెలియదు.
సూర్య: చెప్తినిగా- సూర్యారావని! మీ చెల్లెలు వాసంతి నాకు బాగా తెలుసు..
వై: షటప్! ఫో అవతలికి.
సూర్య: వెరీగుడ్, అందమైన ఆడదానికి కోపం వస్తే యింకా అందంగా కనబడుతుంది. చూడండి వైదేహిదేవి! మొగాళ్ళని చూసి ఇంత భయపడితే ఆఫీసులో ఉద్యోగం ఎలా చేస్తున్నారండీ?
వై: నువ్విక్కడ నుంచి పోతావా, పోవా? పోలీసులకి అప్పగిస్తాను జాగ్రత్త!
సూర్య: ఏడీ పోలీసు? కనుచూపు మేర మనిషే లేడు! చూడండి- ఎంతసేపని యిలా బస్సుకోసం పడిగాపులు పడి నించుంటారు! అదిగో అదే నా కారు, ఇంటి దగ్గర ఒదిలేస్తాను రండి
వై: ఏయ్, ఇడియెట్, అడుగు ముందుకు వేశావా, జాగ్రత్త!
సూర్య: ఇదిగో వేశాను, ఏం చేస్తావ్?
వై: ఏం చేస్తానా? (్ఛళ్ళుమని లెంపకాయ కొట్టిన చప్పుడు)
సూర్య: అయినా ఫర్వాలేదు రా, అదిగో కారు.
వై: ఏయ్- చెయ్యి వదులు! బాబోయ్! (గట్టిగా అరుస్తుంది దూరం నుంచి ‘ఎవరదీ- ఎవరదీ’ అని కేక)
రామా: ఎవరదీ, ఏయ్ - ఎవరు నువ్వు, వెధవా! (రెండు దెబ్బలు కొట్టిన చప్పుడు) ఫో, వెధవా (దూరంగా కారు వెళ్లిపోయిన చప్పుడు) ఎవరమ్మా మీరు?.. ఆఁ వైదేహిగారా! నమస్కారం.. వైదేహిగారూ జ్ఞాపకం ఉన్నానా?
వై: మీరా! రామారావుగారు! థ్యాంక్యూ రామారావుగారూ సమయానికి దేవుడిలా వచ్చారు! లేకపోతే ఆ రౌడీ వెధవ..
రా: ఏడిశాడు, బక్క సన్నాసి. పారిపోయాడుగాని, లేకపోతే మెక్కలు విరగదన్ని పోలీసులకు అప్పచెప్పేవాణ్ణి.
వై: ఎందుకులెండి.. అయిందేదో అయిపోయింది. పోనీలెండి.. పదండి.. మా ఇంటికి పోదాం ముందు, కొంచెం ఇంటిదాకా దిగబెడతారా?
రా: సంతోషంతో, ఎలా వెళదాం?
వై: కొంచెం దూరం నడుచుకుంటూ వెళదాం రండి ఆపైన చాలా బస్సులు దొరుకుతాయి.
రా: పదండి.
వై: చాలా చిత్రంగా కలసుకున్నాం మళ్లీ. అందులోనూ మీరు దేవుడిలా వచ్చి ఆదుకున్నారు.
రా: ఆఁ అందులో ఏవుందిలెండి. నేను కాకపోతే మరొకడు వచ్చి ఆ తుంటరిని చావగొట్టేవాడు. ఊరా అడివా?
వై: ఇంత ధైర్యంగా ప్రవర్తించిన మీరు మరి ఆనాడు రైల్లో. అంత బేలగా మాటాడారేం?
రా: నిజం చెప్పనా? ఇదంతా మీ దయ. నాలో ఇంత మార్పు రావడానికి మీరే కారణం.
వై: నేనా? నేనేం చేశాను మీకు?
రా: ఈ జన్మలో ఎవరూ చెయ్యలేనంత ఉపకారం చేశారు ఎలా అంటే చెప్పలేను కాని ఏమిటో నాకు కొండంత ఆశ, ధైర్యం వచ్చాయి.
వై: పోనీలెండి. ఒక మనిషికి నేనామాత్రం సహాయం చెయ్యగలిగానంటే అదెంతకాదు! కాని అదంతా వివరంగా చెప్పాలి నాకు.
రా: తప్పకుండా.. మీరు ఒద్దన్నా చెపుతాను. మీవల్ల నాకింకా బోలెడంత సహాయం కావాలి. డబ్బు సహాయం అనుకోండి.
వై: అవసరం వచ్చినపుడు మనుషులు ఆ సహాయమూ చేసుకోవాలి రామారావుగారూ! లేకపోతే సరేలెండి, ఇంటికెళ్లి మాటాడుకుందాం.
***
తండ్రి: హమ్మయ్యా! దిగబడ్డావా, ఎక్కడికి వెళ్లావు వైదేహి?
వై: ఎక్కడికంటారేమిటి నాన్నా- గొప్ప గండం తప్పితేనూ! ఈ రామారావుగారూ లేకపోతే యివాళ ఏమైపోయి ఉండేదాన్నో! రండి రామారావుగారూ!
రా: నమస్కారం బాబూ!

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)