సంపాదకీయం
దేశ వ్యతిరేక క్రీడ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడడానికై శ్రీలంక వెళ్లాలా, ‘చిలీ’కి వెళ్లాలా ఆన్నది ప్రశ్న కాదు. పాకిస్తాన్‌తో మనం ఎందుకు ఆడాలి? ఇదీ దేశప్రజలు అడుగుతున్న ప్రశ్న. పాకిస్తాన్ జట్టుతో మన జట్టు క్రికెట్ ఆట ఆడడానికి వీలుగా భారత క్రికెట్ నియంత్రణా మండలి నడుపుతున్న ప్రహసనం దేశ ప్రజల మనోభావాలను గాయపరుస్తోంది. ఉగ్రవాద బాధితుల గాయాలను మళ్లీ కెలుగుతోంది. రక్తం తాగిన నోటితో హంతకుడు, రక్తపు మరకలు మాయని గాయాలతో క్షతగాత్రుడు సమాన స్థాయిని పొందడానికి మాత్రమే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి-బీసీసీఐ- వారి ఉత్సాహం దోహదం చేస్తోంది. పాకిస్తాన్‌తో మనం క్రికెట్‌ను మనదేశంలో ఆడాలా? పాకిస్తాన్‌లో ఆడాలా అన్న మీమాంస గురించి మాధ్యమాలలో అనేక రోజులుగా ప్రచారం అవుతోంది. పాకిస్తాన్‌లోని మైదానాలలో ఆటలాడడానికి విదేశీయ బృందాలు సిద్ధంగా లేవు. 2008లో శ్రీలంక జట్టుపై దాడులు జరిగిన తరువాత నెలకొన్న స్థితి ఇది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇంతటి పేరును సంపాదించుకొంది. తాలిబన్లు, లష్కర్లు, ఇతరేతర జిహాదీ ఉగ్రవాదపుతండాలు తాండవిస్తున్న పాకిస్తాన్‌లో ఆటలాడడానికి అన్ని దేశాల వారు భయపడుతుండడం ఈ పేరునకు కారణం. అందువల్ల పాకిస్తాన్ జట్లు తమదేశంలో ఆడవలసిన అన్ని సందర్భాలలోను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యుఏఇ-మైదానాలకు తరలిపోతున్నాయి. యుఏఇలోని ఆటస్థలాలు పాకిస్తానీ జట్లకు మాతృక్రీడా ప్రాంగణం-హోంపిచ్-కావడం విచిత్రమైన వాస్తవం. 2014లో పాకిస్తాన్ జట్టు మన దేశానికి వచ్చి ప్రయోగాత్మకగా కొన్ని క్రికెట్ ఆటలు ఆడిపోయింది కనుక ఇప్పుడు మళ్లీ ద్వైపాక్షిక క్రికెట్ ఆడినట్టయితే మన జట్టు పాకిస్తాన్ వెళ్లాలట. అంటే యుఏఇ దేశానికి వెళ్లి ఆడాలి. ఇలా దుబాయిలోను ఇతర చోట్ల పాకిస్తాన్ వారి స్వదేశీయ శృం ఖలాలు-హోమ్ సిరీస్- జరుగుతుండడం పాకిస్తాన్ ప్రభు త్వ ప్రేరిత జిహాదీ బీభత్సకాండకు అంతర్జాతీయంగా లభించిన గొప్ప పరిగణన. పాకిస్తానీ బీభత్సకాండకు బలి అవుతున్న మనదేశానికి చెం దిన క్రికెట్ నియంత్రణ మండలి వారు మాత్రం ఈ వికృత వాస్తవాన్ని గుర్తించకపోవడం జాతీయ వైపరీత్యం. మండలి వారు జరుపుతున్న నాటకాన్ని ఆరంభంలోనే ఆపివేయకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండడం దేశ ప్రజలు మెచ్చని మరో విపరిణామం. యుఏఇలో ఆడడడానికి మాత్రం మన ప్రభుత్వం అంగీకరించలేదట..అంతేకాని జిహాదీ హంతకులను, ఉగ్రవాదపు వృక (తోడేలు) సమూహాలను ఉసిగొల్పుతున్న దేశంతో వినోద విహార క్రీడా కళా సంబంధాలు వద్దే వద్దని మన ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు.
అరబ్ ఎమిరేట్స్‌లో కాదు కనుక శ్రీలంకలో ఆడడానికి మన క్రికెట్ మండలి సిద్ధపడింది. శ్రీలంక కూడా అంగీకరించిందట, ఆతిథ్యమివ్వడానికి. ఒకరోజు ఆటలను, ఇరవై ఓవర్ల ఆటలను ఎన్ని ఆడాలో కూడ మన మండలి నిర్ధారించేసిందట. ఎక్కడ, ఏ క్రీడాప్రాంగణంలో ఆడాలో కూడా నిర్ణయమైపోయిందట. ఇలా సర్వం సిద్ధం చేసుకున్న బీసీసీఐ ఇప్పుడు మన విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారి, ప్రధాన మంత్రి కార్యాలయం వారి అనుమతి కోసం ఎదురుచూస్తున్నదట. ఇలా మనదేశంలో హత్యాకాండ జరిపిస్తున్న దేశానికి చెందిన క్రీడాకారులతో మన క్రీడాకారులు క్రీడా వినోదం సాగించాలని భావించడం జాతీయతా నిష్ఠలేని స్వభావానికి నిదర్శనం. పాకిస్తాన్ క్రీడాకారులు టెర్రరిస్టులు కాకపోవచ్చు. మంచివారు కావచ్చు. ఇలాంటి మంచివారు పాకిస్తాన్‌లో అనేకమంది ఉండవచ్చు! కానీ పాకిస్తాన్ సమాజ సమష్టి స్వభావానికి ప్రతీక అయిన పాకిస్తాన్ ప్రభుత్వం మనదేశం పైకి ఉగ్రవాద తోడేళ్లను ఉసిగొల్పింది, ఉసిగొల్పుతోంది. మనదేశంలోని ఇస్లాం మతేతరులను మొత్తం మట్టుపెట్టడం ఈ పాకిస్తాన్ ప్రేరిత జిహాద్ లక్ష్యం. ఇలాంటి దేశంతో ఈ బీభత్సకాండకు బలి అవుతున్న మన దేశానికి ప్రజాసంబంధాలు యధాతథంగా కొనసాగాలని భావించడం అన్యాయం మాత్రమే కాదు, మనదేశానికి ఆత్మహత్యా సదృశం. ప్రపంచంలో ఏ ఇతర దేశం కూడ తమ దేశాన్ని బద్దలు కొట్టడానికి యత్నిస్తున్న శత్రుదేశంతో ఇలా క్రీడా సంబంధాలను, వినోద విహార సంబంధాలను కోరుకోవడం లేదు. మనదేశానికి మాత్రమే పరిమితమైన విచిత్ర స్థితి ఇది. పైగా మనదేశంలో హత్యాకాండ సాగించిన తమ దేశపు జిహాదీ ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రజలలో అత్యధికులు బాహాటంగానే బలపరుస్తున్నారు. అలాంటి ప్రజల ప్రతినిధులలో మనకు ఆటలేమిటి? యూసఫ్‌జాయి మలాలా వంటి మానవతా మూర్తులకు, సర్వమత సమానత్వ సమర్థకులకు పాకిస్తాన్‌లో భద్రత లేదు. మలాలా వంటివారు పాకిస్తాన్‌ను సమిష్టి సమాజ స్వభావానికి అపవాదం!
క్రీడాకారులు క్రీడానియంత్రణ సంస్థల నిర్వాహకులు కూడ ప్రజలు, అందువల్ల సమాజ సమష్టి ప్రయోజనం గురించి దేశ భద్రత గురించి జాతి హితం గురించి ఆలోచించవలసిన బాధ్యత వారికి కూడ ఉంది. మనదేశ ప్రజలను పాకిస్తానీ జిహాదీలు హత్య చేస్తుండడంతో క్రీడలకు, క్రీడాకారులకు, కళలకు, కళాకారులకు, రచనలకు, రచయితలకు సంబంధం లేదని భావించడం దేశ వ్యతిరేక చర్య...ఇలా భావించడానికి లేదా భ్రమించడానికి కారణం అనభిజ్ఞత కావచ్చు, అవగాహన లేకపోవడం కావచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వ విధానంలో పరివర్తన రావాలి, ఇంతకాలం మనదేశంలో రక్తపాతం సృష్టించినందుకు బీభత్సకాండ జరిపించినందుకు పశ్చాత్తాపం చెందాలి. మనదేశంలో హత్యాకాండ జరిపి తమ దేశంలో హాయిగా జీవిస్తున్న బీభత్సకారులను పాకిస్తాన్ ప్రభుత్వం, మనకు అప్పగించాలి. కనీసం వారిని తమ దేశంలోనే విచారించి శిక్షించాలి. అలా పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులకు స్వభావంలో మార్పు వచ్చినప్పుడు మనం పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలతో సహా సకలవిధ మైత్రీ బంధాలను పెంపొందించుకోవచ్చు. కానీ ఈ పరివర్తన వచ్చేవరకు పాకిస్తాన్‌తో మనం పూర్తిగా తెగతెంపులు చేసుకోవడమే దేశహితం..ఇదీ ఈ దేశ ప్రజల అభీష్టం. 2008 నవంబర్‌లో పాకిస్తానీ జిహాదీలు ముంబయిపై దాడిచేసి భయంకర మారణకాండ సాగించిన నేపథ్యంలో మన ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగతెంపులు చేసుకొంది. పాకిస్తాన్ ప్రభుత్వ విధానంలో ఇప్పటి వరకూ ఎలాంటి పరివర్తన కూడ లేదు. పశ్చాత్తాపం సంగతి వేరే మాట. ఆ తరువాతనైనా పాకిస్తాన్ ప్రభుత్వం భారత వ్యతిరేక బీభత్సకాండకు స్వస్తి చెప్పలేదు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వాహకులకు ఇదంతా తెలుసు. అయినప్పటికీ పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలని గత ఏడాది నిర్ణయించడం ఒప్పందం కుదుర్చుకొనడం దేశ ప్రజలు నిరసించిన పరిణామం. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌తో మనదేశం 2021 వరకు కనీసం ఐదు క్రికెట్ సిరీస్ ఆటలను ఆడాలట. ఈ ఆటలు వద్దని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఒప్పందం సమయంలోనే స్పష్టం చేసి ఉండాలి. ఎందుకు చేయలేదు? దేశ ప్రజల నిరసన మాత్రం అప్పటి నుంచీ ఇప్పటి వరకూ వ్యక్తం అవుతూనే ఉంది. ఈ నిరసన కారణంగానే గతనెల 19వ తేదీన ముంబయిలో పాకిస్తాన్‌తో జరుగవలసి ఉండిన క్రికెట్ చర్చలు రద్దయ్యాయి. ఇలా రద్దయినందుకు భారత క్రికెట్ మండలి వారు పాకిస్తాన్‌కు క్షమార్పణ చెప్పడం మరో ఘోరం..దేశ ప్రజలకు అవమానం.