సంపాదకీయం

పరిమార్చిన ప్రకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ బీభత్సం కంటె ప్రాకృతిక బీభత్సం వందల వేల రెట్లు భయంకరమైనదన్న కఠోర వాస్తవం మరోసారి ధ్రువపడింది. స్వాతి వానలకు సముద్రాలు నిండడం ప్రాకృతిక పరిణామం, ‘స్వాతి’ వానలకు భూమి సముద్రంగా మారడం ఊహకందని వికృతి. తమిళనాడులోను అంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలోను కురిసిన బీభత్స వర్షం ఇలాంటి మృత్యు సముద్రాన్ని సృష్టించింది..మానవ జీవనాన్ని రోజుల తరబడి దిగ్బంధం చేసింది. వందలాది మందిని బలిగొనింది. ఆకలితో అలమటింపజేసింది. తాగడానికి నీటి చుక్క దొరకని విచిత్ర దుస్థితిని కల్పించింది. మదరాసు మహానగరం మొత్తం సముద్రంగా మారిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. నీటిలో చిక్కుపడిన మూడున్నర లక్షల చెన్నై వాసులను ప్రభుత్వం వారు రక్షించారట, తరలించారట, సురక్షిత స్థానాలకు చేర్చారట. ఆ సురక్షిత స్థానం ఎక్కడుందోమరి! కానీ ఇప్పటికీ నీటి మధ్య నివాసం ఉంటున్న లక్షలాది మంది అర్థాకలితో అలమటిస్తున్నారు. పైనుంచి పడిన ఆహారం దొరికిన వారికి అర్థాకలి! ఆహారం పొట్లాలు నీటిలోపడి కొట్టుకుపోతున్న దృశ్యాలను చూస్తున్న వారికి రోజంతా పూర్తి ఆకలి. ఆకలి అన్నింటికంటె అతిబాధ... ఈ బాధను లక్షలాది మంది అనుభవిస్తున్నారు. నీటి మధ్య కొట్టుకొనిపోతున్న మృతదేహాల బంధువులు కన్నీటి మధ్య మానవ జీవనం నిర్బంధగ్రస్తం కావడం ప్రకృతి సృష్టించిన బీభత్సం. నీరు బతికిస్తోంది, నీరు బతుకులను బలిగొంటోం ది. ప్రకృతి ప్రకృతిగా ఉన్నప్పుడు నీరు బతికిస్తోంది, నీరు పోషిస్తోంది. ప్రకృతి వికృతిగా మారినప్పుడు నీరు బలిగొంటోంది, నీరు నిలదీస్తోంది.. ‘‘జల్‌మే కుంభ్, కుంభ్ మే జల్’’- నీటిలో కుండ, కుండలో నీరు- అన్నది కబీర్ దాస్ వంటి మహాకవులు దర్శించిన ప్రాకృతిక వాస్తవం..‘‘నీటిలో ఇళ్లు ఇళ్లలో నీరు’’ అన్నది చెన్నై నగరంలో నెలకొని ఉన్న వైకృతిక విషాదం. ప్రకృతి స్వయంగా ‘వికృతి’గా మారిందా? మానవులు వికృతిగా మార్చారా? అన్నది తరచు వినబడుతున్న ప్రశ్నలు. ప్రశ్నలకు జవాబులు దొరకడంలేదు. ప్రకృతి మరింతగా వికృతమైపోతోంది. పరిశోధనలు, నిర్ధారణలు, ప్రభుత్వాలు, పథకాలు ఇలా ప్రకృతి వికృతంగా మారకుండా నిరోధించడం...వికృతమైపోతున్న ప్రకృతి విలయాన్ని సృష్టించింది. సృష్టిస్తోంది. వికృతిని సృష్టిస్తున్న మానవులు వేరు. విలయానికి బలైపోతున్న మానవులు వేరు. ఘోరమైన నేరం చేసినవారు ఈ వికృతికి శిక్షను పొందడం లేదు. మృతదేహాలుగా మారి నీటిలో పడి కొట్టుకుపోయినవారు, అమాయకులు, అభాగ్యులు ప్రకృతి విధించిన శిక్షకు బలైపోతున్నారు. వికృతిని నిరోధించలేని ప్రభుత్వాలు విలపించి ఏమి లాభం? తరాలుగా సాగుతున్న ఈ నిరోధించలేనితనం ఇంత మంది నీటిపాలు కావడానికి కారణం. ‘‘ప్రకృతిని పరిరక్షిస్తే అది మనలను పోషిస్తుంది. ప్రకృతిని ధ్వంసం చేస్తే అది మనలను ధ్వంసం చేస్తుంది’’ ఇదీ నేర్చుకోవలసిన పాఠం.
మదరాసును దక్షిణాంధ్రను ముంచెత్తినది కనీవినీ ఎరుగని అతివృష్టి మాత్రమే కాదు, అకాల వృష్టి కూడ. పరిసరాల విధ్వంసం వల్ల సంభవిస్తున్న భయంకర పరిణామాల ఫలితాలు అనూహ్యమైనవన్నది ఇప్పుడు మళ్లీ ఋజువైంది. స్వాతి కార్తెలోనే వర్షాలు భూ ఉపరితలంపై కాక సముద్రాలలో మాత్రమే కురుస్తాయన్నది ప్రాకృతిక నియమం. అంచేత సముద్ర తీరంలోని భూమి మీద కూడ కురవడం సహజం. ఇదీ ఈశాన్య ఋతుపవన ప్రభావం. అందువల్ల మనదేశంలోని తూర్పు సముద్ర తీర సమీప ప్రాంతాలలో స్వాతి కార్తెలోను విశాఖ కార్తెలోను- నవంబర్‌లో- భారీ వర్షాలు కురవడం సహజం. అనూరాధ కార్తె-డిసెంబర్- ఆరంభమైన తరువాత సముద్ర తీరాలనుండి దూరంగా ఉన్నా ప్రాంతాలలో వర్షం రావడం దాదాపు సంభవమన్నది మన తెలుగునాట నియమం. అందుకే అనూరాధ కార్తెలో వర్షంలో తడిస్తే రోగాలు మాయమైపోతాయన్నది సంప్రదాయ విశ్వాసం. మనోరోగానికి మందు లేనట్టే అనూరాధలో కూడ వర్షం రాదన్నది నిర్ధారణ. అయితే సముద్ర తీరాలలో అనురాధలో కూడ జల్లులు కురియవచ్చు, కానీ ప్రళయ వర్షం ముంచెత్తడం మాత్రం ప్రాకృతిక బీభత్సం. జల్లులు, బతుకులకు చిల్లులు పెట్టే విధంగా భీకర రూపం పొందడానికి కారణం మాత్రం పరిసరాలు పాడైపోతుండడం. కాలుష్యం కొలువు తీరిన పరిసరాలు ప్రకృతిని గాయపరచాయి. ప్రకృతి రోదించింది, రోదిస్తోంది. ఈ రోదనలకు వాణిజ్య ప్రపంచీకరణ ప్రధాన కారణమన్న వాస్తవాన్ని ప్రభుత్వ నిర్వాహకులు ఇప్పుడైన గుర్తించాలి. చెన్నయి నగరంలో సంభవించిన జల విలయాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ విలవిలలాడిపోయారట. వెయ్యికోట్ల రూపాయల తాత్కాలిక సహాయం కూడ ప్రకటించారు. కానీ దీర్ఘకాల వ్యూహం ఏమిటి?
మదరాసుతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కూడ జల బీభత్సం కాటుకు బలయ్యాయి. ఈ జిల్లాలలో కూడ యాబయి మందికి పైగా మృత్యువు కోరలకు గురయ్యారు. ఇలాంటి జల విలయాలు ఏటా రెండు మూడు సార్లు సముద్ర తీర రాష్ట్రాలన్నింటిని కుదిపివేస్తున్నాయి. పారిశ్రామిక కాలుష్యాన్ని విస్తరింప జేస్తున్న కృత్రిమ ప్రగతి హరిత శోభలను హననం చేయడం గురించి మాత్రమే ప్రధానంగా ప్రచారమవుతోంది. అతివృష్టి బీభ త్సం కూడ ఈ కృత్రి మ ప్రగతి ఫలిమన్నది పెద్దగా ప్రచారానికి నోచుకోవడం లేదు. కరువు, అనావృష్టి, అడవులు అంతరించిపోవడం, పారిశ్రామిక కాలుష్య విస్తరణలో భాగం. కానీ అక్రమంగా విస్తరించిపోతున్న సిమెంటు నిర్మాణాల వల్ల జరిగిపోతున్న వైపరీత్యాలు వరదల తీవ్రతకు కారణం. ఉత్తరఖండ్‌లో 2013 జూన్‌లో వరదల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకుకారణాలు చెట్లను విచ్చలవిడిగా నరికివేయడం, నిబంధనలకు విరుద్ధం గా నిర్మాణాలు సాగించడం. ఈ వాస్తవాన్ని శాస్తవ్రేత్తలు నిగ్గు తేల్చారు. నీటి ఉధృతిని, భూసార నష్టాన్ని చెట్లు, అడవులు నిరోధిస్తాయి. చెట్లు లేకపోవడం వల్ల చెరువులు లేకపోవడం వల్ల కురిసిన నీరంతా ప్రవహిస్తూనే ఉంది. వాగులు, వంకలు, నదులలోని నీరు అంచెలంచెలుగా వందలాది చెరువులను నింపుకుంటూ ముందునకు సాగడం వల్ల వరదలు నగరాలను ముంచెత్తవు. నగరం విస్తరించని సమయంలో నిండిన ఈ వందలాది చెరువులు ఇప్పుడు నిండడం లేదు. ఈ చెరువులను పూడ్చివేసి అక్కడ భవనాలను, ఆకాశ హార్మ్యాలను నిర్మిం చారు. అందువల్ల చెరువులు కనిపించక వర్షం నీరు వీధులకెక్కింది. మదరాసు సముద్రంగా మారడానికి ఇదీ కారణం.
మదరాసులోని కూవం, అడయార్ వంటి నదుల ద్వారా నీరు సముద్రంలోకి చేరేదట. ఈ నదుల వెడల్పును అక్రమ నిర్మాణాలు మింగివేశాయి. అందువల్ల సముద్ర గమనాన్ని మాని, అడ్డుగా ఉన్న కట్టడాలను ముంచెత్తి, నదులకు ఇరువైపులా అడ్డంగా ప్రవహించింది. నగరం మడుగైపోయింది. ప్రభుత్వాలు ఈ అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తున్నాయి. తద్వారా వరదలు నగరాలను ముంచెత్తే వ్యవస్థను శాశ్వతం చేస్తునాయి. నగరమంతా సిమెంటు మైదానం..చుక్క నీరు కూడ భమిలోకి ఇంకదు..ఇంకని నీరు ముందుకు పోలేని నీరు ముంచెత్తుతోంది.