సంపాదకీయం

అద్భుత అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్, రామ్‌బాణ్ జిల్లాల మధ్య నిర్మించిన సొరంగ మార్గం గుండా వాహనాల రాకపోకలు ప్రారంభం కావడం కశ్మీర్ చరిత్రలో వినూతన అధ్యాయం, జాతీయ సమైక్య ప్రస్థాన పథంలో మరో ప్రగతి పదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేసిన ఈ తొమ్మిదిన్నర కిలోమీటర్ల సొరంగ మార్గం-రోడ్ టన్నల్- అతి పెద్దది మాత్రమే కాక అత్యంత అధునాతనమైనది. మన స్థపతుల-ఇంజనీర్‌ల-నిర్మాణ కళా కౌశలానికి మాత్రమే కాక మన వైజ్ఞానిక సాహసానికి కూడ అద్దం ఈ సొరంగ మార్గం! చెనానీ నుంచి నస్రీ వరకు గల దుర్గమ పర్వతాలను తొలచి నిర్మించిన ఈ సొరంగ మార్గం మానవ నిర్మితమైన మరో అద్భుతం. జమ్మూ కశ్మీర్ హేమంత రాజధాని జమ్మూ నగరం, వసంత రాజధాని శ్రీనగరం. ఈ రెండు నగరాల మధ్య నెలకొని ఉన్న ‘జాతీయ మహాపథం’ ఉన్నతోన్నత హిమ శృంగాల మీదుగా, లోతోన-లోయలకు సమీపంలో ప్రమాదకరమైన ప్రయాణాలకు నిలయమై ఉంది. మంచు కురిసినప్పుడు రహదారిపై గుట్టలు గుట్టలుగా మంచు శకలాలు పేరుకునిపోవడం ప్రతి సంవత్సరం పునరావృత్తం అవుతున్న విపరిణామం. తొలగించ వీలుకాని ఈ మంచు దిబ్బలు కరిగి ప్రవహించే వరకు జాతీయ మహా పథం-నేషనల్ హైవే-పై వాహనాల రాకపోకలు స్తంభించిపోవడం జమ్మూ కశ్మీర్ జన జీవనాన్ని మాత్రమే కాక భారత జాతీయ జన జీవనాన్ని నిరంతరం నిలదీస్తున్న వైపరీత్యం! మంచు దిబ్బలు మట్టి చరియలు విరిగి పడడడం పెద్ద పెద్ద గుండ్రాళ్లు, రాతి శకలాలు దొర్లుకుంటూ రావడం ఉధంపూర్, రామబాణ్ జిల్లాల సరిహద్దులు కలిసిన చోట నెలకొన్న పర్వతాలలో నిరంతర దృ శ్యం. ఈ దుర్గమ ప్రాం తంలో జిహాదీ బీభత్సకారులు, పాకిస్తానీ తొత్తులు, దేశ విద్రోహులు మాటువేసి ఉండడానికి వీలైన ‘చాటు’ ప్రదేశాలు నెలకొని ఉన్నాయి. ప్రధాని ప్రారంభించిన సొరంగ మార్గం వల్ల జమ్మూ నగరానికి, శ్రీనగరానికి మధ్య దూరం తగ్గిపోవడం అందువల్ల బహుళ ప్రయోజనాలలో ఒకటి మాత్రమే! ప్రయాణ వేగం పెరగడం ఉ భయ నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు రెండు గంటల మేర తగ్గిపోవడం మరో ప్రయోజనం! కానీ విస్తృత ప్రయోజనం కల్లోల గ్రస్తమైన కశ్మీర్ లోయలో ప్రశాంత స్థితి నెలకొనడానికి ఈ సొరంగ మార్గం మరో మాధ్యమం కావడం.. ఈ సొరంగ మార్గం వల్ల జమ్మూ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలు, పలు ప్రాంతాల ప్రజలు మరింత సన్నిహితం కావడం సహజ పరిణామ క్రమంలో భాగంలో కాగలదు. ఈ సాన్నిహిత్యం వల్ల ‘లోయ‘ ప్రాంతంలో పాకిస్తాన్ తొత్తులుగా పనిచేస్తున్న వారి సంఖ్య తగ్గిపోనుంది. జి హాదీ బీభత్సకాండకు పాల్పడడం, సైనిక దళాలపై రాళ్లు రువ్వడం, భారత వ్యతిరేక నినాదాలు చేయడం నిత్యకృత్యమై ఉన్న వారి దుర్ర్భాంతి తొలగడానికి జమ్మూ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల వాసుల మధ్య పెరిగే సాన్నిహిత్యం దోహదం చేస్తుంది. దుర్ర్భాంతి తొలగని వారిని సమర్ధించే సామాన్యుల సంఖ్య తగ్గిపోతుంది...
సమర్ధించే వారి సంఖ్య తగ్గిపోవడం పాకిస్తాన్ ఉసి గొల్పుతున్న జిహాదీ బీభత్సకారుల సంఖ్య తగ్గిపోవడానికి మార్గం! చెనానీ-నస్రి మధ్య నిర్మితమైన సొరంగ మార్గం వంటి అద్భుతాల ద్వారా కశ్మీర్ లోయలోని సాధారణ ప్రజల మానసిక స్థితిలో మార్పు రాగలదు. రాళ్లు రువ్వడం వల్ల బీభత్స చర్యల వల్ల తమ ప్రగతి స్తంభించి ఉందని సామాన్య ప్రజలు గుర్తించడం ఈ మార్పు! కశ్మీర్ లోయ, జమ్మూ కశ్మీర్ జిహాదీ బీభత్స కాండ నుండి విముక్తం అయినట్టయితే ప్రగతిగతి వేగం పుంజుకోగలదు. భారత మాతకు శిరస్సు వంటిదయిన జమ్మూ కశ్మీర్ అనాదిగా ప్రగతికి కూడ తలమానికం వంటిది. ఇందుకు కారణం భద్రత! పడమటి నుంచి చొరబడిన జిహాదీ బీభత్సకారులు అనేక శతాబ్దులపాటు కశ్మీర్‌లోకి చొరబడలేదు. ఉత్తరం వైపున ‘హూణ’ సీమల నుండి దండయాత్రలు జరగకపోవడానికి కారణం కోటగోడ వలె హిమాలయ శ్రేణులు జమ్మూ కశ్మీర్‌ను కాపాడడం. తూర్పున ఉన్న టిబెట్ కూడ శతాబ్దుల పాటు కశ్మీర్‌పై దాడులు జరపలేదు. అందువల్ల దుర్గమ పర్వతమయమైన కశ్మీర్ శతాబ్దులపాటు ప్రశాంతంగా ఉంది. ప్రగతి సాధించింది! ఉగ్రవాదం కావాలో స్వర్గ సీమవంటి ప్రశాంత కశ్మీర్ కావాలో తేల్చుకోవాలని ‘సొరంగం’ ప్రారంభ సమయంలో ప్రధాన మంత్రి కశ్మీర్ ప్రజలకు పిలుపునివ్వడానికి ఇదీ చారిత్రక నేపథ్యం..
ఉగ్రవాదం చొరబడడానికి పూర్వం కశ్మీర్ స్వర్గ్ధామం వంటిది. కశ్మీర్‌ను సందర్శించడానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వెల్లువెత్తేవారు! కశ్మీర్ లోయప్రాంతం ఒకప్పుడు బృహత్ జలాశయం. ఈ జలాశయం ప్రాంతంలోనే సతీదేవి పరమశివుని కోసం తపస్సు చేసిందన్నది భారతీయుల తరతరాల విశ్వాసం. అందువల్లనే ఈ సరస్సుకు ‘సతీ సరస్సు’ అని పేరు వచ్చింది. కశ్మీరమే పార్వతీదేవి రూపమని యదుకుల కృష్ణుడు ద్వాపర యుగంలో స్వయంగా వివరించాడు. కశ్మీర్ వేద నాదాలు మారుమోగిన సీమ, యజ్ఞశిఖలు మింటకెగిసిన భూమి! ప్రశాంతమయమైన పర్వతాలు, లోతైన లోయల గుండా ఉప్పొంగిన జీవనదులు కశ్మీర్‌ను పచ్చదనంతో పండించాయి. కశ్మీర్‌లోని పర్వతీయ వ్యవసాయ క్షేత్రాలు జీవనదులతో తడిసి వివిధ రకాల పంటలతో విలసిల్లాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోను చెప్పుకోవడం సంప్రదాయమైంది. సారవంతమైన ప్రతి వ్యవసాయ క్షేత్రం ‘కశ్మీర్ ఖండం’ వంటిది.. ఇదీ మన దేశంలోని సంప్రదాయం! ఇలా భౌతిక ప్రగతి సాంస్కృతిక సుగతి కశ్మీర్ చరిత్రతో పెన వేసుకున్నాయి. ఈ అభ్యుదయ చరిత్రకు ప్రాతిపదిక కశ్మీర్‌కు లభించిన భద్రత! పర్వతీయ పరిసరాలు ఈ భద్రతను కల్పించాయి. కానీ జిహాదీలు చొరబడిన తరువాత ఐదారు శతాబ్దులుగా కశ్మీర్ కథ మారిపోయింది. భద్రతను పునరుద్ధరించుకోవాలన్న ప్రధాన మంత్రి పిలుపునకు ఈ చరిత్ర ప్రాతిపదిక!
భద్రంగా ఉండిన సమయంలో ప్రశాంతమైన పర్వతాలు, దుర్గమ అరణ్యాలు లోయలు జిహాదీలు చొరబడిన తరువాత ప్రమాదాలకు నిలయమయ్యాయి! 1947లో దేశ విభజన జరిగిన తరువాత, పాకిస్తాన్ ఏర్పడిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు ‘లోయ ప్రాంతం’లోను ఇతర ప్రాంతాలలోను మరింత విశృంఖల విహారం చే స్తున్నారు! అందువల్లనే పర్వతాల గుండా, లోయల గుండా, మలుపుల గుండా ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది. చైనా దురాక్రమణ తరువాత ఈ ప్రమాదాల వలయం మరింత విస్తరించింది. సొరంగ మార్గం ఏర్పాటు చేయవలసి వచ్చింది! అద్భుతమైన స్థాపత్య కళ మాత్రమే కాదు, బీభత్సకారులను దండించడానికై ఈ కళను ఉపయోగించడం కూడ కశ్మీర్‌లో సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. సతీ సరస్సులో నక్కి ఉండిన జలోద్భవుడనే రాక్షసుడిని బయటికి రప్పించడానికై బలభద్రుడనే వీరుడు ఆ సరస్సును తెంపివేయడం యుగాల పూర్వం నాటి ‘ఇంజనీరింగ్’ అద్భుతం! ఎండిన సరస్సు నేటి ‘లోయ’..