సంపాదకీయం

జన్యు సాంకర్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుద్ధి ప్రక్రియ ద్వారా రూపొందే ఆహార పదార్థాల్లో జీవ జన్యు సాంకర్యం ఏర్పడుతోందన్న వాస్తవాన్ని ‘్భరత ఆహార భద్రత, ప్రమాణ పరిరక్షణ సంస్థ’వారు ఆధికారికంగా గుర్తించడం హర్షణీయం. ఇలా గుర్తించి ఈ ‘జీవ జన్యు సాంకర్య’- జెనటికల్లీ మోడిఫైడ్ -జిఎమ్- పదార్థాలు జనం నోళ్లలోకి చేరకుండా నిరోధించడానికి పదేళ్ల క్రితమే చర్యలు చేపట్టవలసి ఉంది. పదేళ్లపాటు ‘్భరత ఆహార భద్రత, ప్రమాణ పరిరక్షణ సంస్థ’ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండరడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- శుద్ధి ప్రక్రియలో జరుగుతున్న ‘జన్యు సాంకర్యాన్ని’ పట్టించుకోలేదన్నది ఇప్పుడు ధ్రువపడిన వాస్తవం! ఇప్పుడైనా ఈ ‘నియంత్రణ మండలి’ వారు శుద్ధిచేసిన ఆహారం- పాకేజ్‌డ్ ఫుడ్-తో చేరి మన పొట్టలలోకి చొరబడిపోతున్న ‘జిఎమ్’- జన్యు సాంకర్య- రసాయన విషాలను గుర్తించడం గొప్ప పరిణామం! ‘జన్యు సాంకర్య ఆహార ధాతువులు’- జిఎమ్ ఇన్‌గ్రిడియంట్స్- కలసిన ‘డబ్బాల తిండి’ని, ‘పొట్లాల తిండి’ని నిరోధించడానికి, నిషేధించడానికి ఈ సాధికార నియంత్రణ మండలి ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ఇప్పుడు సైతం పూనుకోవడం లేదు. తాము శుద్ధిచేసి డబ్బాలలోను, పొట్లాలలోను నిలువచేసి విక్రయిస్తున్న -పాకేజ్‌డ్- తినుబండారాలలో ‘జన్యు సాంకర్య ధాతువులు’ ఉన్నట్టయితే ఆ సంగతిని వినియోగదారులకు ఉత్పత్తిచేసే సంస్థలు తెలియచేయాలని మాత్రమే ‘నియంత్రణ సంస్థ’ నిర్దేశించినట్టు ప్రచారవౌతోంది. ఇలా నిర్దేశించడం వల్ల వినియోగదారులకు కొత్తగా ఒనకూడే ప్రయోజనం ఏమిటి? ఒక్కొక్క ‘తినుబండారం’లో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు వంటివి ఎంతెంత శాతం ఉన్నదీ ‘పొట్లం’పైన, ‘డబ్బా’మీద, ‘సీసా’ మీద అచ్చుగుద్ది ప్రదర్శించాలని నియంత్రణ మండలి నిర్దేశిస్తోంది. కానీ ఫలానా తినుబండారంలో- ఉదాహరణకు బురద బురదగా ఉండే ‘బంక’చాక్లెట్, వేఫర్, ఒక రకమైన వెగటు వాసనకల ఐస్‌క్రీమ్, ఇంకా ఘోరమై కంపుకొట్టే రకరకాల ‘సాగుడు’ తినుబండారాలు- ఏ మేరకు జన్యు సాంకర్య ధాతువులు కలసి ఉన్నాయి? అన్న సమాచారం ‘పొట్లం’ కాగితం పైన, ‘డబ్బా’పైన అచ్చుగుద్ది ప్రదర్శించాలన్న నిబంధన ఇప్పటివరకూ లేదు. దశాబ్దికి పైగా లేదు. ఈ కాలవ్యవధి ఎవరి కడుపులోనికి ఎన్ని కిలోల, టన్నుల జన్యు సాంకర్య విష పదార్థాలు చేరిపోయాయో? ఇప్పుడు ‘నియంత్రణ మండలి’ నిద్రలేచింది..
జన్యు సాంకర్య విష రసాయన ధాతువుల వల్ల మానవుల ఆరోగ్యం, ప్రకృతి సమతుల్య వ్యవస్థ పాడయిపోతున్నాయన్నది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం. జీవ జన్యు సాంకర్యం వల్ల పంటలలో తయారవుతున్న ‘బాసిలస్ తురింజెనిస్’- బిటి- జీవ రసాయనం దిగుబడులను పెంచడానికి దోహదం చేస్తోందట! ఈ ‘బాసిలస్ తురింజెనిస్’ రసాయనం ప్రభావంతో వ్యవసాయ క్షేత్రాలు ఊసర క్షేత్రాలుగా మారుతున్నాయట, ‘కశ్మీర్ ఖండం’వంటి భూమి ‘ఎడారి సీమ’గా మారడానికి ‘బిటి’ జన్యు సాంకర్య రసాయనం దోహదం చేస్తుందట! ‘బిటి’ పత్తిని భోంచేసిన పశువులు ప్రాణాలు కోల్పోయాయన్నది కూడ జరిగిన ప్రచారం. ‘బిటి’ పంటల ద్వారా ఉత్పత్తయ్యే ఆహారాన్ని భోంచేయడం వల్ల మానవులు చిత్ర విచిత్ర శారీరక మానసిక బౌద్ధిక రుగ్మతలకు గురికానున్నారట! అందువల్ల‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ వారు ఇప్పుడైన ‘జిఎమ్ ఇన్‌గ్రేడియంట్స్’- జన్యు సాంకర్య ధాతువులు- చేరి ఉన్న ‘డబ్బాల’ తిండిని, ‘సీసా’ల తిండిని, పొట్లాల పదార్థాలను సంపూర్ణంగా నిషేధించాలి. ‘పాకేజ్‌డ్’ తిండిలో ‘జిఎమ్’్ధతువులు లేవన్న నిర్ధారణ జరిగిన పదార్థాలను మాత్రమే అమ్మడానికి, జనం తినడానికి అనుమతినివ్వాలి. లేనట్టయితే ఏళ్లతరబడి ‘జిఎమ్’ ధాతువులు ఉన్నట్టు తెలియక ‘నిలువ’ తినుబండారాలను కొని తిన్నవారు, ఇకపై ఆ జన్యు సాంకర్య ధాతువులు ఉన్నట్టు తెలుసుకొని తింటారు. ఇంతే తేడా! పొగ తాగడాన్ని, మద్యపానాన్ని అనుమతించిన ప్రభుత్వాలు ‘పొగ తాగడం హానికరం’, ‘మద్యం వల్ల ప్రమాదం’ అన్న ప్రకటనలను జారీచేయిస్తోంది. ఈ ‘ప్రకటన’ల వల్ల ధూమపానం, మద్యపానం ఆగడం లేదు, అలాగే జన్యు సాంకర్య ధాతువులు ఈ డబ్బా తిండిలో ఇంత శాతం ఉన్నాయి’ అని ప్రకటించడం వల్ల వాటిని కొనడం, పరాపరా పీక్కు తినడం ఆగదు..
మన దేశంలో ప్రస్తుతం పత్తి మాత్రమే ‘జన్యు సాంకర్య’ ప్రక్రియ ద్వారా ఉత్పత్తవుతోంది. పత్తి గింజలు పశువుల ‘దాణా’లో చేరి వాటి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. పత్తిని, గింజలను ‘మానవ ఆహారం’లో కలపడం లేదు. ‘జిఎమ్’ వంకాయలను, ‘జిఎమ్’ సాసువుల- ఆవాలు-ను దేశంలో ఉత్పత్తిచేయడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చేస్తున్న యత్నాలు- భగవంతుని కృప వల్ల- ఇప్పటివరకూ విఫలమయ్యాయి. మరి మన దేశంలోని ‘డబ్బాల తిండి’లో జన్యు సాంకర్య పదార్థాలు ఎలా కలిశాయి, ఎవరు ఎక్కడ కలుపుతున్నారు? అమెరికా వంటి సంపన్న దేశాలలో ‘జిఎమ్’ పంటలు పండడం లేదు. కాని ప్రవర్ధమాన దేశాల వ్యవసాయ క్షేత్రాలను ‘ఉప్పుకయ్యలు’గా మార్చడానికి కంకణం కట్టుకున్న సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ వారు- మల్టీ నేషనల్ కంపెనీస్- ఈ జన్యు సాంకర్యపు విత్తనాలను ఆయా దేశాలలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా జన్యు సాంకర్యపు ఆహార ధాన్యాలను, కూరగాయలను, మసాలా దినుసులను వివిధ వర్ధమాన దేశాలలో పండిస్తున్నారు. ఇలా ‘జిఎమ్’ ప్రక్రియలో విష రసాయన పూరితమైన మొక్కజొన్నలను, బంగాళా దుంపలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ‘శుద్ధి’ప్రక్రియలో ఉపయోగించి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన దేశానికి ఇతర వర్ధమాన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ ఆహార ధాన్యాలను, కూరగాయలను, వీటి ద్వారా తయారయ్యే ‘డబ్బా తినుబండారాల’ను సంపన్న దేశాల ప్రభుత్వాలు నిషేధించాయి. తమ దేశాల్లో అమ్ముడుపోని ఈ ‘సరకు’ను ‘బహుళ సంస్థలు’ మన దేశంలోకి తరలిస్తున్నాయి. ఇదీ ‘ప్రపంచీకరణ’ మారీచుడు సృష్టిస్తున్న మాయాజాలం. మన దేశానికి దిగుమతి అవుతున్న తినుబండారాలలో జన్యు సాంకర్య విష ధాతువులు కలసి ఉన్నట్టు 2008 మేలోనే ధ్రువపడింది. ‘డెట్రాయిట్’ అన్న అమెరికా కంపెనీ తయారుచేసి మనకు అంటగట్టిన బంగాళా దుంపల వేపుడు ముక్కల- పొటాటో చిప్స్-లో ‘జన్యు సాంకర్యాలు’ పుష్కలంగా ఉన్నట్టు ధ్రువపడింది.
ఇలా ధ్రువపడిన తరువాత పదేళ్లు గడిచాయి. ఇప్పటికీ కూడ ఈ విదేశాల ‘బండారాల’ను నిషేధించక పోవడం మన ప్రభుత్వ విధాన వైపరీత్యం! క్రిమి సంహారక ఔషధాలు వాడారన్న సాకుతో అమెరికా 2007 వరకు పదేళ్లు మన పండ్లను, కూరగాయలను నిషేధించింది. ఐరోపా సమాఖ్యవారు తరచూ ఇదే సాకుతో మన ఉత్పత్తులను నిషేధించారు. మరి మన ప్రభుత్వం జన్యు సాంకర్యపు తిండి దిగుమతి కాకుండా కాని, ఉత్పత్తి చేయకుండా కాని ఎందుకు నిరోధించరాదు?