సంపాదకీయం

చైనాకు ‘దాసోహం..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జవహర్‌లాల్ నెహ్రూ కాలంనాటి ప్రభుత్వ విదేశాంగ విధానం పునరావృత్తవౌతోందన్న సందేహం కలగడం అసహజం కాదు. చైనా ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, మన ప్రభుత్వం చైనాకు అనుకూలంగా ఆర్భాటించడం జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో మన దేశం అనుసరించిన విధానం. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండిన సమయంలో, 1950వ దశకంలో మన ప్రభుత్వం టిబెట్‌ను చైనా అంతర్భాగమని ప్రకటించింది, గుర్తించింది, ప్రచారం చేసింది... చైనా మాత్రం ద్వైపాక్షిక సంబంధాలలోను, అంతర్జాతీయ సంబంధాలలోను మనను వెన్నుపోటు పొడిచింది. ఇదే కథ మరో రీతిలో పునరావృత్తం అవుతుండడం వర్తమాన వైచిత్రి. మన ప్రభుత్వం ఇప్పుడు ‘తైవాన్’ దేశాన్ని ‘చైనీయ తైపే’అని అభివర్ణించింది. తద్వారా తైవాన్- 1949నుంచి స్వతంత్ర దేశంగా ఉన్న తైవాన్- చైనాలో అంతర్భాగమని మన ప్రభుత్వం గుర్తించినట్టయింది. ఈ మన చైనా ‘‘ఆనుకూల్యాన్ని’’ తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా నిరసించడం సహజం!! మాల్ దీవులలో మనం నెలకొల్పి ఉన్న రెండు గగన యుద్ధశకటాల- ఫైటర్ హెలికాప్టర్స్-ను మనం వెనక్కి పిలుపించుకోవలసి రావడం సమాంతర విపరిణామం. ఈ రెండు విపరిణామాలు ఏక కాలంలో సంభవించాయి, గురువారం ఆవిష్కృతమయ్యాయి, ప్రచారమయ్యాయి. తైవాన్ -జాతీయ చైనా- తమ దేశంలో భాగమని 1949నుంచి చైనా వాదిస్తోంది. అందువల్ల ‘తైవాన్’ను ‘చైనావారి తైపే’- చైనీస్ తైపే- అని మన ప్రభుత్వ విమాన సంస్థవారు బుధవారం అభివర్ణించడం చైనాపట్ల మన ప్రభుత్వం ప్రదర్శించిన అనుకూలతకు నిదర్శనం. తైవాన్ ప్రభుత్వంవారి నిరసనను మన ప్రభుత్వం పట్టించుకోలేదు. మాల్‌దీవుల ప్రభుత్వం ఒత్తిడిమేరకు మన ప్రభుత్వం మన గగన శకటాలను ఆ దేశంనుంచి ఉపసంహరించుకోవలసి వస్తోంది. చైనా ప్రభుత్వ ప్రేరణతో మాల్‌దీవుల ప్రభుత్వం ఇలా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. గతంలో ఈ ‘హెలికాప్టర్’లను నిర్వాహక సిబ్బందిని తమ దేశంలో నెలకొల్పాలని, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ ‘గగన శకటాలు’ అవసరమని మాల్‌దీవుల ప్రభుత్వం పదే పదే మన ప్రభుత్వాన్ని కోరింది. అందువల్ల మన ప్రభుత్వం ఈ ‘హెలికాప్టర్’లను చిన్న దేశమైన మాల్ దీవులకు బహూకరించింది. ఈ గగన శకటాలను నిర్వహించడంకోసం మాల్‌దీవులలో ఉంటున్న మన రక్షణ సిబ్బంది ఖర్చులను సైతం మన ప్రభుత్వమే భరిస్తోంది. అయినప్పటికీ మాల్ దీవుల ప్రభుత్వం ఇలా ఆక్రమిత చర్యలకు పూనుకోవడానికి కారణం చైనా ప్రభుత్వం... 2011లో చరిత్రలో మొదటిసారిగా చైనా మాల్‌దీవులలో దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించింది. అప్పటినుంచి చైనా మాల్ దీవులను మనపైకి ఉసిగొల్పుతోంది.
మాల్‌దీవులు స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత దశాబ్దాల తరబడి కేవలం నాలుగు దేశాలకు మాత్రమే మాల్ దీవులలో దౌత్య కార్యాలయాలున్నాయి. మన దేశం ఈ నాలుగింటిలో ఒకటి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మిగిలిన మూడు. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ ఈ నాలుగు దేశాలలోని తమ రాయబారి కార్యాలయం ద్వారా మాత్రమే మాల్ దీవులతో వ్యవహరిస్తున్నాయి. చైనాకూడ శ్రీలంకలోని తమ దౌత్య కార్యాలయం ద్వారా మాల్‌దీవుల ప్రభుత్వంతో సంబంధాలను కొనసాగించింది. కానీ 2011లో చైనా హఠాత్తుగా మాల్‌దీవులలో రాయబారి కార్యాలయాన్ని ప్రారంభించగలగడం మన వ్యూహాత్మక వైఫల్యానికి మరో నిదర్శనం. మన లక్షద్వీపాలకు అత్యంత చేరువలో హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్న ఈ ‘మాలాద్వీపాలు’ సహస్రాబ్దుల తరబడి మన దేశంలో భాగంగా ఉండేవి. పదకొండవ శతాబ్దిలో ‘మాలా ద్వీపాల’లో చొరబడిన ‘జిహాదీ’లు హైందవ సంస్కృతిని ధ్వంసం చేశారు. హిందువులను నిర్మూలించారు. ఐరోపావారు ఆక్రమించుకొన్న తరువాత ‘మాలా ద్వీపాలు’ మాల్‌దీవులుగా మారాయి. మన దేశంనుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించాయి. మాల్ దీవులలోకి చైనా చొరబడిపోవడం మన రక్షణకు దక్షిణ, పశ్చిమ సముద్ర తీర భద్రతకు వ్యతిరేకంగా సంభవించిన వైపరీత్యం.
ఇలా మాల్‌దీవులను మనకు వ్యతిరేకంగా తీర్చిదిద్దుతున్న చైనాకు అనుకూలంగా మన ప్రభుత్వం ఎందుకు విధాన నిర్ణయాలను ఆవిష్కరిస్తోందన్నది అంతుపట్టని వ్యవహారం. తైపే నగరం తైవాన్ దేశానికి రాజధాని. తైవాన్ ద్వీపం చైనాకు తూర్పుగా సముద్ర జలాలలో నెలకొని ఉంది. ఇన్ని రోజులుగా మన ప్రభుత్వరంగ విమాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’వారి ప్రచార మాధ్యమాలలో ‘తైపే విమానాశ్రయం- తైవాన్ దేశం’ అని పేర్కొన్నారు. కానీ బుధవారం అకస్మాత్తుగా ‘తైవాన్’ను తమ ‘వెబ్‌సైట్’నుంచి తొలగించి ‘తైపే’ నగరాన్ని ‘చైనావారి తైపే’ అని ప్రకటించడం అంతుపట్టని వ్యవహారం. ఉండే సమస్యలన్నీ ఉండగా తైవాన్‌ను ప్రత్యేక దేశంగాకాక చైనా అంతర్భాగంగా మన ప్రభుత్వం ఎందుకని గుర్తించవలసి వచ్చింది? ఈ ప్రశ్నకు మన ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది. అంతర్జాతీయ సమాజంలోని అన్ని దేశాల ప్రభుత్వాలు ‘తైవాన్’ను చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నాయన్న ‘ఎయిర్ ఇండియా’ వారు చెప్పిన మాట అర్థసత్యం. అనేక దేశాలు తైవానును చైనాలో భాగంగా గుర్తించడం లేదు. 1949వరకు తైవాన్, చైనాలు కలసి ఉండేవి. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ ‘తైవాన్’ను మాత్రమేకాక చైనాలోని అనేక భూభాగాలను ఆక్రమించుకొంది. తైవాన్ ద్వీపంలోని ‘తైపే’ విమానాశ్రయం నుండి బయలుదేరిన మన సుభాస్‌చంద్రబోస్ అదృశ్యం కావడం రెండవ ప్రపంచ యుద్ధంనాటి విషాద ఘటన. బ్రిటన్ వ్యతిరేక సమరం సాగించిన నేతాజీకి జపాన్ సహకరించడం చరిత్ర. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇతర చైనా భూభాగాలతోపాటు ‘తైవాన్’ కూడ జపాన్ అధీనంనుంచి విముక్తిమైంది. కానీ చైనాలో జాతీయ ప్రజాస్వామ్యవాదులకు కమ్యూనిస్టులకు మధ్య అంతర్యుద్ధం మొదలైంది. మావోసేడుంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులు చైనా ప్రధాన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు, ‘నవ చైనా’ అని నామకరణం చేశారు, ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటుచేశారు. చాంగ్ కయ్ షేక్ ఆధ్వర్యంలోని ‘జాతీయ ప్రజాస్వామ్యవాదులు’ తైవాన్‌ను, దానికి అనుబంధంగా ఉన్న ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు, తమ దేశానికి ‘జాతీయ చైనా’- నేషనలిస్ట్ చైనా- అని పేరుపెట్టారు, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటుచేశారు.
ఇలా రెండు చైనాలు 1972వరకు కొనసాగాయి. సమైక్య చైనాకు ఐక్యరాజ్యసమితిలో ఉండిన ‘శాశ్వత సభ్యత్వం’ ‘జాతీయ చైనా’కు దక్కింది. ‘సమితి’నుంచి ‘జాతీయ చైనా’ను వెళ్లగొట్టి ‘కమ్యూనిస్టు చైనా’కు సభ్యత్వం కల్పించడానికి మన నెహ్రూ ఆజీవనం కృషిచేశాడు. కమ్యూనిస్టు చైనా మాత్రం 1962లో మన సరిహద్దులకు ‘వెన్నుపోటు’ పొడిచింది. 1972లో ‘జాతీయ చైనా’ను తొలగించి ‘సమితి’లో కమ్యూనిస్టు చైనాను చేర్చుకున్నారు. అప్పటినుంచి ‘జాతీయ చైనా’ ‘తైవాన్’ దేశంగా మనుగడ సాగిస్తోంది!!