సంపాదకీయం

టిబెట్‌లో దమనకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిబెట్‌లో బౌద్ధమతాన్ని, హైందవ సంస్కృతిని నిర్మూలించడానికి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఆరు దశాబ్దులుగా అమలుజరుపుతున్న విష వ్యూహంలో ఇది మరో అంశం. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఎలాంటి మతకలాపాలలోను పాల్గొనరాదన్న నిబంధనను చైనా ప్రభుత్వం విధించింది, దీన్ని అమలు జరుపుతోంది. క్రీస్తునకు పూర్వం ఆరవ, ఐదవ శతాబ్దుల వరకు మన దేశంలో అంతర్భాగంగా ఉండిన టిబెట్‌లో సహస్రాబ్దుల తరబడి వేదమతాలు విలసిల్లాయి. పంచభూతాలను ప్రకృతిని ప్రధానంగా ఆరాధించే వేదమతం వన మతం. త్రివిష్టపమ్- టిబెట్- ప్రాంతంలోని వన జనులు ప్రధానంగా ప్రకృతిని ఆరాధించిన వన మతం వారు, వైదికులు. వనవాసీలు ‘బన్‌పాస్’లుగా మారడం, ‘వన మతం’ ‘బన్‌పాసీ’ మతంగా మారడం టిబెట్ చరిత్ర. క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది నుంచి క్రీస్తుశకం 1959 వరకు దాదాపు రెండువేల నాలుగు వందల ఏళ్లపాటు స్వతంత్ర దేశంగా ఉండిన టిబెట్‌లోకి భారత్ నుంచి బౌద్ధమతం విస్తరించింది. ‘బన్‌పాసీ’లలో అత్యధికులు బౌద్ధులు. సంస్కృత భాషకు రూపాంతరమైన ‘బోటీ’ భాషల్లో ఒకటి త్రివిష్టప భాష- టిబెట్ ప్రజల ప్రస్తుత భాష! భారతీయ భాషలన్నింటి ‘లిపుల’కు ప్రాతిపదిక ‘బ్రాహ్మీ’ లిపి. బ్రాహ్మీ లిపి నుంచి గురుముఖి, నాగరి, ద్రావిడ, బోటీ వంటి వివిధ భారతీయ లిపులు రూపొందాయి. టిబెట్ భాషా లిపి కూడ బ్రాహ్మీ లిపి నుంచి ఇలా పరిణతి చెందింది. టిబెట్ ప్రజల సంప్రదాయ మూలికా వైద్యం భారతీయ ఆయుర్వేద వైద్యానికి మరో ప్రక్రియ. టిబెట్ వైద్య ప్రక్రియ ఇప్పటికీ మన దేశమంతటా కొనసాగుతోంది. వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఈ త్రివిష్టపీయ చికిత్సా కేంద్రాలు, ఔషధశాలలు వెలసి ఉన్నాయి. ఇదంతా టిబెట్‌లోని హైందవ సాంస్కృతిక జీవన చరిత్ర. 1959లో టిబెట్‌ను దురాక్రమించిన చైనా ప్రభుత్వం టిబెట్ రాజకీయ స్వాతంత్య్రాన్ని హరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్లు- పనె్నండున్నర లక్షల చదరపు కిలోమీటర్ల- టిబెట్‌లోని ప్రకృతి సంపదను చైనా కొల్లగొట్టింది. ప్రధానంగా అపురూప ఖనిజ ధాతువుల- రేర్ అర్త్ మినరల్స్- కోసం, ఇంధన వాయు నిక్షేపాల కోసం టిబెట్‌ను చైనా క్రూరంగా తవ్విపారేసింది. ఈ విచ్చలవిడి తవ్వకాల వల్ల మన సరిహద్దుల సమీపంలోని టిబెట్‌లోని సహజ జలాశయాల స్వరూప స్వభావాలు మారిపోయాయి. ఫలితంగా మన ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు రెండు దశాబ్దులకు పైగా కృత్రిమమైన వరదలకు గురవుతున్నాయి. మరోవైపుబ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో అనేక చోట్ల ఆనకట్టలను నిర్మిస్తున్న చైనా మనకు దక్కవలసిన నీటిని కొల్లగొడుతోంది. ఇదంతా టిబెట్‌ను చైనా దురాక్రమించిన ఫలితం.. 1950- 1959 సంవత్సరాల మధ్య ఈ చైనీయ దుశ్చర్యను మన ప్రభుత్వం పట్టించుకోనందుకు ఫలితం. టిబెట్ స్వాతంత్య్ర హననాన్ని అప్పటి మన ప్రధాని నెహ్రూ సమర్ధించిన పాపానికి ఫలితం. భౌతిక దురాక్రమణను విజయవంతంగా కొనసాగించిన చైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు టిబెట్‌లోని హైందవ సంస్కృతిని రూపుమాపుతోంది. ఇందులో భాగం- బౌద్ధమత నిర్మూలన పథకం!
వేసవి సెలవుల్లో ఎలాంటి ధార్మిక శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాబోమని విద్యార్థులు హామీపత్రాలను వ్రాసి ఇవ్వాలని చైనా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్టు ప్రభుత్వ అధికార పత్రికలు ప్రచురించాయి. ఫలితంగా జూన్, జూలై మాసాల్లో వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థుల నుంచి హామీపత్రాలను తీసుకున్నారట! తిరస్కరిస్తే చైనా ప్రభుత్వ దమనకాండకు గురికావలసి ఉంటుందన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లల చేత ఇలాంటి హామీపత్రాలను ఇప్పించారట! టిబెట్‌ను చైనా ప్రభుత్వం 1959 నుంచి చెఱశాలగా మార్చింది. టిబెట్ ప్రజలు చైనా దురాక్రమణను అప్పటి నుంచి ఇప్పటివరకు నిరసిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు. ఈ ‘ప్రతిఘటన’ గురించి, చైనా కమ్యూనిస్టు నియంతల గురించి బయటి ప్రపంచానికి తెలియదు. చైనా ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. విదేశాలకు చెందిన ప్రచార మాధ్యమ ప్రతినిధులు టిబెట్‌లో పర్యటించి వాస్తవాలను బయటి ప్రపంచానికి వెల్లడి చేయకుండా చైనా ప్రభుత్వం నిరోధిస్తోంది..
టిబెట్‌లో ఏమి జరుగుతున్నదన్నది కేవలం చైనా అధికార ప్రకటనల వల్ల మాత్రమే బాహ్య ప్రపంచానికి వెల్లడవుతోంది. అనేక సందర్భాల్లో చైనా నియంతృత్వ ప్రభుత్వం వారు అసలు సంగతులను దాచి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులను మతశిక్షణలో కాని, మత ప్రచారంలో కాని పాల్గొనరాదని చైనా నిషేధించడం గురించి చైనా ఆధికారిక ప్రచార మాధ్యమాల ద్వారానే వెల్లడి కావడం అందువల్ల ఆశ్చర్యకరం. పాశ్చాత్య ప్రచార మాధ్యమాల ప్రతినిధులు అప్పుడప్పుడు కొన్ని రహస్యాలను రాబడుతున్నప్పటికీ టిబెట్‌లోని చైనా ప్రభుత్వ దమనకాండ చాలావరకు నిగూఢంగానే ఉండిపోతోంది. చైనా ప్రభుత్వం ఇప్పుడీ ‘అధికార కార్యక్రమాన్ని’ పశ్చిమ దేశాలకు చెందిన కొన్ని మాధ్యమాలకు పనిగట్టుకొని చేరవేసింది. తమ అధికార ప్రచార మాధ్యమాలలో చైనా ప్రభుత్వం వారు ఆ తర్వాత ఆలస్యంగా ఇప్పుడు వెల్లడించారు. టిబెట్‌లో బౌద్ధమత నిష్ఠ ఉన్నంతవరకు ఆ దేశంపై తమ దురాక్రమణ పూర్తికాజాలదన్నది చైనా నియంతల భయం. అందువల్లనే ఆరు దశాబ్దులుగా వందలకొలదీ బౌద్ధ ఆరామాలను చైనా ప్రభుత్వం మూత వేయించింది! బౌద్ధ మతస్థులు సహజంగానే దలైలామా వ్యవస్థ పట్ల భక్తిశ్రద్ధలను కలిగి ఉన్నారు. అందువల్ల ఇన్ని దశాబ్దులు గడిచినప్పటికీ ప్రస్తుత దలైలామా పట్ల టిబెట్ ప్రజల భక్తిశ్రద్ధలు సన్నగిల్లలేదు. ప్రస్తుత దలైలామాను 1959లో చైనా ప్రభుత్వం హత్య చేయడానికి యత్నించింది. దలైలామా టిబెట్ దేశం అధిపతి, పరిపాలకుడు, టిబెట్ బౌద్ధుల ధార్మిక గురువు. 1959 నుంచి ప్రస్తుత దలైలామా మన దేశంలో నివసిస్తున్నాడు. ఆయన టిబెట్ ప్రవాస ప్రభుత్వానికి 2006 వరకు అధినేత! కాని 2005లో దలైలామా టిబెట్‌ను చైనా నుంచి విముక్తం చేయాలన్న కార్యక్రమానికి స్వస్తి చెప్పాడు. బహిరంగంగా పలుసార్లు ప్రకటించాడు. ప్రవాస ప్రభుత్వ అధిపతి బాధ్యత నుంచి వైదొలగాడు..
మన హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వతంత్ర టిబెట్ ప్రవాస ప్రభుత్వం వివిధ దేశాల్లోని టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమకారులకు కేంద్ర బిందువు. దలైలామా చైనాకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ చైనా మాత్రం ఆయనను నిరంతరం నిందిస్తూనే ఉంది. 2008 నాటి ఒలింపిక్ క్రీడల సందర్భంగా టిబెట్ ప్రజలు పెద్దఎత్తున తిరుగుబాటు చేశారు. చైనా ప్రభుత్వం అనేకమంది బౌద్ధ సంన్యాసులను చంపింది, వందల మందిని నిర్బంధించింది. పదేళ్ల తర్వాత చైనా ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ పెద్దఎత్తున దమనకాండకు పూనుకొంది!