సంపాదకీయం

వరాలతల్లి వజ్రాల సుతుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన జీవన గరిమను ఆవిష్కరించగల అక్షరాలు లేవు, ఆయన భౌతిక నిష్క్రమణ వల్ల క్రుంగుతున్న హృదయాల ఆవేదనను వ్యక్తం చేయగల భావాలు లేవు. జాతీయతా పథంలో తొంబయి మూడేళ్లు సాగిన ఆయన ప్రస్థానం దేశ ప్రజలకు నిరంతర స్ఫూర్తి, ఆయన భరతమాతకు కీర్తి.. నైతిక నిబద్ధమైన, సైద్ధాంతిక కటిబద్ధమైన ఆయన జీవితం మాతృదేశ చరణ సన్నిధిలో కళకళలాడిన పరిమళ ‘కమలం’.. ఆ కమలం వాడనిది, ఆ పరిమళం వీడనిది! ఆ కమల ధ్వజుడు అటల్ బిహారీ వాజ్‌పేయి.. కులం పవిత్రం.. ‘జననీ కృతార్థా వసుంధరా పుణ్యవతీ చతేన.. ఎవరి వల్ల కుటుంబ పరంపర పవిత్రం అవుతుందో, ఎవని వల్ల అతనిని కన్నతల్లి కృతార్థురాలు అవుతుందో, ఎవడు జన్మించడం వల్ల మాతృభూమి మరింత సౌభాగ్యవతి కాగలదో..’ అతడు నిజమైన కుమారుడు. యుగయుగాలుగా భరతమాత రత్నగర్భం నందు జన్మించిన వజ్రాల కొడుకుల పరంపరలోని వాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ’ కార్యకర్తగా, ప్రచారకునిగా అటల్‌జీ అఖండ భారత పరమ వైభవ సాధనా పథ పథికుడయ్యాడు. ‘హిందూ రాష్ట్ర’- హైందవ జాతి- సమారాధకుడయ్యాడు. పదిహేడేళ్ల వయస్సులోనే అటల్ బిహారీ బ్రిటన్ వ్యతిరేక ‘క్విట్ ఇండియా’- భారత్ నుండి బయటికి పోండి- ఉద్యమంలో పాల్గొనడం పుట్టగానే పరిమళించిన పుష్పానికి మరో చారిత్రక నిదర్శనం. అలా అంకురించిన జాతీయతా భావ పరిమళం నిరంతరం విస్తరించడం అటల్‌జీ జీవన ప్రస్థాన క్రమం.. మాతృదేశ ప్రజల సమష్టి హితం ఆయన జీవన వౌలిక లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం ఆయన అనుసరించిన కార్య పద్ధతి రాష్ట్ర సమారాధన- జాతిని అర్చించడం!! ఆయన ప్రధానమంత్రిత్వం ఈ మాతృభూమి సమారాధనకు పరాకాష్ఠ. ‘రామోరాజ్యం ఉపా సీత్వా.. బ్రహ్మలోకం ప్రయచ్ఛతి’.. రఘురాముడు దేశాన్ని పూజించి బ్రహ్మలోకానికి తరలివెళ్లాడు- అని ఆదికవి వాల్మీకి చెప్పాడు. వాజ్‌పేయి- ‘హమ్ కరే రాష్ట్ర ఆరాధన’- మేము మాతృభూమిని పూజిస్తాము’ అని కలమెత్తాడు, గళమెత్తాడు! ‘కవిరాజు’ ప్రధానమంత్రి అయ్యాడు. దేశమాతను అర్చించి వినువీధుల వైపుగా కదలివెళ్లాడు!
‘కోరుూ వ్యక్తీ జిత్‌నా భీ మహాన్ హో, రాష్టస్రే మహాన్ నహీ హోసక్తా.. కిసీ దళ్ జితనా భీ ఊంచాహో, జనతంత్రసే ఊంచానహీ హోసక్తా..’.. వ్యక్తి ఎంత గొప్పవాడు అయినప్పటికీ దేశం కంటె గొప్పవాడు కాలేడు. రాజకీయ పక్షం ఎంత ఉన్నతమైనప్పటికీ ప్రజాస్వామ్యం కంటె ఉన్నతమైనది కాజాలదు- రాజకీయ వేత్తలకు వాజ్‌పేయి చెప్పిన పాఠం ఇది. అత్యవసర పరిస్థితి- ఎమర్జెన్సీ- చివరి రోజుల్లో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. జనతా పార్టీ విజయం సాధించింది. డిల్లీలో 1977 మార్చిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన అటల్‌జీ రాజకీయ వేత్తలకు, రాజకీయ పక్షాలకు చెప్పిన పాఠం ఇది. ఆయన జాతీయ తత్త్వజ్ఞుడు, రాష్ట్ర ధర్మ ప్రవర్థకుడు.. ఇదీ వౌలిక సత్యం. ఆయన రాజకీయ వేత్త కావడం ప్రాధాన్య క్రమంలో ద్వితీయం..
బ్రిటన్ భౌతిక దురాక్రమణ నుండి విముక్తమైన భరతజాతి బ్రిటన్ బౌద్ధిక దురాక్రమణ నుండి విముక్తి కాకపోవడం దశాబ్దుల వైపరీత్యం.. ఈ వైపరీత్యం ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు, తొలగించడానికి ఆజీవనం కృషిచేసిన కారణ జన్ముడు వాజ్‌పేయి. విదేశీయ దురాక్రమణ మన దేశంలో తిష్ఠ వేయడానికి పూర్వం అనాదిగా భారతీయుల బతుకులను పండించిన జాతీయ సాంస్కృతిక స్రోతస్విని- విదేశీయుల బీభత్సం కొనసాగిన శతాబ్దుల కాలంలో ఇంకిపోయింది, ఎండిపోయింది, విదేశీయ వికృత భావాల మురికి కాలువలతో సంకరమైంది, సన్నబడి పోయింది. బ్రిటన్ ‘దొరలు’ వ్యాప్తి చేసిన భారత వ్యతిరేక పాశ్చాత్య భావ తరంగిణులు భారతీయులను ముంచెత్తుతుండడం బ్రిటన్ విముక్త భారతదేశంలో నెలకొన్న దృశ్యం. ఈ పాశ్చాత్య కృత్రిమ నాగరికతను ‘నిజమైన భారత జాతీయత’గా భ్రమించిన రాజకీయ వేత్తలు దశాబ్దుల పాటు దేశాన్ని నడపడం చరిత్ర. ఈ కృత్రిమ పాశ్చాత్య నాగరికత నుంచి రాజకీయాలకు, రాజనీతికి విముక్తిని కలిగించడానికి ఉద్యమించిన వారిలో అటల్‌జీ గణనీయుడు. సన్నబడిన భారత జాతీయతా సాంస్కృతిక స్రోతస్వినిని మళ్లీ మహాధునిగా, సనాతన వారసత్వ ప్రతిధ్వనిగా మలచడానికి నడుం బిగించిన ‘మాతృదేవి’ భక్తుడు వాజ్‌పేయి. ఎండిన జాతీయతా నది నిండడానికి వీలుగా సాంస్కృతిక ధారలు కురిపించడానికై ‘రాజనీతి’ యజ్ఞాన్ని నిర్వహించిన ‘ఋత్విక్కుల’లో ఒకరు అటల్ బిహారీ. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్‌ముఖ్, లాల్‌కృష్ణ అద్వానీ వంటి వారితో కలసి, ఈ జాతీయ సాంస్కృతిక గంగా పునరుజ్జీవన ప్రస్థానంలో ఆయన నడిచాడు. రాజకీయ రంగంలో జాతీయతా నిష్ఠను పెంపొందించడానికి జరిగిన ‘యజ్ఞం’- భారతీయ జన సంఘం..
‘్భరతీయ జన సంఘం’ భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందడం వాజ్‌పేయి రాజకీయ ప్రస్థాన క్రమంలో ప్రస్ఫుటించిన అనివార్య పరిణామం.. ఈ పరిణామం గురించి వాజ్‌పేయి చెప్పిన భాష్యం- ‘ఆకాశంలో మందాకినిగా ఉన్న మహా ప్రవాహం అవనీతలంలో గంగానదిగా ప్రసిద్ధికెక్కింది. పేర్లు మారినప్పటికీ ప్రవాహం ఒక్కటే.. ప్రగతి గతి ఒక్కటే, లక్ష్యం ఒక్కటే..’ ఈ లక్ష్యం దేశ హితమన్నది వాజ్‌పేయి నిరూపించిన వాస్తవం. ‘్భరత ప్రయోజనం ప్రధానం, భాజపా ప్రయోజనం ప్రధానం కాదు, భారతీయ జన సంఘ ప్రయోజనం ప్రధానం కాలేదు.’ 1971లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన అటల్‌జీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ‘అపర దుర్గ’గా అభివర్ణించడం రాజకీయ విభేదాలకు అతీతమైన జాతిహిత స్వభావానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. బంగ్లాదేశ్‌కు భారత ప్రభుత్వం స్వాతంత్య్రం ప్రసాదించినందుకు వాజ్‌పేయి ఇందిరమ్మను అలా ప్రశంసించాడు. 1974లో మొదటి అణుపాటవ పరీక్షలు జరిగినప్పుడు జనసంఘ నాయకుడైన ఆయన ప్రభుత్వానికి మద్దతు పలికాడు, రాజకీయ పక్షాలకు నడవడిని నేర్పాడు. 1998లో తన ప్రభుత్వం మళ్లీ అణుపరీక్షలు జరిపినప్పుడు 1974 నాటి పరీక్షలను వాజ్‌పేయి గుర్తుచేశాడు. ‘ప్రమాదం లేనప్పుడే ఆత్మరక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలన్న’ పరిపాలన పాఠం చెప్పిన జాతీయ తత్త్వ బోధకుడు ఆయన. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండిన సమయంలో, ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించిన బృందానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉండిన వాజ్‌పేయి నాయకుడు! భారత రాజకీయాల్లో వాజపేయి, అద్వానీలు కృష్ణార్జునుల వలె పనిచేశారు. ఈ రాజకీయం కర్మయోగం.. ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ వాజ్‌పేయి నేర్పిన పాఠానికి ఫలితం! ‘వసుంధరా పరివారం’ భారతీయ జీవన వేదం...