సంపాదకీయం

అమిత్ర చర్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుండుమీద కారం చల్లడం- అన్న సామెతను నేపాల్ మార్క్సిస్టు లెనినిస్టు మావోయిస్టు కమ్యూనిస్టులు మరోసారి వాస్తవమని ధ్రువపరచింది. ‘బిమ్‌స్టెక్’ దేశాల సైనిక దళాలు సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన రక్షణ విన్యాసాలలో భాగస్వామ్యం వహించరాదని నేపాల్ ప్రభుత్వం చివరిక్షణంలో నిర్ధారించింది. ఇది ‘బిమ్‌స్టెక్’ దేశాల పట్ల ప్రత్యేకించి మన దేశం పట్ల నేపాల్ ప్రభుత్వం పాల్పడిన విశ్వాస ఘాతుక చర్య... ఈ చర్యకు పాలుపడడం ద్వారా నేపాల్ ప్రభుత్వం తరతరాల మైత్రిని గాయపరచింది. నేపాల్ ప్రభుత్వం ఇంతటితో ఆగలేదు. గాయం మీద ‘కారం’ చల్లుతోంది. ‘సాగర మాత మైత్రి’ పేరుతో ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు చైనా సైనిక దళాలతో కలసి తమ సైనిక దళాలు ‘ఉమ్మడి విన్యాసాల’ను నిర్వహించనున్నట్టు నేపాల్ ప్రభుత్వం పదవ తేదీన వెల్లడించింది. చైనాతో కలసి చెంగ్డూలో రుూ సైనిక విన్యాసాలను నిర్వహించడం ద్వారా నేపాల్ ప్రభుత్వం 1950లో మన దేశంతో కుదుర్చుకున్న ‘శాంతి స్నేహ వ్యవహారాల ఒప్పందాన్ని’ బాహాటంగా ఉల్లంఘిస్తోంది. 1950లో నేపాల్‌కూ మనకూ కుదిరిన ఈ ఒప్పందం యుగయుగాల సాంస్కృతిక భౌగోళిక ఆర్థిక రక్షణ బంధానికి సరికొత్త ధ్రువీకరణ మాత్రమే! బ్రిటన్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని దురాక్రమించేవరకు నేపాల్ మన దేశంలో భాగం, సహస్రాబ్దులుగా భారత్ సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో భాగం. బ్రిటన్ దురాక్రమణకు మొత్తం భారతదేశం గురిఅయిన కాలంలో నేపాల్, భూటాన్ ప్రాంతాలు మాత్రం స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోగలిగాయి. అలా విదేశీయ దురాక్రమణకు గురికాని అఖండ భారత ప్రాంతం ‘నేపాల్’! బ్రిటన్ దురాక్రమణ ముగిసిన తరువాత 1947లో నేపాల్ మళ్లీ మన దేశంలో విలీనం అయి ఉండాలి! అలా జరిగి ఉండినట్టయితే బ్రిటన్ దుర్మార్గులు విచ్ఛిన్నం చేసిన అఖండ భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థ పునరుద్ధరణను పొంది ఉండేది. అలా జరగలేదు, ఇందుకు కారణం బ్రిటన్‌వారు నిర్ధారించిన మన దేశపు భౌగోళిక సరిహద్దులను స్వతంత్ర భారత పాలకులు యథాతథంగా అంగీకరించడం. ఫలితంగా బ్రిటన్ దురాక్రమణ సమయంలో ప్రత్యేక సార్వభౌమ దేశంగా మారిన నేపాల్ ఇప్పటికీ సార్వభౌమ దేశంగానే కొనసాగుతోంది. ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకొని నేపాల్‌లోకి చొరబడడానికి నేపాల్‌ను తన ప్రాబల్య మండలంగా మార్చుకొనడానికి చైనా యత్నిస్తోంది. 1949 - 1959 సంవత్సరాల మధ్య టిబెట్‌ను ఆక్రమించిన చైనా అప్పటినుంచి కూడ నేపాల్‌లోకి చొరబడడానికి యత్నిస్తూనే ఉంది. చైనా రాక్షస హస్తానికి ‘‘టిబెట్ అరచేయి, లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్‌ప్రదేశ్’లు ఐదువేళ్లు...’’ అన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ అధినాయకులు 1950వ 1960వ దశకాలలో చేసిన ప్రచారం! నేపాల్‌లో అప్పటినుంచి ఇప్పటివరకు చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించలేక పోవడం మన ప్రభుత్వానికి సిద్ధించిన దశాబ్దుల వైఫల్యం.
బ్రిటన్ దోపిడీ మూకలు మన దేశంనుంచి నిష్క్రమించిన తరువాత, యథాపూర్వ రాజ్యాంగ స్థితిని పునరుద్ధరించడానికి నేపాల్ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసిందన్నది ప్రచారం కాని వాస్తవం. బ్రిటన్ విముక్త అవశేష భారత్‌లో విలీనం అయిన సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో చేరడానికి నేపాల్ ప్రభుత్వం తనంతతానుగా అంగీకరించిందట! కానీ అప్పటి మన దేశపు ప్రధానమంత్రి ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదట! చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, వ్యూహాత్మక వాస్తవాలకు అనుగుణంగా ‘‘నేపాల్ మన దేశంలో విలీనం కావాలని’’ మన ప్రభుత్వమే 1947లో కోరి ఉండాలి. కోరలేదు... నేపాల్ తనంతతానుగా కోరినప్పటికీ మన ప్రభుత్వం పట్టించుకోలేదు! నేపాల్ మన దేశంలో విలీనం అయినట్టయితే, చైనా కమ్యూనిస్టు నాయకులు మనసు నొచ్చుకుంటారన్నది జవహర్‌లాల్ నెహ్రూ భయం. ఈ భయంతోనే 1949వ 1962వ సంవత్సరాల మధ్య, ఒకప్పటి మన భూభాగమైన నేపాల్‌ను మన ప్రభుత్వం మన దేశంలో చేర్చుకోలేదు. ఈ భయంతోనే ఎప్పుడు కూడ చైనాలో భాగంకాని టిబెట్‌ను చైనా దురాక్రమించడాన్ని జవహర్‌లాల్ నెహ్రూ సమర్ధించాడు. మన ప్రాదేశిక సమగ్రతకన్న చైనాతో మైత్రికి ప్రాధాన్యం ఇచ్చిన మన విధాన వైపరీత్యంవల్ల నేపాల్ మనకు దూరంగా జరుగుతోంది.
ఇలా దూరంగా జరుపుతున్నవారు చైనా చంకబిడ్డలైన నేపాల్ మావోయిస్టులు. 1995 నేపాల్ కమ్యూనిస్టుపార్టీ రెండుగా చీలింది. ఒక వర్గం ‘మావోయిస్టు కమ్యూనిస్టుపార్టీ’గాను మరో వర్గం మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టుపార్టీగాను చెలామణి అయ్యాయి. మార్క్సిస్టు లెనినిస్టు పార్టీవారు బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. మావోయిస్టు కమ్యూనిస్టుపార్టీవారు చైనా తరహా ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేయడం లక్ష్యంగా ‘సాయుధ సమరం’ సాగించింది. ఈ సాయుధ బీభత్సకాండకు 1996వ 2004వ సంవత్సరాల మధ్య పదమూడువేల మంది భద్రతా దళాలు, సామాన్య పౌరులు బలిఅయిపోవడం చరిత్ర..... తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించడం అసంభవమని గ్రహించిన ఈ చైనా తొత్తులు 2005లో ‘‘ఆయుధ విసర్జన’’చేసి బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నిబద్ధతను ప్రకటించారు. కానీ 2008వరకూ ప్రజాస్వామ్య ప్రక్రియ ఆరంభంకాకుండా మావోయిస్టులు అడ్డుకోగలిగారు. 2008లో ‘రాజ్యాంగ పరిషత్’కు జరిగిన ఎన్నికలలో ‘మావోయిస్టు కమ్యూనిస్టు’పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మావోయిస్టులు ఎన్నికలలో ఓడిపోయినట్టయితే వారు మళ్లీ ‘సాయుధ సమరం’ పేరుతో హత్యాకాండను సాగిస్తారన్న భయంతో అధికాధిక వోటర్లు మావోయిస్టులకు వోట్లువేశారు. అయినప్పటికీ ‘రాజ్యాంగ సభ’లో మావోయిస్టులకు ‘మెజారిటీ’ మాత్రం రాలేదు. అందువల్ల ‘నేపాలీ కాంగ్రెస్’తో మావోయిస్టులు ‘రాజీ’కుదుర్చుకోవలసి వచ్చింది! నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్‌భరణ్ యాదవ్ దేశాధ్యక్షుడుగాను మావోయిస్టు మహానేత పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధానమంత్రి గాను ఎన్నికయ్యారు, అధ్యక్షుడు రామ్‌భరణ్‌యాదవ్ మావోయిస్టు ప్రభుత్వంవారు అవలంబించిన భారత వ్యతిరేక చైనా అనుకూల విధానాలను కొంతవరకు నియంత్రించాడు, నిరోధించాడు! అయినప్పటికీ ప్రచండ తను బహిరంగ భారత వ్యతిరేకతను విడనాడలేదు! సంవత్సరం తరువాత ప్రచండ ప్రధానమంత్రి పదవినుంచి తప్పుకున్నాడు... 2013లో మళ్లీ జరిగిన ఎన్నికలలో మావోయిస్టులు ఘోర పరాజయం పాలయ్యారు!
గత ఏడాది చివరన జరిగిన ఎన్నికలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడిగా పోటీచేసి గెలిచారు. నేపాల్ కాంగ్రెస్ ప్రాధాన్యం కోల్పోయింది! ప్రస్తుతం ప్రధానమంత్రి పదవిని అధ్యక్ష పదవిని కూడ కమ్యూనిస్టులు నిర్వహిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వ భారత వ్యతిరేకత మరింత తీవ్రతరం కావడానికి ఇదీ కారణం. ఇరవై రెండేళ్ల క్రితం ‘బిమ్‌స్టెక్’- బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్- బహుళ రంగ సాంకేతిక ఆర్థిక సహకార బంగాళాఖాత దేశాల సమాఖ్య- ఏర్పడినప్పుడు నేపాల్ ఇందులో చేరింది. అప్పటికి మావోయిస్టుల ప్రాబల్యంలేదు. ఇప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ముదిరింది. నాలుగవ ‘బిప్‌స్టెక్’ ప్రభుత్వాధినేతల సమావేశం గత నెల 29, 30 తేదీలలో నేపాల్‌లో జరిగింది. ఉమ్మడి రక్షణ విన్యాసాలలో పాల్గొనడానికి నేపాల్ ప్రభుత్వం ఆ సందర్భంగా అంగీకరించింది. ఈ సమష్టి విన్యాసాలు పదవ తేదీన పూనే సమీపంలో ఆరంభమయ్యాయి. చైనాతో చేరి సైనిక విన్యాసాలను నిర్వహించనున్నట్టు అదే రోజున నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.