సంపాదకీయం

పేరు మార్పు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లోని ‘్ఫయిజాబాద్’ జిల్లా పేరును ‘అయోధ్య’ జిల్లాగా మార్పుచేయడం స్వజాతీయ స్ఫూర్తికి అనుగుణమైన పరిణామం! ‘అయోధ్య’ అనాదిగా సరయూ నదీ తీరంలో నెలకొని ఉన్న నగరం. ‘్ఫయిజాబాద్’ అన్న పేరు కొన్ని శతాబ్దుల క్రితం విదేశాల నుంచి వచ్చిపడిన జిహాదీ మూకలు కల్పించిన పేరు. అఖండ భారతదేశంలో అనాదిగా పరిఢవిల్లిన ‘రాజ్యాల’లో ‘కోసల’ ఒకటి. ఈ ‘కోసల రాజ్యం’ సరయూ నదికి ఇరువైపులా విస్తరించిన ప్రాంతం. ‘‘అక్కడ- ఆ కోసల రాజ్యంలో- లోక ప్రసిద్ధమైన ‘అయోధ్య’ అన్న పేరుగల నగరం ఉంది. మానవులకు అధిపతి అయిన మనువుచేత ఈ అయోధ్య నగర నిర్మాణం జరిగిందని తొలి చరిత్రకారుడు వాల్మీకి తన రామాయణ ఇతిహాస కావ్యంలో వ్రాసి ఉన్నాడు. ‘‘అయోధ్యా నామ నగరీ తత్రాసీత్ లోక విశ్రుతా, మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మితా స్వయమ్...’’. ‘ఇతిహాసం’ అని అంటే వాస్తవంగా జరిగిన చరిత్ర. రామాయణం, వేదవ్యాసుడు రచించిన మహాభారతం- ఈ రెండూ ఇతిహాసాలని వేల ఏళ్లుగా ప్రసిద్ధి! ఈ చరిత్రలను భారతీయులు తమ భవిష్యత్ తరాలకు వివరించడానికై వ్రాసుకొన్నారు. విదేశాల నుంచి శతాబ్దుల పాటు చొరబడిన భౌతిక బౌద్ధిక బీభత్సకారులు మన చరిత్రను వక్రీకరించారు, మన పేర్లను మార్చి తమ పేర్లను పెట్టిపోయారు. ఇలా వందల వేల పట్టణాల, నగరాల, గ్రామాల, ప్రాంతాల, జనావాసాల పేర్లను విదేశీయ దురాక్రమణదారులు మార్చడం దాదాపు వెయ్యేళ్ల మన చరిత్ర! అయోధ్య నగరం పేరును విదేశీయ జిహాదీలు కాని, ఇతర దురాక్రమణదారులు కాని మార్చలేకపోయారు. కానీ అయోధ్య సమీపంలో ఉన్న ‘సాకేతం’ పట్టణాన్ని ‘్ఫయిజాబాద్’గా మార్చివేశారు. రఘురాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేసిన సమయంలో, త్రేతాయుగంలో, భరతుడు ‘సాకేతం’లోనే ఉండి రాముని పాదుకలను పూజించాడు, అయోధ్య నగర ప్రవేశం చేయలేదు. ఈ ‘సాకేతం’లోని నంది గ్రామంలో భరతుడు నివసించాడు. అందువల్లనే రఘురాముని వనవాస దీక్ష ముగిసిన తరువాత ‘అయోధ్య’, ‘సాకేతం’ జంటనగరాలుగా మారాయి. ఈ వాస్తవం తరతరాలుగా జనశ్రుతమై ఉంది. ఈ జనశ్రుతి ప్రాతిపదిగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘నంది గ్రామ రాజ్యాం’ అన్న చారిత్రక నవలను వ్రాసి ఉన్నాడు. అయోధ్యలోని రామజన్మభూమి మందిరాన్ని క్రీస్తుశకం పదహారవ శతాబ్దిలో కూలగొట్టిన విదేశీయ మతోన్మాదులు ‘సాకేతం’ పట్టణాన్ని ‘్ఫయిజాబాద్’గా మార్చారన్నది ‘కోసల’ప్రాంతంలోని జనశ్రుతి! విదేశీయుల బీభత్స‘పాలన’ ముగిసిన తరువాత డెబ్బయి దశాబ్దులు గడిచిపోయినప్పటికీ ‘్ఫయిజాబాద్’ అన్న పేరును తొలగించి పూర్వనామమైన ‘సాకేతం’ అన్న పేరును పునరుద్ధరించక పోవడం భావదాస్య ప్రవృత్తికి నిదర్శనం! ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫయిజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చింది. అయోధ్య, అంబేద్కర్ నగర్, బారాబంకీ, అమేథీ, సుల్తాన్‌పూర్ జిల్లాలతో కూడిన ఫయిజాబాద్ విభాగం-డివిజన్- పేరును కూడ అయోధ్య విభాగంగా మార్చారట! ఇదంతా జరిగిన అన్యాయాన్ని తొలగించడంలో సగం మాత్రమే! ‘్ఫయిజాబాద్’ పేరును ‘సాకేతం’ లేదా ‘సాకేత్’గా మార్చినప్పుడు మాత్రమే చరిత్రకు, భౌగోళిక వాస్తవానికి పూర్తి న్యాయం జరుగుతుంది...
పేరు అస్తిత్వానికి చిహ్నం, సమాజంలోని దేశంలోని ప్రపంచంలోని విశ్వంలోని అసంఖ్యాక వైవిధ్యాలకు పరిగణన లభిస్తున్నది పేరు వల్లనే. ఒక్కటి మాత్రమే ఉన్నప్పుడు ప్రత్యేకమైన పేర్లుపెట్టడం అవసరం ఉండదు. కానీ ఒక్కటైన దాన్ని, అద్వితీయమైన దాన్ని కూడ ఏదో ఒక పేరుతో పిలవడం సహజం. తొలి మానవుడు, తొలి సంస్కారాలు ప్రస్తుత భారతదేశంలోని సరస్వతీ ద్వషద్వతుల మధ్య ప్రాంతంలో పుట్టిపెరిగి భూమిమీది ఇతర ప్రాంతాలకు వ్యాపించడం చరిత్ర. అలాంటి కృతయుగంలో ప్రపంచమంతా ఒకే జాతి, ఒకే సంస్కృతి! అందువల్ల మన జాతికి, మన దేశానికి ప్రత్యేకమైన పేరులేదు. సనాతన భూమి-తుది మొదలు లేనిది, శాశ్వతమైనది సనాతనం- అని మన దేశాన్ని పిలుచుకున్నాము. అప్పుడు ప్రపంచమంతా సనాతన భూమి. త్రేతాయుగం మొదలయ్యేనాటికి ‘సనాతన స్వచ్ఛత’ అంతరించడం ఆరంభమైంది. అందువల్ల ప్రపంచపు ‘ఏకత్వం’ విభిన్న తత్త్వాలుగా మారింది. అందువల్ల స్వచ్ఛత చెడిన ఇతర జాతుల నుంచి దేశాల నుంచి విభిన్నమైన మన దేశానికి, జాతికి పేరుకావలసి వచ్చింది. భరతుని పేరుతో ఇది ‘్భరతజాతి’ అయింది. ప్రజలను భరించి పాలించేవాడు భరతుడు. ‘మనువు’ ప్రపంచానికి మొదటి పాలకుడు. అందువల్ల మనువు మొదటి భరతుడు. భరతుడు పుట్టిన సరస్వతీ ద్వషద్వతీ నదుల ప్రాంతం ఉన్న మన దేశం ఇలా భారతదేశమైంది. ద్వాపర యుగంలోను కలియుగంలో మూడువేల ఏళ్లవరకు మన దేశం పేరు ‘్భరత ఖండం’. అప్పుడు శాలివాహన సమ్రాట్టు ఉదయించాడు, దురాక్రమించిన విదేశీయ బీభత్సమూకలను తిప్పికొట్టాడు. సింధూ నది పేరుతో దేశానికి ‘హిందూస్థానం’అని పేరుపెట్టాడు- ‘‘హిందూస్థానం ఇతిజ్ఞేయం...’’
ఇలా మన దేశానికి మన ఇంటికి మనం ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు! కాని మన దేశాన్ని కొల్లగొట్టుకుపోయిన దురాక్రమణదారులకు ఇలా మనకు పేర్లుపెట్టే అధికారం లేదు. అందువల్ల దురాక్రమణదారులు పెట్టిన పేర్లను దురాక్రమణ ముగిసిన వెంటనే స్వజాతీయులు తొలగించుకోవడం, పూర్వపు పేర్లను పునరుద్ధరించుకోవడం స్వాతంత్య్ర ప్రవృత్తి.. దురాక్రమణదారులు పెట్టిన పేర్లను అలాగే కొనసాగించడం బౌద్ధిక దాస్యానికి నిదర్శనం! ‘రొడీషియా’ అన్న పేరును ఐరోపా వారు పెట్టారు. స్వాతంత్య్రం పొందిన ఈ ఆఫ్రికా దేశం ‘రొడీషియా’ను తొలగించింది, ‘జింబాబ్వే’ అయింది! ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. భరత ఖండం, హిందూస్థానం వంటి పేర్లను తొలగించి బ్రిటన్ బీభత్సకారులు మన దేశాన్ని ‘ఇండియా’ అని పిలిచారు! కానీ మనం మాత్రం ‘ఇండియా’ను తొలగించుకోవడం లేదు, అన్ని భాషలలోను మన దేశాన్ని ‘్భరత్’ అని మాత్రమే పిలవాలని రాజ్యాంగంలో ఇప్పటికీ నిర్దేశించుకోలేదు. ఇది దేనికి చిహ్నం! జిహాదీలు మన దేశంలోని ‘గాంధార’ ప్రాంతాన్ని అఫ్ఘానిస్తాన్‌గా మార్చారు. ఐరోపా వారు సింహళ ద్వీపాన్ని ‘సిలోన్’గా మార్చారు! అఫ్ఘానిస్థాన్ పేరు మళ్లీ ‘గాంధారం’ కాకపోవడం చారిత్రక వైపరీత్యం! ‘సింహళ’వాసులు ‘సిలోన్’ను తొలగించుకొని ‘శ్రీలంక’గా ఏర్పడడం స్వాతంత్య్ర భావ పతాకం...
విదేశీయ ‘జిహాదీ’లు తెలుగునేలపై శతాబ్దులపాటు బీభత్సం సృష్టించారు. పాలమూరును ‘మహబూబ్‌నగర్’గా, భాగ్యనగరాన్ని ‘హైదరాబాద్’గా అరిపరాలను ‘కరీంనగరం’గా, ఇందూరును ‘నిజామాబాద్’గా తాండూరును ఆదిలాబాద్‌గా మార్చివేశారు. క్రీస్తుశకం 1322లో కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన జిహాదీలు ఆరువందల ఇరవై ఐదు ఏళ్లపాటు ‘తెలంగాణ’లో ఇలా బీభత్సకాండను సృష్టించారు, ‘రజాకార్లు’ ఈ పైశాచిక తత్త్వానికి పరాకాష్ఠ! తెలంగాణ విముక్తమై డెబ్బయి ఏళ్లు గడిచిపోయాయి. ఆయా పట్టణాలకు నగరాలకు పూర్వపు పేర్లు ఎందుకని పునరుద్ధరించలేదు? పొరుగు ప్రాంతాలలోని ‘మెడ్రాస్’ ‘చెన్నయి’గా మారింది. ‘కాలికట్’ తొలగి ‘కోఝికోడ్’ మళ్లీ వెలిగింది. ‘బిజాపూర్’ ‘విజయపుర’ అయింది. ‘విక్టోరియా టెర్మినస్’ ‘్ఛత్రపతి శివాజీ ఠాణా’గా మారింది! ఇలా స్వదేశీయ, స్వజాతీయ స్ఫూర్తి విస్తరిస్తోంది! దేశమంతటా ఉన్న బానిసత్వ చిహ్నాలను తొలగించి, పూర్వపు పేర్లను పునరుద్ధరించే సమగ్ర ప్రణాళికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించవలసి ఉంది. మన దేశ రాజధాని ‘్ఢల్లీ’ మళ్లీ ‘ఇంద్రప్రస్థం’ ఎప్పటికి కాగలుగుతుంది...?