ప్రకాశం

అక్టోబర్ 2లోగా ఎనిమిది పట్టణాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 30: ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీలోగా జిల్లాలోని ఎనిమిది పట్టణాలను బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. శనివారం కేంద్రప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ స్వచ్ఛ్భారత్ మిషన్ కార్యదర్శి రాజీవ్‌గౌబా, సంయుక్తకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ విశాఖపట్నం నుండి జిల్లాకలెక్టర్లు, మునిసిపల్‌కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ,బహిరంగ మలవిసర్జన రహిత వార్డులప్రకటన అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కేంద్రప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ గౌభా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్చ్భారత్ అమలులో ఆదర్శవంతంగా ఉందన్నారు. ఈసందర్భంగా స్వచ్చ్భారత్ రాష్టమ్రేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలౌతున్న స్వచ్ఛ్భారత్ పురోగతిని వివరించారు. జిల్లాలోనుండి జిల్లాకలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది పట్టణాలున్నాయని, వాటన్నింటిని అక్టోబర్ రెండవతేదీలోగా బహిరంగ మలవిసర్జన రహితప్రాంతాలుగా ప్రకటిస్తామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఒంగోలు మునిసిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, అద్దంకి, కనిగిరి, కందుకూరు,చీరాల, చీమకుర్తి, మార్కాపురం మునిసిపల్ కమిషనర్లు నాగమల్లేశ్వరరావు, పద్మావతి, రమణకుమారి, బ్రహ్మాం, ఆదినారాయణ పాల్గొన్నారు.