శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అల్లబృందావనిన్ వల్లవీ జనులకు
ఆలంబనంబులై అమరెనెవ్వి
సౌవర్ణమయములై సద్రత్నయుతములౌ
అంగదంబులతో నడరునెవ్వి
క్రౌర్య స్వరూపుడౌ కంసుని గూల్చిన
వితత మసాబలయుతము లెవ్వి
గోవర్ధనము నెత్తి గోపాలకులగాచు
వేళ, పంకంబుతో వెలసెనెవ్వి?
తే.గీ. కులయాపీడనంబును దివికి బంపు
తరిని, మదజలంబులతోడ తడిసెనెవ్వి
అట్టిసుశ్యామలాంగుని అతులమైన
బాహుయుగము మనలకు శుభమ్ము లొసగు
భావం: బృందావనంలో గోపికలు తల వాల్చుటకు ఆలంబనంగానిలిచేవీ, రత్నఖచితమలైన బంగారు కేయూరములతో రాజిల్లేవీ, కంసుని సంహరించిన మహాబలము గలిగినవీ , గోవర్ధనము నెత్తిన వేళ గొప్పవర్షంతో బురదలతో అలముకొన్నవీ, మదించిన కువలయాపీడనము అనే ఏనుగును మర్దించేవేళ దాని మదజలధారలతో తడిసినవీ అయిన నీల మేఘ శ్యాముని మాహఉయుగము మనకందరికీ శుభముల నొసగుగాక! (శ్రీశుభాంకుడు)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949