శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ముందువెనుకలు యోచించి యెందునైనఁ
బద్ధతినిఁ దప్పకుండిన ఫలముగల్గు
లక్ష్య పెట్టనిచోఁ జిక్కుల ధికమగును
చూడుమో కర్మసాక్షి!యోసూర్యదేవ!

భావం: ఏ విషయంలోనైనా ముందువెనుకలు బాగా ఆలోచించి క్రమపద్ధతిని తప్పని విధంగా నడుచుకుంటే అద్భుతమైన ఫలితం కనబడుతుంది. అనాలోచితంగా వేటినీ లక్ష్యపెట్టకుండా ముందుకు సాగిపోయిన పక్షంలో ఎనె్నన్నో చిక్కులేర్పడుతాయ. వాటినుంచి బయట పడడం చాలా కష్టమవుతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ మనుష్యులకు తెలియజెప్పుస్వామీ.
తే.గీ. మదిన సుఖదుఃఖములనుసమానముగనుఁ
దలచి చిత్తాన సుస్థిరత్వమునుఁ బొంది
యడుగుఁ గదుపంగ వలయునీ యవని జనులు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎవరైనా మనసులో సుఖదుఃఖాలు రెండింటినీ సమానంగా భావించాలి. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. బాధలు వస్తే కుంగిపోవడం, సుఖం కలిగితే తనంతటివాడు లేడని విర్రవీగడం పరిపాటి. కానీ సుఖదుఃఖాలు క్షణభంగురాలని తెలుసుకొని స్థితప్రజ్ఞత కనబరిచి సుస్థిరత్వాన్ని పొంది జాగరూకతతో ఈ భూజనులంతా సన్మార్గాన నడుచుకోవాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా లోకానికి ప్రబోధించవయ్యా స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262