శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. దారుణ ధ్వాంత తతికి మార్తాండుడైన
వాడు భవరోగ సమితికి వైద్యుడైన
వాడు, దాహార్తులకు భవ్య వర్షమేఘ
మైన వాడు మా పెన్నిధి యైనవాడు
భక్తజనపాలుడౌ చక్రి వచ్చుచుండె
భావం: నిబడగాఢాంధకారమునకు మధ్యందిన మార్తాండుడైనవాడు, భవరోగములను బాపే వైద్యుడైన వాడు, దాహంతో అలమటించేవారికి వర్షన్నిచ్చే కరిమేఘం లాంటివాడు, మాకు అన్ని వేళలా పెన్నిధియైన వాడు ఐన శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడని సంతోషంతో చెబుతోంది ద్రౌపదీ దేవి.
(వ్యాసభారతం)
తే.గీ. తనదుఘన నీల రూపంము కనగ, గోపి
కాళి నయనోత్పలములకు కాటుకైన
వాడు తనవేణునాదముల్ వల్ల వీజ
నంబులకు సుశ్రవణ కుండలంబులైన
వాడు, సలలిత సుందర భాషణుండు
దీన జనబంధు డగుచు చక్రి దిక్కునాకు
భావం: నల్లని తనరూపమే గోపికల యొక్క కన్నులకు కాటుకై భాసించవాడు, తన మురళీ నినాదములు గోపికలకు శవ్రణ కుండముల రాజిల్లేవాడు, మధుర మంజుల భాషణుడు ఐన మురళీ మోహనుడు నాకు దిక్కు
(రూప గోస్వామి)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949