శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. జగతి దద్దిల్లుచుండెనే జంతుబలుల
కర్థముం బరమార్థమ్ము కానరాదు;
అంధవిశ్వాసమదిఁ గూడదట్టి మూగ
జీవముల దైన్యముంగాంచఁ బోవరేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అర్థం పర్థంలేని జంతుబలులతో ఈ లోకం దద్దరిల్లిపోతోంది. గ్రుడ్డి నమ్మకాలతో జంతువులను బలివ్వడం ఎంత వరకు సమంజసం? ఆ మూగ జీవాల దీనస్థితిని కనులుండి చూడలేక పోతున్నారు. మనసుండి ఆలోచించలేకపోతున్నారు. ఈ దారుణాలకు అడ్డుకట్టపడేదెన్నడో కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనా చూడవయ్య.
తే.గీ. కంటకగుపడు ప్రతిఱాతికమిత భక్తి
శ్రద్ధలంజూపి కోరెదరార్తితోడఁ
బిల్లలనుఁ బిమ్మటేలకో తల్లులరయ
వేగలేమంచు నాకోపవేగమేల?
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: పిల్లలకోసం వ్యధ చెందుతూ కనబిడ్డకావాలని ప్రతి రాతికి మొక్కే తల్లులే భగవత్ కృపతో పిల్లలు కలిగిన తరువాత ఈ పిల్లలతో వేగలేకపోతున్నామంటూ ఇటు పిల్లల్నీ అటు దేవుడినీ కోప్పడే తల్లులుగా మారిపోయి కొందరు ఈలోకంలో కనిపిస్తుంటారు. ఇది ఏమి చిత్రమో సూర్యదేవా కర్మసాక్షివైన నీవైనా చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262