శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కట్టుకున్నటి వస్త్రాల ఁగాంచి విలువ
లిచ్చు చున్నారు చోద్యమ్ము మచ్చుకైన
లోన సుగుణాల ఁ జూడరీలోకమందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ రోజుల్లో కట్టుకున్నట్టి వస్త్రాలను చూసే వ్యక్తులకు విలువలను ఆపాదిస్తున్నారు తప్ప, ఎదుటివారిలో ఉన్న అనేకానేక సుగుణాల్లో ఏ యొక్క సుగుణాన్ని అయినా చూడకున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యథేవా! లోనున్న సుగుణాలను గుర్తించి విలువలనిచ్చే రోజుకోసం ఎదురుచూస్తున్నాను స్వామీ. నా కోరిక ఫలింపచేయి ఓ సూర్యదేవ!
తే.గీ. వాలు రమ్ముల పలుకులు పలికియెదను
గాయపరుచుదురీనాడు కాయమునకు
గాయమైనను తొలగును గాక యెదకు
గాయమైనను తొలగునా? కనులు దెరువఁ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: క్రూర బాణాల వంటి పలుకులతో ఎదుటివాని మనస్సును గాయపరుస్తున్నారే! శరీరానికి తగిలిన గాయం కాలక్రమేణ మానిపోతుంది. హృదయానికి తగిలిన గాయాలు మానవని తెలిసి కూడా పనిగట్టుకుని మరీ ఎదుటి వ్యక్తుల మనస్సు గాయపరుస్తున్న వాళ్ల కనులు తెరిపించవయ్య. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం.. 9492457262