శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కొలది దానంబుఁ జేసినఁ గొలదిగాక
ఫలము గొండంత లభియించుఁ దలుపఁబోరు
మూటఁ గట్టుకు నెచటకు మోసుకెళుదు
రది యసాధ్యంబు మిగులదే ఱాయి కడకుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దానం కొద్దిగా చేసినా పలితం కొండంత దొరుకుతుంది. బీదలకిచ్చిన దేదీ వ్యర్థం కాదు. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించరు. కూడబెట్టిన సొమ్మంతా ఎక్కడికి మోసుకెళ్లగలరు? చివరకి ఒక్కరాయిని కూడా వెంట తీసుకొని పోలేరే? సంపన్నవర్గాల దృష్టి కాస్త పేదలపై పడేలా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్యప్రభూ.
తే.గీ. కలలు గనబోరు కలలు సాకారమగుట
కై ప్రయత్నము సేయంగఁ గదలబోరు
పుట్టుకున్నను సాకార మొదవుటెట్లు?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎన్ని జన్మల పుణ్యపలం వల్లనో మనకు ఈ గొప్పనైన మానవ జన్మ లభించింది. ఈ జన్మలో అందమైన కలలు కనాలనుకోరు కొందరు. కొంతమంది కన్న కలలు నిజం కావడానికి ఇసుమంతైనా ప్రయత్నించరు. ప్రయత్నలోపం మనలోనే ఉన్నప్పుడు కన్న కలలు సాకారం కావడం అసంభవం కదా. ఈ విషయాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవే తెలియ జేయాలి ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262