శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తెలియుం జేయుపాపాలు దెలియుఁజెప్పు
నప్పుడేడ్చిన ఫలమేమి? నరకమేల?
యిహపరంబుల స్వర్గంబునేల వలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కొందరు చేసేవన్నీ పాపాలే అని తెలిసి కూడా వాటినే చేస్తూ పోతుంటారు. ఆ చేసిన ఆ పాపాలే బుద్ధి వచ్చేలా చేస్తాయి. అప్పుడేడిస్తే మాత్రం ప్రయోజనమేముంటుంది గనుక? పాపాలు చేసి నరకానికి చేరుకోవడమెందుకు? అదే పుణ్యకార్యాలు చేసి ఇహపరాల్లో స్వర్గాన్ని పరిపాలించే వాళ్లు కావాలికాని. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ విషయాన్ని అందరికీ తెలియజెప్పవయ్యా లోకబాంధవా!
తే.గీ. శత్రుసంహారి వీరుడా? శక్తిఁజపి
మది గెలుచువాడె వీరుడిమ్మహిన ఁ గాంచ
మది మసాప్రమాదకమది మాయలాడి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: శత్రువును సంహరించినవాడు వీరుడు కాడు. ఆలోచిస్తే ఈ భూమండలంలో జితేంద్రియుడై మనస్సును గెలిచేవాడే నిజమైన వీరుడు. మాయలాడియైన మనసు మనల్ని ప్రక్కత్రోవ పట్టిస్తుందని తెలుసుకొని దానిని నియంత్రించి కట్టడిలోకి తెచ్చుకుని బుద్ధి చెప్పినట్లు మనస్సు వినేటట్టు చేసుకొని అన్నీ మంచికార్యాలే చేస్తుండేటట్టు కర్మసాక్షివైన ఓ సూర్యదేవ నీవే ప్రబోధించాలి స్వామి!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262