శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. రేయనకఁ బగలనకను రెక్కలకునుఁ
గష్టముంగూర్చి పెట్టిన కార్మికులనుఁ
గనుచుఁ గోర్కెలు దీర్చిన ఁ గలలు పండుఁ
బెనువిపత్తుకు బాటలు వేయ ఁదగున?
చూడుమా కర్మసాక్షి యో సూర్యదేవ

భావం: రాత్రనక, పగలనక రెక్కల కష్టంతో బ్రతుకులను నెట్టుకొస్తున్న కార్మికుల కష్టం చూసి వారి కోరికలను నెరవేర్చిన పక్షంలో పాపం వాళ్ల కలలు పండి సుఖమయ జీవనం సాగిస్తారు. అది దేశానికెంతో క్షేమకరం. పెను విపత్తుకు బాటలు వేయడం శ్రేయోదాయకం కాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! తెలియచెప్పు స్వామి.
తే.గీ. గుడులు దెరువక ఁ బోయిన గుండెలందుఁ
దలతుమా దేవతాళినిఁ గొలువవచ్చు
బడులు దెరవనిచో జ్ఞానఫలములకట
చూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కారణాంతరాల వల్ల దేవాలయాలు తెరవడం సాధ్యం కాకపోయినా గుండె గదుల్లో ఆయా దేవతామూర్తులను ప్రతిష్ఠించుకుని ఎంతగానో కొలువవచ్చు. అదే బడులు మూతపడిన పక్షంలో అయ్యో జ్ఞాన ఫలాలందక జగమంతా అంధకారబంధురం కాగలదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా అందరినీ కాపాడు స్వామి..

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262