శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తిన్న యింటివాసంబుల నెన్నువాడు
పాపకూపాన ఁబడు చెడు ఫలితమొంది
సర్వనాశనమై పోదురుర్విపైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! తిన్నయింటి వాసాలను లెక్కబట్టేవాళ్ల అంటే విశ్వాస ఘాతుకులెందరూ ఉన్నారు. అలాంటి వాళ్లు పాపకూపంలో పడిపోయి, చెడు ఫలితాలను చూరగొంటూ ఈ భూమిపై సర్వనాశనం అయి పోతారరని, ఇది ఎంత మాత్రం తగదని నీ శైలిలో చెప్పవయ్య స్వామీ!

తే.గీ. జీవముంగాన సరిపోదు తీసుకున్న
దదియు వరగదు పనిచేయఁ దలపకున్న
వ్రేటు పడునేదియొ యొక వేళ సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలోనూ ఇతరత్రా వివిధములైన చోట్ల పని చేస్తూ జీతాలు తీసుకుంటున్నామంటే సరిపోదు. సోమరినంతో తప్పించుకుని తిరిగే మనస్తత్వంతో పనిచేయకుంటే ఆ తీసుకొన్న జీతం అరగదు సరికదా. ఏదో యొక రోజు దెబ్బపడితీరుతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! నీశైలిలో చెప్పవయ్య స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262