శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వర్షములు పడి పండలు పండుచుండె
నన్నదాతల కన్నులానందమొలుకు
చుండె! వరుణదేవుండ! కైదండలయ్య
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఇటీవల సమృద్ధిగా వర్షాలు పడి చక్కటి పంటలు పండుతున్నాయి. అన్నదాతలైన రైతుల కన్నుల నుండి ఆనందం జాలువారుతోంది. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య రైతుల ఆనందం. ఓ వరుణదేవా! నీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాను స్వామీ. అన్ని కాలాల్లోను మీ ఇద్దరి దయ మనుష్యులందరికీ అందేలా చూడుము లోకప్రభూ!

తే.గీ. మద్య మది మహమ్మారియు హృద్యమైన
జీవితాలనుఁ గాలరానేయునంత
దాని జోలికి పోరాదు తప్పిపోయి
చూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ

భావం: మద్యం మహమ్మారి అందమైన జీవితాలను కాల రాసిపారేస్తుంది. ఒక్కసారి తమాషాకైనా దానిని ముట్టుకుంటే అంటువ్యాధి వలె అది వ్యసనమై పోతుంది. ఆ తరువాత జీవితాలను నాశనం చేస్తుంది. దానిని కనిపెట్టి మర్చిపోయి కూడా దాని జోలికి పోరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ! నీదైన శైలిలో ఈ జనాల కళ్లు తెరిపించవయ్య! ఏ మనుజుడూ మద్యానికి బానిస కాకుండా చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262