శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చెల్లి పలుకులకే యన్న యుల్లములరుఁ
జెల్లెలి క్షేమమే యన్న క్షేమమరయఁ
జెల్లెలానందమే యన్న సిరులకోట
రెప్పయై చెల్లెలినిఁ గాతురెప్పటికిని ఁ
జూడుమో కర్మసాక్షి! యూసూర్యదేవ!

భావం: చెల్లెలి తీయతీయటి ప్రేమపూర్వకరమైన పలుకులతో అన్నమనసు ఆనందంతో ప్రకాశిస్తుంది. ఆలోచిస్తే అలాంటి చెల్లెలి క్షేమమే అన్న క్షేమం. చెల్లెలి ఆనందమే ఏ అన్నకైనా సిరులకోట. అందుకే చెల్లెలిని కంటికి రెప్పగా చూసుకోవాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి అనుబంధాల విలువ తెలియజేయుమయ్యా లోకప్రభూ!
తే.గీ. మరలిపోయిన క్షణములు మరలిరావు
వర్తమానాన భవితకు బాటవేయ
జీవితమ్ములు సుఖమయమై వెలుంగుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: గడచిపోయిన క్షణాలు తిరిగి రావాలంటే రావు.
ఠక్షణం గడిచిపోతే తిరిగి రావు. కనుక దానే్న ఆలోచిస్తూ ఉంటేవర్తమానం కూడా పాడవుతుంది. వర్తమానం లేకపోతే భవిష్యత్తు కనబడకుండా పోతుంది. కనుక ఈవర్తమాన కాలంలో ఉజ్జ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. అప్పుడే నిండు జీవితాలు సుఖమయమై ప్రకాశిస్తాయని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్య ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262