శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కనగ ఁ జేదోడు వాదోడుగను జనాళి
మెలగవలెనుర్విలో సదా మించుబంధ
ముల్లుకొనుచును మెలగంగనవనిమురియుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: జనులంతా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పవిత్రమైన ప్రకాశవంతమైన బంధాన్ని పరస్పరం అల్లుకుంటూ నడచుకుంటున్న పక్షంలో అవనితల్లి ఎంతగానో మురిసిపోతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్యా స్వామీ.

తే.గీ. తలుప దైవాలు మన తల్లి దండ్రుల నెడి
భావసంపత్తిఁ గల్గిన భావిలోన
మేలు చేకూరునాశ్చర్య మేమి లేదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనకన్నతల్లిదండ్రులే దైవాలన్న అద్భుతమైన భావ సంపదను కల్గియున్న పక్షంలో భవిష్యత్తులో మనకు మేలు చేకూరుతుందనడంలో ఆశ్చర్యంలో అతిశయోక్తిగానీ లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి ప్రబోధించవయ్యా ఓ భాస్కరదేవా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262