శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చెంత కృష్ణుడు ప్రేమతో చెలగువేళ
వానితోడిదే లోకమై బరుగుచుండు
వాని నెడబాసి విరహాన నానువేళ
లోకమంతయు కృష్ణుడై మ్రోలనిల్చు!

భావం: కృష్ణుడు దగ్గర ఉంటే అతడే నాకు లోకం. చెంత కృష్ణుడు లేనివేళ లోకమంతా కృష్ణమయంగా కనిపిస్తుందని చెలులతో రాధ చెబుతోంది.
*
తే.గీ. నందుని పురమునందున సుందరమగు
నెమలి పింఛము శిరము పై నివ్వమిళ్ల
అమర వేణువును కటి దేశమున దోపి
ముల్లు గఱ్ఱను చే దాల్చి మోహనముగ
ఆలమందల పాలించు హరికి నతులు
భావం: నంద్ర వ్రజము నందు నెమలి పింఛమును శిరమున దాల్చి వేణువును బొడ్లో దోపుకొని , ముల్లుగఱ్ఱను చేత ధరించి గోవులను పాలించే హరి అవతారమైన గోప బాలునకు నమస్సులు.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949