శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. శ్రీ సతి తోడు కాళికయు చిన్మయి బాలసరస్వతీ యుతం
బైసరి నిల్చినావు నిల బాసర యందున జ్ఞాన సిద్ధి ప్ర
జ్ఞా సమసిద్ధి సంపదయు సాధ్యము జేసెదవందుమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వరదాయిని శ్రీ సరస్వతీ!

2. వ్యాసుల వారు దోసిటను పావన గౌతమి సైకతమ్మచేన్
జేసెను నీదు రూపమును చెంతను నిల్పెను దత్త దేవునిన్
ఆ సరసీ ప్రదేశమున కావల శ్రీపతి వేంకటేశునిన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని శ్రీసరస్వతీ!

3. వ్యాస సరస్వతీ యనగ వాసిని గాంచితివమ్మ నీవు ఔం
వ్యాసితమైన పుష్కరిణి యందున నున్నవి అష్టతీర్థముల్
భాసిత పానవట్టమున భాసిలు నీవు భవానివే కదా!
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని శ్రీసరస్వతీ!

4. వ్యాసముని ప్రతిష్టిత భవానిని వాణివి గౌతమీతటో
ద్భాసిత శక్తి రూపిణివి పాయక నిన్ను జపించు సాధకో
పానక శ్రేణిపై కరుణ వర్షిల జేయుచు బ్రోవుమమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి బి.శర్మ 9246171342