శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సుకుమార దేహమున కెన్నియొ ఆశలు మోహపాశముల్
శ్వాసయు నాగినంతటనె సర్వము శూన్యము యేడబోదు మో
మోసపు కోర్కెలా? వలదు మోక్షము నీయవె జ్ఞాన సిద్ధిచేన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!

వాసన లీను సంపెగల పంచకునైనను రావు తుమ్మెదల్
దాసని పువ్వు చుట్టు దరిదాపుల దండుగ మ్రోయుచుండు సం
వాసితవౌ మధూళి మధుపమ్ముల కాశల బెంచునట్లుగన్
అసరి తీరు దానగుణ మాశ్రీతులన్ దరిజేర నిచ్చెడున్
వాసర వాసినీ ప్రథిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!
వేసముగట్టి నెన్నుదుట వేడుక బొట్టును బెట్టి, మోమునన్
బాసిగమున్ ధరించి పరివారము వెంటను రాగ, పల్లకీ
లో సుమహార వారములలోనొక సుందరి ప్రక్కనుండగన్
ఆ సిరి సౌరులే స్థిరములౌనని యెంచి, భ్రమించి, మున్గితిన్
ఆసరలేని సంస్కృతి మహాంబుధినే దరికానరాదు, హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

వాసర యన్న పేరునకు వాసరమున్నను జెల్లునమ్మసం
వాసము నీదు చెంత ననివార్యము వాసరమైన కావునన్
వాసరమైన నేమి బహువర్షములైనను హర్షమే కదా
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342