శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రూరుడు
ఒకడె వచ్చినాడు ఒక్కడే వెడకల
ప్రాణమిత్రుడైన వేణు ధరుని
వెంట బెట్టుకొనియు వెడలెడు నీతడ
క్రూరుడసలుగాడు , క్రూరుడేను
భావం: ఒక్కడే వచ్చినవాడు, ఒంటరిగా వెళ్లక, తమ ప్రాణమిత్రుడైన శ్రీకృష్ణుని మధురకు వెంట తీసికొని వెళ్లుతున్న ఈతడు పేరుకు మాత్రమే అక్రూరుడు. నిజంగా కూరుడే అనుకున్నారట గోపికలు. శ్రీకృష్ణునిపై గోపికలకు గల అపారమైన ప్రేమ వారికలా అనిపించేటట్లు చేసింది.
అన్నీ నీలోని వింతలే
నిరుపమ గుణధామ నీల మేఘ శ్యామ
సదయహృదయ సీమ సమరభీమ
నిఖిల జగమునందు నీలోని వింతలే
నిండి నెగడు చుండె నీరజాక్ష!
భావం: బలరామకృష్ణులను రథంలో కూర్చుండబెట్టుకొని మధురకు వెళ్లే మధ్యలో యమునానదిలోకి దిగిన అక్రూరుని శ్రీకృష్ణుడు నదిమధ్యలో ఉన్నట్టు, వైకుంఠవాసునిగా దర్శనమిచ్చాడట. దాంతో తిరిగి రథం దగ్గరకు రావడం ఆలస్యమైంది. అపుడుకృష్ణుడు ఆలస్యానికి కారణమేమటి ఏదైనా వింతలున్నాయా అక్కడ అని అడిగితే అక్కడ వింతలు లేవు కానీ నీలోనే అన్నీ వింతలున్నాయి. అవే లోకమంతా వ్యాపించి ఉన్నాయి అన్నాడు.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949