శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. వె. ధాన్య లక్ష్మికొరకు ధనలక్ష్మి కొరకునై
అవని భక్తజనులు అడుగుచుంద్రు
మోక్షలక్ష్మి కొరకు మునులు ధ్యానింతురు
ఎన్న నీవె తగదు వన్ని యొసగ ॥

భావం: కృష్ణా! లోకంలో కొందరు నిన్ను ధనంకోసం ప్రార్థిస్తారు. ధాన్యరాశుల కోసం ప్రార్థించే వారూ ఉన్నారు. ముముయువులు నిన్ను కేవలం మోక్ష లక్ష్మి కోసం ప్రార్థిస్తారు. ఆలోచిస్తే అన్నీ ఇవ్వడానికి నీవే సమర్థుడవుకదా.(శ్రీ శంకరుడు)
ఆ.వె. పరమ శివుడె నిన్ను ప్రస్తుతించుచునుండ
బ్రహ్మ సేయు చుండవందనంబు
వాసవాది సురలు వలచి సేవలు సేయ
మాదుస్థాన మెచ ట మాధవయ్య
భావం: మాథవా! మధుసూదనా! పరమేశ్వరుడే నిన్ను సంస్తుతిస్తూ ఉండగా బ్రహ్మయే నీకు వందనము సేయు చుండగా ఇంద్రాది సురలు నీకు ప్రేమతో సేవలు చేస్తూండగా అతి సామాన్యుల మైన మా స్థాన మెచ్చట తండ్రీ! (శ్రీధనుంజయుడు)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949