అనంతపురం

ఏదీ ‘స్వచ్ఛత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముందుకు కదలని స్వచ్ఛ భారత్
* మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబాటు
అనంతపురం, నవంబర్ 29 : జిల్లాకు స్వచ్ఛ భారత్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణం ‘ఎక్కడేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైంది. ఆఖరకు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అమాత్యులతోపాటు ప్రభుత్వ చీఫ్‌విప్, విప్ నియోజకవర్గాల్లో సైతం ఏమాత్రం మార్పులేదు. ఈమేరకు ఆయా మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, ప్రారంభించినవి, పూర్తయిన సంఖ్యను పరిశీలిస్తే విషయం ఆవగతమవుతుంది. పౌర సరఫరాల శాఖామాత్యులు పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలంలో 1362 మంజూరు కాగా 599 మొదలుపెట్టగా 50 మాత్రమే పూర్తయ్యాయి. ఆత్మకూరులో 1340 మంజూరు కాగా 528, చెనే్నకొత్తపల్లి మండలంలో 1168 మంజూరు కాగా 528, కనగానపల్లి మండలంలో 1146 మంజూరు కాగా 175 మొదలుపెట్టగా ఒక్కటీ పూర్తి కాకపోవడం గమనార్హం. రామగిరి మండలంలో1428 మంజూరుకాగా 552 మొదలుపెట్టగా 40 మాత్రమే పూర్తయ్యాయి. మొత్తంగా 7714 మంజూరు కాగా 2625 మొదలు పెట్టగా కేవలం 90 మాత్రమే పూర్తయ్యాయి. ఇక సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలంలో 1276 మంజూరు కాగా 611, పుట్టపర్తిలో 1582 మంజూరుకాగా 591, బుక్కపట్నంలో 1204 మంజూరుకాగా 505, నల్లమాడలో 1576 మంజూరుకాగా 224, ఓడిసి మండలంలో 1475 మంజూరుకాగా 351 ప్రారంభమయ్యాయి. ఆమడగూరు మండలంలో 1659 మంజూరుకాగా 321 మొదలుపెట్టగా ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే పూర్తయింది. మొత్తంగా 8772 మంజూరు కాగా 2603 మొదలుకాగా ఒకే ఒక్కటి పూరె్తైంది. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గంలో 1209 మంజూరుకాగా 588 మొదలుకాగా 10 మాత్రమే పూర్తయ్యాయి. బొమ్మనహాళ్‌లో 1860 మంజూరుకాగా 611 ప్రారంభించగా ఒక్కటి పూర్తయింది. ఇక డీ.హీరేహాళ్ మండలంలో 1250 మంజూరుకాగా 236 ప్రారంభం కాగా 10 పూర్తయ్యాయి. వీటితోపాటు గుమ్మగట్టలో 1751 మంజూరుకాగా 695, కణేకల్‌లో 1696 మంజూరుకాగా 625 మొదలుకాగా రెండు మండలాల్లో ఒక్కటీ నిర్మాణం పూర్తి చేసుకోలేదు. ఉరవకొండ నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి. ఈ నియోజకవర్గలోని కూడేరులో 1217 మంజూరుకాగా 276, ఉరవకొండలో 1469 మంజూరుకాగా 529 ప్రారంభంకాగా రెండు మండలాల్లో ఒక్కటీ పూర్తి కాలేదు. బెళుగుప్పలో 1674 మంజూరుకాగా 1236 మొదలుకాగా 20 మాత్రమే పూర్తయ్యాయి. వజ్రకరూరులో 1349 మంజూరు కాగా 722 ప్రారంభించగా రెండు మాత్రమే పూర్తయ్యాయి. విడపనకల్లులో 1392 మంజూరుకాగా 352 మొదలుకాగా రెండు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తంగా 7101 మంజూరుకాగా 3115 ప్రారంభంకాగా 24 మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ప్రభుత్వ విప్ యామినీబాలతో పాటు శమంతకమణి ఎమ్మెల్సీ ఉన్న శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో 1351 మంజూరుకాగా 521, నార్పలలో 1703 మంజూరుకాగా 336, పుట్లూరులో 1631 మంజూరుకాగా 462 ప్రారంభించగా మూడు మండలాల్లో ఒక్కటీ పూర్తి కాలేదు. ఇక గార్లదినె్నలంలో 1554 మంజూరుకాగా 817 మొదలుకాగా 28 పూర్తయ్యాయి. శింగనమలలో 1573 మంజూరు కాగా 585 మొదలు కాగా రెండు మాత్రమే పూర్తయ్యాయి. యల్లనూరులో 1505 మంజూరుకాగా 618 మొదలు కాగా ఐదు మాత్రమే పూర్తయాయి. తాడిపత్రిలో 5302 మంజూరుకాగా 1212 మొదలుకాగా 151 పూర్తయ్యాయి. ఇలా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో స్వచ్ఛ భారత్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో ఏమాత్రం ముందుకు సాగడం లేదని చెప్పవచ్చు.