ప్రకాశం

తుఫాన్ వాహనం బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ఒకరు మృతి - ఇద్దరికి గాయాలు
సంతమాగులూరు, డిసెంబర్ 18 : మొక్కులు తీర్చుకునేందుకు విజయవాడ సమీపంలోని గుణదల దేవాలయానికి తుఫాన్ వాహనంలో పయనమైన కుటుంబం వాహనం బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. గుంటూరు -కర్నూల్ రహదారిలో కామపల్లి వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో మేరి (28) మృతి చెందగా రమాదేవి, సుబ్బయ్యకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే దొనకొండ మండలం జంగదేవరపల్లి గ్రామానికి చెందిన మేరి తోడికోడలు నాసరమ్మ మొక్కులు తీర్చుకునేందుకు తుఫాన్ వాహనంలో 12 మంది కుటుంబ సభ్యులతో గుణదలకు బయలుదేరారు. కామేపల్లి సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లో బోల్తా కొట్టింది. వాహనంలో ఎడమ వైపున కూర్చొని ఉన్న మేరి ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందగా వెనుక సీటులో కూర్చొని ఉన్న రమాదేవి, సుబ్బయ్యకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్షతగాత్రులను నర్సరావుపేట వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవరావు తెలిపారు.

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
కండక్టర్, డ్రైవర్‌కు గాయాలు
కొత్తపట్నం, డిసెంబర్ 18 : మండల కేంద్రమైన కొత్తపట్నం తహశీల్దార్ కార్యాలయం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన శుక్రవారం జరిగింది.ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే ఒంగోలు నుండి కొత్తపట్నంకు వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రాజుపాలెం నుండి ఒంగోలుకు వెళుతున్న మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో కండెక్టర్‌కు, డ్రైవర్‌కు గాయాలు కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు వైద్యచికిత్స నిమిత్తం తరలించారు.