ఉన్నమాట

తిక్క జడ్జి ధిక్కారంపై ఇదేమి న్యాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలాక్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ రోజుకి పని ముగించి లేవబోతూండగా ఒక న్యాయవాది ముందుకొచ్చి-
‘‘జైలుశిక్ష విధించబడ్డ జస్టిస్ కర్ణన్ ఆ ఉత్తర్వును రికాల్ చెయ్యాలని కోరుతున్నారండి’’ అన్నాడు.
‘‘ఎవరు నువ్వు’’ అని అడిగారు భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహర్‌గారు.
‘‘నేను ఆయన తరఫు లాయరునండి. ఆయన సంతకం చేసిన వకాలత్‌నామా, పిటీషను ఇవిగోనండి’’ అని అడ్వొకేటు చూపించాడు.
కర్ణన్ కేసును విచారించిన ధర్మాసనానికి అగ్రాసనాధిపతీ ఖేహర్‌గారే. కాని ఆ బెంచి వేరు. ఈ బెంచి వేరు. ఏ బెంచికి చెప్పుకోవలసింది ఆ బెంచికే చెప్పాలి. ఆమాటే అన్నారు ప్రధాన న్యాయమూర్తిగారు.
‘‘నిజమేనండి. తీర్పును సవాలు చేయదలిస్తే రాజ్యాంగం 32వ అధికరణం కింద రిట్ వేయాల్సిందేనండి. కాని అడ్వొకేట్ ఆన్ రికార్డుగా నమోదు అయిన న్యాయవాది నుంచి వస్తేనే సుప్రీంకోర్టు రిజిస్ట్రీవారు ఏ రిట్‌నైనా తీసుకుంటారండి. కాని అలాంటి అడ్వొకేటు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇందులో వేలు పెట్టటానికి ఇష్టపడలేదండి. మీరంటే అందరూ భయపడుతున్నారు మైలార్డ్!’’ అని వినయంగా విన్నవించాడు న్యాయవాది.
చీఫ్ జస్టిస్ తన పక్కనే ఉన్న జస్టిస్ కురియన్ జోసెఫ్‌తో (ఆయన కూడా కర్ణన్ కేసు బెంచిలో మెంబరే) కాసేపు మాట్లాడి, చివరికి-
‘‘మీరు మెన్షన్ చేశారు. మేము చూస్తాం’’ అని లాయరుకు చెప్పి బెంచి దిగిపోయారు.
నిన్న పత్రికల్లో ఈ వైనాన్ని చదివిన కొద్ది బుద్ధి సామాన్యులకు కొన్ని సందేహాలు వద్దన్నా వస్తాయి.
హైకోర్టు జడ్జి అంతటి వాడికి సుప్రీంకోర్టు కనీవినీ ఎరుగని విధంగా జైలుశిక్ష వేయడమేమిటి? ఆ ఉత్తర్వులు సవాలుచేస్తూ మళ్లీ సుప్రీంకోర్టులో రిట్ వేయడానికి గుర్తింపు పొందిన ఏ అడ్వొకేటూ భయం కొద్దీ ముందుకు రాకపోవడమేమిటి? ఆ సంగతి నేరుగా చీఫ్ జస్టిస్‌కే చెబితే ఆయనగారు ‘‘సరే! మెన్షన్ చేశారుగా! చూస్తాములెమ్మ’’ని వేరే బెంచిలో కూచుని చెప్పడమేమిటి?
చిత్రమైన కర్ణన్ కేసులో అన్నీ చిత్రవిచిత్రాలే!
హైకోర్టు న్యాయమూర్తిగా ఏళ్లతరబడి లోకులకు న్యాయ నిర్ణయం చేస్తూ వచ్చిన పెద్ద మనిషికి కనీసం తాను కూచున్న కుర్చీకి తగ్గట్టు హుందాగా మెలగాలన్న ఇంగితజ్ఞానం ఉండదు. తనదానికంటే పెద్దకోర్టు ఆదేశాన్ని మన్నించి, న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని గౌరవించాలన్న వివేకమే చూపడు. సర్వోన్నత న్యాయస్థానం తనను విచారణకు పిలిచినా పోడు. పైగా మీరే వచ్చి నా ఎదుట హాజరు కావలసిందని సుప్రీంకోర్టు పెద్ద బెంచి న్యాయమూర్తులకే ఎదురు తాఖీదులు పంపుతాడు. వాళ్లు దేశం విడిచి పారిపోకుండా చూడమని సంబంధిత అధికారులకు తెంపరి ఆర్డరు వేస్తాడు. అతడి మతి సరిగా ఉన్నదో లేదో పరీక్ష చేయించమని పై కోర్టు ఉత్తర్వు చేస్తే... భారత ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిల మానసిక స్థితిని సైకియాట్రిక్ వార్డుకు తీసుకెళ్లి పరీక్ష చేయించమని ఇంట్లో కూచుని వెర్రి ఆజ్ఞలు జారీచేస్తాడు. తన ముందు చేతులు కట్టుకుని నిలబడి, తప్పు ఒప్పుకోని నేరానికి చీఫ్ జస్టిస్ సహా ఏడుగురు జడ్జిలకూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్షనూ, తలకు లక్ష రూపాయల ఫైనునూ ఎస్.సి., ఎస్.టి. అత్యాచారాల నిరోధక చట్టం కింద తలచిందే తడవుగా అనుగ్రహిస్తాడు! ఫిర్యాదీ తానే; ప్రాసిక్యూటరూ తానే; తీర్పరీ తానే. కర్ణన్ చేసేదే న్యాయం. అతడు వాగేదే తీర్పు!
సందేహం లేదు. ఇది మామూలు ధిక్కారం కాదు. క్షమించరాని దురహంకారం. దేశంలోకెల్లా ఉన్నతమైన, సర్వులకూ శిరోధార్యమైన సుప్రీంకోర్టును తూష్ణీకరించే వదరుబోతు ఎవరైనా, ఎంతటివాడైనా శిక్షార్హుడే!
కాని - ఆ శిక్ష వేయడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా? నిర్దిష్ట విధి విధానాలనూ, రాజ్యాంగపరమైన కట్టుబాట్లనూ, సహజ న్యాయ సూత్రాలనూ నిక్కచ్చిగా పాటించాలి కదా? న్యాయచరిత్రలో మునె్నన్నడూ లేని, ఎవరూ కలనైనా ఊహించని అసాధారణ సమస్య ఉత్పన్నమైనప్పుడు దాన్ని పరిష్కరించే తరహా కూడా ఎవరూ వంకపెట్టలేనంత నిర్దుష్టంగా, భవిష్య కాలానికి ఆదర్శప్రాయంగా ఉండాలి కదా?
కర్ణన్ అనేవాడు శిశుపాలుడి తమ్ముడు. అతడి తప్పుల చిట్టా పెద్దది. మద్రాసు హైకోర్టులో జడ్జి అరుూ్యకాగానే అక్కడి చీఫ్ జస్టిస్‌ను నానా మాటలు అన్నాడు. తనను కాలితో తాకి అవమానించాడని ఇంకో జడ్జి మీద మీడియా పంచాయతి పెట్టాడు. తాను దళిత కులంలో పుట్టటాన్ని కవచంగా మార్చుకుని, తోటి న్యాయమూర్తుల మీద చీటికీ మాటికీ ఎస్.సి., ఎస్.టి. అత్యాచారాల చట్టాన్ని ఝళిపించి అడ్డగోలుగా వ్యవహరించాడు. న్యూసెన్సును భరించలేక తనను కోలకతా హైకోర్టుకు బదిలీ చేస్తే, సుప్రీంకోర్టు జడ్జిల మీదే ‘అట్రాసిటీ’ చట్టం ఆయుధాన్ని ప్రయోగించాడు.
కాని జస్టిస్ కర్ణన్ మీద సుప్రీంకోర్టు ధిక్కారం కత్తి ఎత్తింది పుట్టెడు పాత తప్పులను పురస్కరించుకుని కాదు. అతడి మీద పెద్ద కోర్టు ఆగ్రహానికి ముఖ్య కారణం సుప్రీంకోర్టు జడ్జిలు సహా 20 మంది ఉన్నత న్యాయమూర్తుల మీద అవినీతి నింద మోపుతూ భారత రాష్టప్రతికి, ప్రధానమంత్రికీ జస్టిస్ కర్ణన్ ఫిర్యాదు చేయటం!
హైకోర్టు జడ్జిల అవినీతి గురించి ఒక హైకోర్టు జడ్జి ప్రధానమంత్రికి పితూరి చేయటం విడ్డూరమే. మాన్య న్యాయమూర్తుల మీద అవినీతి బురద చల్లి కసితీరా భ్రష్టుపట్టించటమే ఇందులోని ఆంతర్యమన్నది స్పష్టం. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను నడిపించే ప్రధానమంత్రిని ఆశ్రయంచి న్యాయవ్యవస్థలోని అవినీతి గురించి న్యాయమూర్తి యాగీ చేయటం ‘‘సుప్రీం’’ న్యాయాధీశులకు ఒళ్లు మండించటం అర్థం చేసుకోదగ్గదే. అంత మాత్రాన దాన్ని కోర్టు ధిక్కార మహాపరాధంగా పరిగణించి, వేరెవరూ కోరకుండానే సుప్రీంకోర్టు తనకు తానుగా విచారణ మొదలెట్టి న్యాయమూర్తి దుంప తెంచటం ఎంతవరకు సమంజసం?
జడ్జి లేనిదే కోర్టు లేదు. కాని కోర్టు అంటే జడ్జి కాదు. ఒక న్యాయమూర్తి అవినీతిపరుడు అని ఆరోపిస్తే న్యాయస్థానాన్ని అవమానించినట్టు కాదు. భారత రాజ్యాంగానికి ప్రతి రూపమైన రాష్టప్రతికీ... అవినీతిపరులైన న్యాయమూర్తులను పట్టుకుని, ప్రాసిక్యూట్ చేసేందుకు అధికారంగల ప్రభుత్వ అధినేతకు ఫిర్యాదు చేయటం మహానేరం ఎలా అవుతుందో మందబుద్ధులకు బోధపడదు.
ఉన్నత న్యాయవ్యవస్థలో అవినీతి మకిలి గురించి ఆరోపణ రావటం ఇదే మొదటిసారి కాదు. అప్పటి వరకు భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16 మందిలో 8 మంది అవినీతిపరులని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ 2010లో ప్రకటించి, చేతనైతే తనను కోర్టు ధిక్కారం కింద శిక్షించమని సవాలు చేశాడు. ఉన్నత న్యాయవ్యవస్థ న్యాయమూర్తుల్లో సగంమంది లంచగొండులని సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ మార్కండేయ కట్జూ రెండేళ్ల కింద కుండబద్దలు కొట్టాడు. అయినా కిమ్మనని సుప్రీంకోర్టు ఇప్పుడు కర్ణన్ మీద మూడో కన్ను తెరిచేందేమిటి?
కోర్టు ధిక్కార నేరం కింద ఎవరినైనా శిక్షించేందుకు సుప్రీంకోర్టుకుగల అధికారాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. కాని ‘్య ళ్యఖూఆ ఒ్ద్ఘ జౄఔ్యఒళ ఘ ఒళశఆళశషళ ఖశజూళూ ఆ్దజఒ షఆ చ్యి ఘ ష్యశఆళౄఔఆ యచి ష్యఖూఆ ఖశళఒఒ జఆ జఒ ఒ్ఘఆజఒచిజళజూ ఆ్ద్ఘఆ ఆ్దళ ష్యశఆళౄఔఆ జఒ యచి ఒఖష్ద ఘ శ్ఘఆఖూళ ఆ్ద్ఘఆ జఆ ఒఖఇఒఆ్ఘశఆజ్ఘక జశఆళూచిళూళఒ యూ ఆళశజూఒ ఒఖఇఒఆ్ఘశఆజ్ఘక ఆ్య జశఆళూచిళూళ తీజఆ్ద ఆ్దళ జూఖళ ష్యఖూఒళ యచి ఖఒఆజషళ‘ (న్యాయ ప్రక్రియ క్రమానికి గణనీయంగా అవరోధం కలిగించేదిగా ఉన్నదని సంతృప్తి చెందితే గానీ ఏ న్యాయస్థానమూ ఈ చట్టం కింద శిక్ష విధించరాదు) అని కోర్టు ధిక్కార చట్టం 13వ సెక్షను నిర్దేశిస్తున్నది. కర్ణన్ చేసిన పని న్యాయ ప్రక్రియ క్రమానికి భంగకరమని సుప్రీంకోర్టు సంతృప్తి చెందిందా?
హైకోర్టు మీద సుప్రీంకోర్టు పై కోర్టే అయినా సుప్రీంకోర్టుకు హైకోర్టు సబార్డినేటు కాదు. హైకోర్టు న్యాయమూర్తులను శిక్షించే అధికారాన్ని భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఇవ్వలేదు. హైకోర్టు జడ్జినైనా, సుప్రీంకోర్టు జడ్జినైనా తొలగించి తీరాల్సివస్తే ఆ పని పార్లమెంటు ఉభయసభలు, మూడింట రెండువంతుల మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన తరవాతే జరగాలని రాజ్యాంగం 124వ అధికరణం చెబుతుంది. పాపాల భైరవుడు కర్ణన్‌ని వదిలించుకోవటం మేలని సుప్రీంకోర్టు తలిస్తే జస్టిస్ సౌమిత్ర సేన్ కేసులో చేసినట్టుగా అంతర్గత విచారణ జరిపించి, అభిశంసన సిఫారసును పార్లమెంటుకు పంపించి ఉండవచ్చుగదా?
హైకోర్టులో ఏ న్యాయమూర్తికి ఏ పని కేటాయించేదీ, ఏ పనిని లాగేసేదీ ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికార పరిధిలోకి వచ్చే అంశం. పిచ్చిగా ప్రవర్తిస్తున్న కర్ణన్‌ను న్యాయపరమైన, పాలనాపరమైన బాధ్యతల నుంచి తప్పించటం మేలని సుప్రీంకోర్టు వారు తలిస్తే ఆ పనేదో కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారానే చేయించి ఉండవచ్చు. అలా కాకుండా, అతడి బాధ్యతలను, అధికారాలనూ నేరుగా సుప్రీంకోర్టే లాగివేయటం రాజ్యాంగ విహితమేనా?
ఆ మీమాంసను పక్కనపెడితే న్యాయ, పరిపాలన బాధ్యతలన్నిటి నుంచి తప్పించి, అతడు వేసే ఆర్డర్లను లక్ష్య పెట్టరాదని అధికారగణాన్ని సర్వోన్నత న్యాయస్థానమే ఆదేశించిన తరవాత జస్టిస్ కర్ణన్ కోరలు పీకిన పాముతో సమానం. తన ఇంట్లో కూచుని, అదే కోర్టు అని భ్రమించి, సుప్రీంకోర్టు జడ్జిలకు, భారత ప్రధాన న్యాయమూర్తికి పిచ్చి పరీక్షలు, జైలు శిక్షలు, జరిమానా విధింపులు అంటూ అతడు చేసిన ప్రేలాపనలను, వేసిన ఆర్డర్లను ఖాతరు చేసే వాడు లేడు. మతి స్థిమితం లేని వాడిని చూసి జాలిపడాలే తప్ప మండిపడకూడదు. అలాంటి వాడిని పంపించవలసింది మానసిక వైద్యశాలకే తప్ప కారాగారానికి కాదు. ఒళ్లెరుగని తిమ్మిరిలో అతడు చేసిన పిచ్చిచేష్టలకు రెచ్చిపోవటం సర్వోన్నత న్యాయస్థానం ఔన్నత్యానికి వనె్న తెచ్చేది కాదు. ఇంకో నెలలో ఎలాగూ రిటైర్ కానున్న వాడిని మిగిలిన ఆ కొద్దిరోజులూ ఇంటి పట్టునే చేతులు కట్టేసి కూచోబెట్టటం వల్ల కొంపలు మునిగేది బహుశా ఏమీ ఉండదు.
పోనీ - ధిక్కారమును సైతుమా అని పట్టుబట్టి కర్ణన్‌ని కటకటాల వెనక్కి నెట్టాలనే అనుకుంటే దానికీ ఒక విధాన క్రమం ఉంటుంది కదా? నిందితుడు ఎంత హైకోర్టు జడ్జి అయినా... కోర్టు ధిక్కారం అనే ఒక మామూలు కేసును విచారించడానికి ఏకంగా ఏడుగురు జడ్జిలతో పెద్ద రాజ్యాంగ ధర్మాసనాన్ని వేయవలసిన అత్యవసరం ఏమిటి? ప్రభుత్వ దుర్వినియోగం నుంచి పౌరులకు రక్షణ అపేక్షించే అతి ముఖ్యమైన ఆధార్ కేసులోనే రాజ్యాంగ ధర్మాసనాన్ని వేయటానికి జడ్జిలు అందుబాటులో లేరని చెప్పారు కదా? కర్ణన్‌కు శాస్తి చేయటానికి మాత్రం ఏడుగురు జడ్జిలు హుటాహుటిన కావలసి వచ్చారా?
నేర నిర్ధారణ అయ్యాక శిక్ష పరిమాణాన్ని ప్రకటించే ముందు దానిపై మొరపెట్టుకునే అవకాశాన్ని నేరస్థుడికి ఇవ్వటం న్యాయ సంప్రదాయం కదా? ఆపాటి ఆస్కారాన్నీ కర్ణన్‌కి ఇవ్వలేదేమిటి? పైగా కర్ణన్ చెప్పేదేదీ ప్రకటించరాదని మీడియా నోళ్లు కట్టేయటమేమిటి? కోర్టు ధిక్కారం కేసుకూ, మీడియాకూ సంబంధమేమిటి? తమ వాదాన్ని వినిపించేందుకు మీడియా వారికి కనీసం అవకాశం ఇవ్వకుండానే, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా, ప్రచార సాధనాలపై ముందస్తు ఆంక్ష విధించటం సబబేనా?
కర్ణన్ కథ ఏ కంచికి చేరుతుంది? తిక్క కర్ణన్ ఏమయ్యాడు? జైలును తప్పించుకోవటానికి ఎక్కడ దాక్కున్నాడు? చేతులారా తెచ్చుకున్న సంకటం నుంచి ఎలా బయటపడగలడు? అన్నవి కాలం తేల్చాల్సిన ప్రశ్నలు. న్యాయ వ్యవస్థ సమాధానం చెప్పాల్సిందల్లా ఒక్కటే:
మున్సిఫ్ మేజిస్ట్రేటుగా కూడా పనికిరాని కర్ణన్ ఏకంగా హైకోర్టు జడ్జి ఎలా అయ్యాడు? అన్నాడిఎంకె పార్టీకి పోలింగు బూత్ ఏజంటుగా పనిచేసిన ఘనుడిని ఉన్నత న్యాయమూర్తి పోస్టుకు ఎవరు సిఫారసు చేశారు? ఎవరు ఓకే చేశారు? న్యాయమూర్తుల ఎంపికలో ప్రభుత్వానికి చోటు పెడితే కొంపలు మునుగుతాయని చెబుతూ, పార్లమెంటు చట్టాన్ని కొట్టి పారేసిన సందర్భాన సుప్రీంకోర్టు వారు ఏమన్నారు? ప్రస్తుత కొలీజియం విధానంలో తప్పుందనటానికి ఒక్క ఉదాహరణ చూపగలరా అని అటార్నీ జనరల్‌ని ధర్మాసనం సవాలు చేసింది కదా?
ఒక్క కర్ణన్ ఉదాహరణ చాలదా?!

ఎం.వి.ఆర్.శాస్ర్తీ