Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
సెనక్కాయ: (తనలో) దొంతూ దొందేలే ! సెనక్కాయలండీ సెనక్కాయలు.
ఏ.వి: నవ్వితే నవ్వాడులే! ఎప్పటికైనా నవ్విన నాపచేను పండదా. ఏంటీ!
జయ: సరేలే! అటుచూడు! ఆ యువకుడి దగ్గరకొచ్చిన ఆ అమ్మాయిని చూడు. మోడరన్ డ్రస్సులో మిలమిలా మెరిసిపోతుంది. అతను ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని ఆ బెంచీపైన కూర్చోబెట్టి భుజాలపైన చేతులు వేసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఏమేమో గుసగుసలాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎలా ఉందంటావ్ .
ఏ.వి.: మీరు ప్రేమికుల్లా ఉన్నారు.
జయ: ఈ ప్రేమికుల దినోత్సవం నాడు మీకు మా శుభాకాంక్షలు. ఇదుగో బొకే. తీసుకోండి.
హీరో: మీరు మాకు పరిచితులు కాదుకదా. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు.
ఏ.వి.: ఈ వాలంటయిన్స్ డే రోజునే మేమో ప్రేమికుల కథా చిత్రం తీయాలని ఇక్కడ కూర్చొని ప్లాన్ చేసుకుంటున్నాము. అనుకోకుండా మీరు ఇక్కడకు వచ్చారు. మీకభ్యంతరం లేకపోతే. మేము తీయబోయే చిత్రంలో మిమ్మల్నే హీరో,హీరోయిన్‌లుగా పరిచయం చేయాలనుకుంటున్నాం. మీరు మాకు నచ్చారు అందుకే శుభాకాంక్షలతో ఈ బొకే ఇచ్చి పరిచయం చేసుకుంటున్నాం.
హీరోయిన్: నాకో సెంటిమెంట్ ఉంది. ఎవరన్నా గ్రీట్ చేస్తూ ఇస్తే స్వీకరిస్తాను. ఎవరన్నా చీట్ చేయాలని చూస్తే చంపఛళ్ళు మనిపిస్తాను. మిమ్మల్ని కాదు ఈ రోజుల్ని బట్టి డైలాగ్‌లు ఇలాగే వస్తయ్.
హీరో: నాక్కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడే మా వివాహ నిర్ణయ విషయంలో మా పెద్దల అంగీకారం తెలిసింది. ఈ శుభ సందర్భంలో మీరు ఇస్తున్నారు కనుక మీ ఆశీర్వాదంగా భావించి స్వీకరిస్తున్నాను.
జయ : చాలా సంతోషం. ఇదుగో ! ఇద్దరూ కలిసి తీసుకోండి.
హీరోహీరోయిన్స్: చాలా థాంక్స్! బొకే బాగుంది. ఈరోజే మాకు మీరివ్వడం చాలా ఆనందంగా ఉంది.
*
(ఇంకా ఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.