అనంతపురం

28, 29వ తేదీల్లో రాష్టప్రతి, సిఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 22: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఈ నెల 28 లేదా 29వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం ఉందని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. మంగళవారం పర్యటనకు సంబందించిన ఏర్పాట్లుపై నగర మేయర్ మదమంచి స్వరూప, జెసి-1 లక్ష్మికాంతం, జెసి-2 సయ్యద్ ఖాజామొహీద్దీన్‌లతో కలసి స్థల పరిశీలన చేశారు. నగరంలోని రామ్‌నగర్‌లోని 80 అడుగల రోడ్డు, శ్రీనగర్ కాలనీ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో గల ప్రభుత్వ స్థలంలో ప్రముఖల పర్యటన ఏర్పాట్లును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరవు నివారణకు సంబందించి వివిధ శాఖలు, ఇంజినీరింగ్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులచే ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. నీరు-ప్రగతి పైలాన్ ప్రారంభం, దానికి సమీపంలోనే బహిరంగ సభను ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లును చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ సిఈ జలంధర్, హంద్రీ నీవా ఎస్‌ఈ సుధాకర్, జెడ్పి సిఇఓ రామచంద్ర, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలు నాగభూషణం, వెంకటేశ్వర్లు, ఆర్‌డిఓ హుస్సెన్‌సాబ్, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, తదితర అధికారులు పాల్గొన్నారు.
యజ్ఞంలా ఫారంపాండ్ల నిర్మాణం
* కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం , డిసెంబర్ 22: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న లక్ష ఫారంపాండ్ల లక్ష్య సాధన ఒక యజ్ఞంలా సాగాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎంపిడిఓలు, ఎపిఓలు, డ్వామా ఎపిడిలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో ఫారంపాండ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనుల కల్పన, సిసి రోడ్ల నిర్మాణంపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారంపాండ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు, మనం కూడా మాట ఇచ్చాం, ఉపాధి పండుగ, పంట సంజీవని సాధించాలన్నారు. లక్ష ఫారంపాండ్ల నిర్మాణం విషయాన్ని ముఖ్యమంత్రి రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు ఆహ్వానించారన్నారు. ఇందులో ఎక్కడా వైఫల్యముండరాదని, సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుని ముందడుగు వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి రోజు 2 లక్షల మంది కూలీలు పనిచేస్తేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. ప్రస్తుతం వేరుశెనగ పంట సాగు పూర్తయిందని, వరి కూడా 50శాతం పూర్తయిందన్నారు. ప్రస్తుతం 90 వేల కూలీలు పనిచేస్తున్నారన్నారు. ఈ సంఖ్య 2 లక్షలకు పెరిగేలా ఎంపిడిఓలు చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి నుండి మార్చి వరకు పంటలుండవని, కూలీలకు ఉపాధి కల్పించేందుకు మంచి అవకాశమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 30 వేల గ్రూపులు పనిచేస్తున్నాయని, ఒక్కో గ్రూపు మూడు ఫారంపాండ్లు చొప్పున తవ్వితే సులభంగా లక్షకు చేరుకోవచ్చన్నారు. గురువారం నుండి ఫారంపాండ్ల నిర్మాణం ఎంత పురోగతి జరిగిందన్న అంశంపై ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, జడ్పీ సిఇఓ రామచంద్ర, డ్వామా పిడి నాగభూషణం, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ రవికుమార్, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ కాంతానాథ్, డిపిఓ జగదీశ్వరమ్మ పాల్గొన్నారు.