విజయనగరం

వట్టిగెడ్డపై వంతెన నిర్మాణ పనులకు మంత్రి మృణాళిని శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, ఆగస్టు 29: మండలంలో గురువునాయుడుపేట-పాంచాళి మద్యలో గల వట్టిగెడ్డపై 5 కోట్ల 46 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని సోమవారం శంకుస్థాపన చేశారు. ముందుగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ వంతెన నిర్మాణంతోపాటు గవిరమ్మపేట సమీపాన పోతులగెడ్డ వంతెనకు 3 కోట్ల రూపాయలు, సాలూరు మండలం తాడివలస వంతెనకు రూ.50 లక్షలు, గంగన్నదొర వంతెనకు రూ.75 లక్షలు మంజూరైందని తెలిపారు. ఈ వంతెన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తిచేయాలని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఆదేశించారు.
మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం
మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి మృణాళిని అన్నారు. మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 87 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని, ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీలో భాగంగా 25 కోట్ల రూపాయలను రెండు విడతలుగా పెట్టుబడి నిధి కింద జమ చేశారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, నియోజకవర్గం పరిధిలో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మంత్రి మృణాళిని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం ద్వారా ప్రతీ గ్రామంలో సిమెంట్‌రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనని, పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి బృహత్తర పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గిరిజనులు చైతన్యవంతులై పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా 300 గిరిజన కుటుంబాలకు పెరటికోళ్లను వెలుగు ఆధ్వర్యంలో పంపిణీ చేయగా వ్యవసాయశాఖ ఆయిల్ ఇంజన్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్‌అండ్‌బి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో మహిళా సంఘ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి.్భంజ్‌దేవ్, సాలూరు మున్సిపల్ చైర్మన్ విజయకుమారి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు, గురువునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ కొరిపల్లి సురేష్, సర్పంచ్‌లు ముడారపు కొత్తమ్మ, పోలితల్లి, వెలుగు ఎపిడి మురళి పాల్గొన్నారు.