విజయనగరం

వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 29: వర్షాభావంతో జిల్లాలో వ్యవసాయ పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల విషయంలో మండల స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా చూడాలని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతోపాటు ఎంపిడిఓలు, మండల స్థాయి అధికారులతో సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలో ఒక రోజు అన్ని శాఖల అధికారులు ఒక బృందంగా ఏర్పడి గ్రామాలలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను, వసతి గృహాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, పరిసరాల పరిస్థితి, పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ ప్రాంతాలలో వైద్య బృందాలతో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అన్ని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ జరపాలన్నారు.
స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ విజయనగరంలో భాగంగా జిల్లాలోని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు శ్రద్ధ తీసుకోవాలని, ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ తెలిపారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో శ్రద్ధ చూపిన సర్పంచ్‌లను, అధికారులను సన్మానిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో పూర్తిచేసిన పనులకు వెంటనే డబ్బులు చెల్లించాలని, అన్ని పనులను జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సిసి రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, తుపాను షెల్టర్ల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ జలసిరిలో చేపడుతున్న బోరుబావుల నిర్మాణాలను వేగవంతం చేయాలని, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, అదనపు జెసి నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ రాజకుమారి, డిఆర్‌డిఎ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు ఢిల్లీరావు, ప్రశాంతి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల ఎస్‌ఇలు పాల్గొన్నారు.

డయేరియా రోగులకు
వెంటనే వైద్యసేవలు అందించాలి
* ఎమ్మెల్యే మీసాల గీత ఆదేశం
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 29: డయేరియా రోగులకు సత్వర వైద్యసేవలు అందించడమే కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని ఎమ్మెల్యే మీసాల గీత ఆదేశించారు. మండలంలోని చెల్లూరులో డయేరియా వ్యాధి లక్షణాలున్న రోగులు ఉన్నట్లు తెలుసుకున్న ఆమె సోమవారం హుటాహుటిన ఆ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఆమె తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం, కాలువల్లో పూడిక పేరుకుపోవడం పట్ల పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మీరేమి చేస్తున్నారంటూ వైద్యసిబ్బందిపై మండిపడ్డారు. గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచాలనే ప్రభుత్వ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదంటూ నిలదీశారు. కాలువల్లో పూడిక వెంటనే తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆమె ఆదేశించారు. గ్రామస్థులు పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకునేలా చూడాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వెంటనే తనకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జెడ్పీటిసి తుంపల్లి రమణ పాల్గొన్నారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు
* ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పన్న
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 29: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి ఆదాయం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న ఆదేశించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిపోమేనేజర్లతో సోమవారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్న మాట్లాడుతూ ప్రయాణికుల ఆదరణపైనే ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉందన్నారు. అందువల్ల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడపాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే అదనపుబస్సులను నడపాలని చెప్పారు. ముఖ్యంగా రానున్న రెండునెలల ఆర్టీసీకి శ్లాక్ సీజన్ అయినందున ఖర్చులను నియంత్రించుకోవాలని, పొదుపుచర్యలు చేపట్టాలని తెలిపారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రీజియన్ పరిధిలో అన్ని డిపోలలోనూ నష్టాలను తగ్గించాలని, ఆక్యుపెన్సీరేషియో పెంచాలని ఆదేశించారు. అన్ని బస్‌స్టేషన్‌ల్లో ప్రయాణికులకు కావల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు.
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మూడు కోట్ల రూపాయల మేరకు అదనంగా ఆదాయం వచ్చిందని అప్పన్న చెప్పారు. ఈ సమావేశంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్లు ఎన్‌విఆర్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు, డిపోమేనేజర్లు కె.పద్మావతి(విజయనగరం), ఎన్‌విఎస్ వేణుగోపాల్(ఎస్.కోట), శివకుమార్ (సాలూరు), బివిఎస్ నాయుడు(పార్వతీపురం, ఢిల్లేశ్వరరావు(శ్రీకాకుళం డిపో-1), అరుణకుమారి(శ్రీకాకుళం డిపో-2), ధీరజ్(పాలకొండ), సిమ్మన్న(పలాస), ముకుందరావు(టెక్కలి), ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి సన్యాసిరావు, కమర్షియల్ మేనేజర్ కె.రమేష్, అసిస్టెంట్ మేనేజర్ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తెలుగుభాష మధురమైనది
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 29: తెలుగుభాష మధురమైనదని కస్పా మున్సిపల్ హైస్కూల్ ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు వై.అప్పలనాయుడు తెలిపారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా కస్పాహైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పి.జనార్దనరావుఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాతృభాషను నిర్లక్ష్యం చేసినట్లయితే కన్నతల్లిని నిర్లక్ష్యం చేసినట్లేనని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మాతృభాషపై మమకారం పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యవహారిక భాషకు గిడుగు రామమూర్తిపంతులు వనె్న తెచ్చారని, వ్యవహారిక భాష పితామహుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు ఎబి సుబ్బారావును ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత సుబ్బారావుమాట్లాడుతూ మాతృభాషను మరువరాదని చెప్పారు. పరభాష వ్యామోహంలో పడి తెలుగుభాషకు చాలామంది దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుభాషను మరచిపోయినట్లయితే మన సమాజాన్ని మరిచిపోయినట్లేనని అన్నారు.

బినామీలపై చర్యలు తీసుకోవాలి
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 29: జిల్లాలో శృంగవరపుకోట మేజరు పంచాయతీ దుకాణ సముదాయంలో బినామీల వ్యవహారం నడుస్తోందని, ఈ బినామీలో కొంతమంది పెద్దలు ఉన్నారని, తక్షణమే బినామీలపై చర్యలు తీసుకోవాలని ఆమ్‌ఆద్మీపార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి దయానంద్ మాట్లాడుతూ దుకాణ సముదాయంలో బినామీల వల్ల పంచాయతీ ఆదాయానికి గండిపడుతోందని అన్నారు. పంచాయతీలో జరుగుతున్న బినామీలపై గత కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము చేసిన ఫిర్యాదుపై స్పందించి డిపిఓ ద్వారా విచారణ చేయించారని, ఈ విచారణలో కొంతమంది బినామీలు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. అందువల్ల బినామీలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బినామీలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని అన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పార్టీ జిల్లా కో-కన్వీనర్ పూసపాటి ప్రతాప్‌వర్మ, సిటీ కన్వీనర్ శీర స్వామినాయుడు పాల్గొన్నారు.