విజయనగరం

అమ్మభాష తెలుగును మరచిపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 29: ఇతర భాషలపై మక్కువ చూపుతున్న నేటితరం అమ్మభాష తెలుగును మరచిపోకూడదని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. యూరప్ దేశాలలో ఆయా ప్రాంతాల వారు స్థానిక భాషలోనే మాట్లాడతారని, ఇదే ఒరవడిని మనదేశంలో అవలంభిస్తే స్థానిక భాషలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. తెలుగుభాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి 153వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలుగుభాష దినోత్సవాన్ని నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన గిడుగు రామ్మూర్తి గిరిజన సవర భాషను అభివృద్ధి చేసిన వ్యక్తిగా కొనియాడారు. ప్రతి భాషకు వ్యాకరణం ఉన్నట్లుగానే కొండకోనల్లో నివసించే గిరిజనుల లిపికి, సవర భాషకు కూడా ఒక వ్యాకరణాన్ని తయారు చేయడం గిడుగురామ్మూర్తి గొప్పతనమని ప్రశంసించారు. పిల్లలు చదువుకునే భాష కఠినంగా ఉందనే అభిప్రాయంతో గ్రాంధిక భాషకు వ్యతిరేకంగా గిడుగురామ్మూర్తి గురజాడతో కలసి ఉద్యమం నిర్వహించారని, దీని కారణంగానే వ్యవహారిక భాష సరళతరమైందని చెప్పారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగుభాష మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ మాట్లాడుతూ ఇతర భాషలతో పోలిస్తే తెలుగు భాష మధురమైనదని, సులభతరమైందని అన్నారు. మన భాష మధురం, ఇతర భాషలు అదనం అనే వైఖరితో మాతృభాష గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పారు. సాంప్రదాయ విధానాలకు ఎదురు నిలిచి వ్యవహారిక భాషకు రూపురేఖలు దిద్దిన గొప్ప వ్యక్తిగా గిడుగు రామ్మూర్తిని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.