విజయనగరం

అంటువ్యాధుల నిర్మూలనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, సెప్టెంబర్ 22: పురపాలకసంఘంలో డెంగ్యూ, ఫీవర్ వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పురపాలకసంఘం చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. డెంగ్యూవ్యాధి నివారణ, వ్యాప్తికి సంబంధించిన కరపత్రాలను స్థానిక పురపాలకసంఘ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ఎటువంటి వ్యాధులు వ్యాప్తిచెందకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానంగా డెంగ్యూవ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వీటి నిర్మూళనకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ వ్యాధులు సక్రమింపజేసే దోమల నివారణకుపటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ఎవరికి ఎటువంటి వ్యాధులు వచ్చినా వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని లేనిపక్షంలో ప్రాణాలకు ప్రమాదమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శంకరరావు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణపొందే సూచనలు, సలహాలను తప్పనిసరిగా ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రచార సాధనాలు, కరపత్రాల ద్వారా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలని, వ్యాధి నిర్మూళనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్‌చోడిగంజి రమేష్‌నాయుడు, ఎఎంసి చైర్మన్ పువ్వల శ్రీనివాసరావుతోపాటు శానటరీ ఇన్‌స్పెక్టర్లు భాస్కరరావు, డిఇ బెహరా, వార్డు కౌన్సిలర్ అంకులు పాల్గొన్నారు.