విజయనగరం

ఉపాధ్యాయ సమస్యలపై కలెక్టర్ జోక్యానికి డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 22: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు కె. విజయగౌరి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా విద్యారంగ పరిస్థితిలో మార్పులేదని, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విజయనగరం పట్టణ పరిధిలోగల గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ఎ 20శాతం ఇవ్వాలని బొబ్బిలి, పార్వతీపురం పరిధిలో ఉపాధ్యాయులకు 14.5శాతం హెచ్‌ఆర్‌ఎ అమలు చేయాలని కోరారు. డేటా ఆన్‌లైన్ పనుల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లులను కాలయాపన లేకుండా మంజూరు చేయాలని కోరారు. జెడ్పీ ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నెలవారీ ప్రమోషన్లు ఇవ్వాలని, తెలుగు, హిందీ పండిట్ల పదోన్నతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. పిఎఫ్, ఎపిజిఎల్‌ఐ ఖాతాలను అప్‌డేట్ చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, కె.శేషగిరి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణం స్పందించాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణారావు, రాష్ట్ర కార్యదర్శి డి.రాము, జిల్లా గౌరవాధ్యక్షులు శివవర్మ, సహ అధ్యక్షులు మురళీ మోహనరావు, జి. నిర్మాల, వెంకటరావు, శ్రీరాములు, మధు, అప్పలనాయుడు, శ్రీనివాస్, పార్వతి, ఈశ్వరరావు పాల్గొన్నారు.