విజయనగరం

మిద్దె ఇల్లు కూలీ భార్యభర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, సెప్టెంబర్ 25: వేపాడ పంచాయతీ శివారు బక్కునాయుడుపేటలో ఆదివారం వేకువ జామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో మిద్దె ఇల్లు కూలిపోయి భార్యభర్తలు మృతి చెందారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిగోడలు పూర్తిగా నానిపోవడంతో మిద్దె ఇల్లు ఆకస్మికంగా కూలిపోయింది. ఈ సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న కర్రి అప్పారావు(70), భార్య నాగరాజు(65) మృతి చెందారు. కూలిపోయిన సమయంలో ఉరుములు, మెరుపులతో బోరున వర్షం కురుస్తున్నందున చుట్టుపక్కల ఇళ్లవారు ఎవరు ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. నిరుపేదలైన ఈ దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారుడు, ఒక కుమార్తె మృతి చెందగా, మిగిలిన ముగ్గురు కుమార్తెలు అత్తవారి ఇళ్లలో ఉంటున్నారు. కుమారుడికి భార్య, పిల్లలు నర్సీపట్నంలో ఉంటున్నారు. అప్పారావు దంపతులు కష్టపడి వారికి వచ్చే పింఛన్ సొమ్ముతో పొట్టపోసుకునే వారని స్థానికులు తెలిపారు. ముందురోజు శనివారం కుమార్తెలు రామేశ్వరి, సత్యవతి వచ్చి తల్లిదండ్రులను పరామర్శించి స్నానపానాదులు చేయించి వెళ్లారని, తీరా ఇంతలోనే ఇంత ప్రమాదం జరిగిందని బోరున విలపించారు.
మృతులు కుటుంబాన్ని ఆదుకుంటాం
ఆదివారం బక్కునాయుడుపేటలో జరిగిన ప్రమాద సంఘటనను తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ప్రమాద విషయాలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు తెలయజేసి తగు సహాయం అందించగలమని హామీ ఇచ్చారు. అయితే పోస్టుమార్టం గ్రామంలోనే జరిగే విధంగా ప్రజల కోరిక మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మృతుల కుటుంబానికి రూ. 8 లక్షల
పరిహారం మంజూరు
* మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని
వేపాడ, సెప్టెంబర్ 25: మండలంలోని బక్కునాయుడుపేట గ్రామంలో మిద్దె ఇల్లు కూలిన ఘటనలో మృతి చెందిన కర్రి అప్పారావు, భార్య నాగరాజు కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఆదివారం పరామర్శించారు. సంఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎనిమిది లక్షల రూపాయల మేరకు పరిహారం అందించనున్నట్లు మంత్రి మృణాళిని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం గ్రామానికి వచ్చిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో కురిసిన వర్షాలకు ఇంటిగోడలు నాని కూలిపోవడంతో భార్యాభర్తలు ఏకకాలంలో మృతి చెందడం దారుణమని అన్నారు. మృతుల కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు జారీ చేసిన జీవో-15 ప్రకారం మరణించిన వ్యక్తికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులకు ఎనిమిది లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గుంటూరులో ఇటువంటి సంఘటన జరగ్గా, ఇది రెండవదని తెలిపారు. ఈ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఈ సంఘటనలో భార్యాభర్తలు చనిపోవడం, వారికి ఐదుగురు వారసులు ఉండడం కారణంగా రెండురోజుల్లో మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. అంత్యక్రియలకు పదివేలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, విజయనగరం ఆర్‌డి ఓ శ్రీనివాసమూర్తి, ఎంపిపి దాసరి లక్ష్మి, వైస్ ఎంపిపి శ్రీరాములు నాయుడు, తహశీల్దార్ వి.పద్మావతి, పోలీసు సిబ్బంది, ఎంపిపి దాసరి లక్ష్మి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.