విజయనగరం

ఆర్ధికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (పూల్‌బాగ్),సెప్టెంబర్ 25: దేశ ఆర్ధికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తుందని జెడ్పీచైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని యునైటెడ్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీ విద్యార్థులు ఆదివారం దక్షిణాది రాష్ట్రాల వంటకాలు, సంస్కృతి ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వాతిరాణి మాట్లాడుతూ ప్రభుత్వాలు పర్యాటక రంగ ం అభివృద్ధికి కృషి చేస్తే వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్ అనిల్‌కుమార్, వివికాశీ విశ్వనాధం విద్యార్థ్ధులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నెల్లిమర్ల, సెప్టెంబర్ 25: మండలంలో గుషిణి-వల్లాపురం మధ్యలో శనివారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో మహిళ మృతి చెందింది. వల్లాపురం నుంచి గుషిణివైపు వెళుతున్న ఆటోకి ఆవు ఎదురుగా రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న కడగల నారాయణమ్మ(44) రోడ్డుపై పడడంతో తలకి బలమైన గాయమైంది. విజయనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నెల్లిమర్ల పోసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమస్యలపై స్పందించండి
విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 25: పట్టణంలో విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్న పందులు, పిచ్చికుక్కలతో పడలేకపోతున్నామని వాటిని నిరోధించే చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ కోరారు. ఆదివారం కంటోనె్మంట్‌లోని 31వ వార్డులో కమిషనర్‌తో కలసి పర్యటించారు. సిబి కాలనీలో తిరుగాడుతున్న పందులు అపారిశుద్ధ్యాన్ని కమిషనర్‌కు చూపించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పట్టణంలో పందులు, పిచ్చికుక్కల స్వైర విహారం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అపారిశుద్ధ్యంతో దోమలు వెంటాడుతున్నాయని, సిబి కాలనీ దారిలో తవ్విన గోతుల్లో పడి ప్రజలు గాయాలు పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోతులు తవ్వి ఎందుకు పూడ్చరని ప్రశ్నించారు. రైతుబజారు, వుడా కాలనీ, బొబ్బాదిపేట, సాలిపేట ప్రాంతాలు మురికి కూపాలుగా తాండవిస్తున్నాయని కమిషనర్ దృష్టికి తెచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

‘్ధర్మయుద్ధ సభకు తరలిరండి’
విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 25: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి లోగిశ రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా మాలమహానాడు కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో తిరుపతిలో ఈనెల 27వతేదీన తలపెట్టిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ధర్మయుద్ధ మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని మందకృష్ణ మాదిగ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్లు వర్గీకరించడానికి, తీసి వేయడానికి ఎవరికీ అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఎస్సీల్లో అనైతికతకు ఆయన ప్రయత్నించడం తగదని హితవు పలికారు. తిరుపతిలోని యూత్ హాస్టల్ వద్ద జరిగే ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు పనస బంగార్రాజు, రమేష్, మహేష్, చీడిరామకృష్ణ, కార్యవర్గ సభ్యులు సత్తిబాబు, రమణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

లీజు భూమి సర్వేపూర్తి
* తహశీల్దార్ చిన్నారావు
నెల్లిమర్ల, సెప్టెంబర్ 25: నెల్లిమర్ల పాతపోస్ట్ఫాసు వద్ద గల జూట్‌మిల్ లీజు భూమి సర్వే పూర్తి చేసినట్లు తహశీల్దార్ ఆర్. చిన్నారావు తెలిపారు. ఈ లీజు భూమిలో జూట్‌మిల్ యాజమాన్యం నీలగిరి చెట్లు తొలగించి తరలించిన విషయం విదితమే. దీనిపై టిడిపి నాయకులు ఫిర్యాదు మేరకు తొలగించిన చెట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అలాగే యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో జూట్‌యాజమాన్యం ఆర్‌డిఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి రీ సర్వే చేయాలని కోరారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం సర్వేయర్‌తో సర్వే నిర్వహించామని అన్నారు. చెట్లు తొలగించిన భూమి 1.95 సెంట్లు ఉందని, ఇందులో 75 సెంట్లు జూట్‌మిల్ వివాద స్పద స్థలంగా, 1.20 సెంట్లు చంపావతి నది గర్భంగా గుర్తించామని అన్నారు. ఈ సర్వే నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందిస్తామని చెప్పారు. చెట్లు తొలగింపుపై పోలీసు స్టేషన్‌లో యాజమాన్యంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఆపస్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం సంఘం కార్యాలయంలో రాష్ట్ర సలహాదారు యు.ఎ.నరసింహం అధ్యక్షతన జరిగాయి. ఏకగ్రీవంగా జిల్లా కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. జిల్లా శాఖ అధ్యక్షునిగా జాగాన రామునాయుడు, ప్రధాన కార్యదర్శిగా శాంతిమూర్తి, గౌరవాధ్యక్షునిగా జగన్నాథరావు, ఉపాధ్యక్షులుగా బలరామ్‌నాయుడు, నారాయణ, పరమేశ్వరరావు, రమణ, సత్యారావు, కృష్ణవేణి, కార్యదర్శులుగా మూర్తి, కృష్ణంనాయుడు, పైడిరాజు, రంగాచార్యులు, హరిచందన్, ధనలక్ష్మి, కోశాధికారిగా రామనాయుడు, సభ్యులుగా ప్రసాదరావు, మధుసూధనరావు, రమణను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ఎన్నికల అధికారులు పరమహంస, రమణ అభినందించారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 30వతేదీన తలపెట్టిన మహాధర్నాకు ఆపస్ నూతన కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.