విజయనగరం

ప్రజా బ్యాలెట్‌కు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌కు అనూహ్య స్పందన లభించింది. పట్టణంలో అమర్‌భవన్ వద్ద ట్యాంకుబండ్ రోడ్డులో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్ధులు, యువకులు, వ్యాపారులు, కార్మికులు ప్రజాబ్యాలెట్‌లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా? ప్రత్యేక ప్యాకేజి కావాలా? అనే అంశంపై ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. 4500 బ్యాలెట్లను వినియోగించగా 4,497 మంది ప్రత్యేక హోదా కావాలంటూ ప్రజాబ్యాలెట్ ద్వారా అభిప్రాయాన్ని తెలియజేశారు. రాష్టవ్రిభజన వల్ల ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, ప్రత్యేక ప్యాకేజి అందించడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి ఉండదని పలువురు యువకులు అన్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన బిజెపి నాయకులు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు. ఈ ఈ సందర్భంగా ప్రత్యేకహోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ కామేశ్వరరావుమాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బుగత సూరిబాబు, బుగత అశోక్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.