విజయనగరం

పల్లెలకు వెళ్లని తెలుగు వెలుగు బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 7: మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు గొప్పలు చెబుతుండగా, బస్సు సౌకర్యం లేని ఎన్నో గ్రామాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. కేంద్రమంత్రి పి.అశోక్‌గజపతిరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో, రాష్టమ్రంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని ఎమ్మెల్యేగా ఎన్నికైన చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోనూ ఎక్కువ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఆయా గ్రామాల ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు తయారుచేసిన నివేదిక ప్రకారం జిల్లాలో 1457 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 808 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. 649 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించామని చెబుతున్నా 600లకు పైబడి గ్రామాలు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. విజయనగరం డిపో పరిధిలో 464 గ్రామాలు ఉండగా, 296 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇందులో విజయనగర మండలంలో నాలుగు, డెంకాడ మండలంలో 12, పూసపాటిరేగ మండలంలో 21, భోగాపురం మండలంలో 9, గంట్యాడ మండలంలో 32 గ్రామాలకు బస్సు లేదు. గజపతినగరం మండలంలో 19, బొండపల్లి మండలంలో 22, మెంటాడ మండలంలో 23, దత్తిరాజేరు మండలంలో 33, గరివిడి మండలంలో 23, గుర్ల మండలంలో 26, చీపురుపల్లి మండలంలో 23, మెరకముడిదాం మండలంలో 26, నెల్లిమర్ల మండలంలో 23 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
ముఖ్యంగా గృహనిర్మాణశాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో 98 గ్రామాలు బస్సు సౌకర్యానికి నోచుకోలేదు. విజయనగరం డిపో పరిధిలో బస్సు సౌకర్యం కల్పించామని చెబుతున్న 168 గ్రామాలలో 150 గ్రామాలు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు నివేదికలలో పేర్కొన్నారు. పార్వతీపురం డిపో పరిధిలో ఆరు మండలాలలో 434 గ్రామాలు ఉండగా, కేవలం 208 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగతా 226 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ డిపో పరిధిలో అధికశాతం గిరిజన గ్రామాలు ఉండటంతో గిరిజనులు మండల కేంద్రాలకు చేరుకోవాలంటే నరకయాతనలు పడుతున్నారు. ఈ డిపో పరిధిలో గుమ్మలక్ష్మీపురం మండలంలో 119 గ్రామాలు ఉండగా, 70 గ్రామాలకు, జియ్యమ్మవలస మండలంలో 58 గ్రామాలు ఉండగా 16, కొమరాడ మండలంలో 91 గ్రామాలు ఉండగా 65, కురుపాం మండలంలో 91 గ్రామాలు ఉండగా 48 గ్రామాలకు, పార్వతీపురం మండలంలో 18 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అలాగే సాలూరు డిపో పరిధిలో తొమ్మిది మండలాలలో 397 గ్రామాలు ఉండగా, 188 గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంది. మిగతా 209 గ్రామాలు బస్సు సౌకర్యానికి నోచుకోలేదు. ఇందులో సాలూరు మండలంలో 54 గ్రామాలకు, తెర్లాం మండలంలో 31 గ్రామాలకు, మక్కువ మండలంలో 28, పాచిపెంట మండలంలో 33, రామభద్రపురం మండలంలో 23 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఎస్.కోట డిపో పరిధిలో ఉన్న అయిదు మండలాలలో 162 గ్రామాలు ఉండగా, 85 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగతా 77 గ్రామాలు బస్సు సౌకర్యానికి దూరంగా ఉన్నాయి. ఎస్.కోట మండలంలో 24 గ్రామాలు, వేపాడ మండలంలో 19 గ్రామాలు, ఎల్.కోట మండలంలో 17 గ్రామాలు, కొత్తవలస మండలంలో 13 గ్రామాలలో బస్సు సౌకర్యం లేదు. ఆయా డిపో పరిధిలో రోడ్డు సదుపాయం ఉన్న గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు, ఎంపిలు విజ్ఞప్తి చేస్తున్న ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా నష్టాలు వస్తున్నాయనే సాకుతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే తెలుగు(పల్లె) వెలుగు బస్సులను రద్దు చేశారు. ఈ కారణంగా ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వస్తోంది. ఆర్టీసీ అధికారులు రవాణా సౌకర్యం కల్పించకపోవడం వల్ల గ్రామీణ ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం ప్రతీరోజూ విజయనగరం జిల్లాలో పది లక్షల రూపాయల మేరకు ఆర్టీసీకి నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా చీపురుపల్లి, రాజాం, కొత్తవలస, నాతవలస, తగరపువలస, జామి, ఎస్.కోట, గజపతినగరం, సింహాచలం, రామతీర్థం, గంట్యాడ, తెర్లాం, రామభద్రపురం, గర్భాం, మెంటాడ, మక్కువ, గుమ్మలక్ష్మీపురం, బాడంగి తదితర రూట్లలో లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోతోంది. ఇప్పటికైనా అర్టీసీ అధికారులు దృష్టి సారించి మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.